CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 22 Live Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

22 రోజులు.. 2100 కిలోమీటర్లు.. ముగిసిన సీఎం జగన్‌ బస్సు యాత్ర

Published Thu, Apr 25 2024 3:35 PM

CM YS Jagan Memantha Siddaham Bus Yatra Day 22 Live Updates - Sakshi

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో..

CM Jagan Memantha Siddham Bus Yatra Live Updates..

నేటితో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్ర
  • ఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్
  • 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయిన సీఎం జగన్‌
  • 9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్న సీఎం జగన్‌ 
  • ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్ర

అక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

  • అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయి.
  • అక్కవరం, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది.
  • సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారు
  • జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే
  • చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే
  • మూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలి
  • ఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు.
  • పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ.
  • ఈ యాత్ర వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం
  • ఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం.

రాయలసీయ నుంచి ఉత్తరాంద్ర వరకు జన సునామీ చూశాం

  • సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది.
  • విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకువచ్చాం.
  • గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.
  • ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం
  • 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం.
  • పేద ధనిక విద్యార్ధులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం.
  • పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.

కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి

  • మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమేనా?
  • జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం
  • విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం
  • వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులతో ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధం
  • ఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధం
  • లక్షా 35 వేల మంచి ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు సిద్ధం
  • గ్రామస్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం
  • 1వ తేదీ ఇంటికే వచ్చే రూ.3 వేలు పింఛను సిద్ధం
  • మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధం
  • మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి
  • మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం
  • పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు
  • మంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు...అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పని
  • ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ
  • జతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలి
  • అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు
  • దోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటు

చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వను

  • బాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్‌ లాంటి నిజాయితీపరుడు కావాలా?
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు
  • 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
  • రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?
  • ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
  • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • సింగపూర్‌ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
  • ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
  • మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది
  • ఇప్పుడు సూపర్‌ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు..
  • ఇంటికి బంగారం, బెంజ్‌ కారు అంటున్నాడు..నమ్ముతారా?
  • ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్నికాపాడేందుకు మీరంతా సిద్ధమా

మీ జగన్‌ మార్క్‌.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది

  • 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం
  • విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం
  • వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధం
  • ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..
  • 600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం
  • మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..
  • మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..
  • అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..
  • కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..
  • చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?
  • మీ జగన్‌ మార్క్‌.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది
  • మీ జగన్‌ మార్క్‌.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోంది
  • మీ జగన్‌ మార్క్‌.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..
  • మాట మీద నిలబడే మీ జగన్‌ కావాలా?
  • మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి

శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్‌ బస్సు యాత్రకు జననీరాజనం

  • దారిపొడవునా జై జగన్‌ అంటూ నినాదాలు
  • దారి పొడవునా సీఎం జగన్‌ బస్సు యాత్రకు మహిళల హారతులు
  • అభిమాన నేత కోసం ఎండను సైతం లెక్క జేయకుండా తరలివస్తున్న జనం
     

చిన్నారి చికిత్సకు సాయం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్
ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్‌కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్
చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్
కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా సీఎంకి చెప్పిన శ్రీధర్

► నరసన్నపేటకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

ఆముదాలవలస ఫ్లై ఓవర్‌ చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర. 

ఎచ్చెర్ల చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర

చిలకపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం

శ్రీకాకుళం సిద్ధమా?.

 

 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. 

 

 

బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాగా, నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగియనుంది. 

ఇక, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్‌ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.  

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement