కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్‌’ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

కవిత అరెస్టు.. ‘ఈడీ’ ప్రకటనపై ‘ఆప్‌’ ఫైర్‌

Published Tue, Mar 19 2024 10:58 AM

Aap Slams Ed Statement On Brs Mlc Kavitha Arrest - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విడుదల చేసిన ప్రకటనపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) స్పందించింది. ఈడీ భారతీయ జనతా పార్టీ విభాగంలా పనిచేస్తోందని ఆప్‌ నేతలు ఫైరయ్యారు. తమ పార్టీ నేతలకు కవిత రూ.100 కోట్లకుపైగా ముడుపులు చెల్లించారని ఈడీ ఎలా ప్రకటన చేస్తుందని మండిపడ్డారు.

ఈడీ తటస్థంగా వ్యవహరించాల్సిందిపోయి బీజేపీ విభాగంలా తయారేఐ తప్పుడు ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌  కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాల ప్రతిష్ట దెబ్బతీయడానికే ఈడీ తప్పుడు ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌లో రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని ఆప్‌ నేతలు గుర్తు చేశారు.

ఇప్పటివరకు ఈ కేసులో 500కుపైగా సోదాలు జరిపిన ఈడీ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని, ఈ నిరాశ, నిస్పృహలతోనే ఈడీ కవిత అరెస్టుపై ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవితను ఇటీవలే అరెస్టు చేసిన ఈడీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.   

ఇదీ చదవండి.. కవితకు సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ 

Advertisement
 
Advertisement
 
Advertisement