పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

Published Sun, May 12 2024 6:10 AM

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

● కేంద్రాల వారీగా కేటాయింపు ● పార్లమెంట్‌’ పరిధిలో 10,548 మందికి విధులు

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలు, మైక్రోఅబ్జర్వర్స్‌ లోకేషన్‌ చివరి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ శనివారం చేపట్టారు. సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్‌, రిటర్నింగ్‌ అధికారి రాజర్షి షా, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే , నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌ సమక్షంలో ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,200 పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా ఈ కేటాయింపులు చేశారు. 2,637 మంది పీవోవోలు, 2,637 మంది ఏపీవోలు, 5,274 మంది ఓపీవోల చొప్పున మొత్తం 10,548 మందిని ఆ యా నియోజకవర్గాలకు నియమించారు. ఇందులో ఆదిలాబాద్‌ నియోజకవర్గానికి 1,400 మందిని కేటాయించగా, బోథ్‌ నియోజకవర్గానికి 1,468, ఆసిఫాబాద్‌కు 1,708, సిర్పూర్‌కు 1,536, నిర్మల్‌కు 1,468, ఖానాపూర్‌కు 1,476, ముధోల్‌కు 1,492 మందిని కేటాయించారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఎన్నికల అధికారులు, ఈడీఎంలు పాల్గొన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు..

నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు పీవోలు ఏపీవోలు ఓపీవోలు

ఆదిలాబాద్‌ 292 350 350 700

బోథ్‌ 306 367 367 734

ఆసిఫాబాద్‌ 356 427 427 854

సిర్పూర్‌ 320 384 384 768

నిర్మల్‌ 306 367 367 734

ఖానాపూర్‌ 309 369 369 738

ముధోల్‌ 311 373 373 746

Advertisement
 
Advertisement
 
Advertisement