Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: ప్రాణప్రతిష్ట మరుసటిరోజే తెరుచుకున్న రామమందిరం.. పోటెత్తిన భక్తులు

Published Tue, Jan 23 2024 7:05 AM

Ram Temple Here is Puja Schedule Ramlala - Sakshi

అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం(మంగళవారం) మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 

నేటి నుంచి సామాన్య భక్తులు రాములవారి నూతన  విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది.

కాగా రామ్‌ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్‌లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్‌ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గం. వరకు  రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. 

నిత్యపూజలు-సేవలు ఇలా.. 
ఇక ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్‌ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్‌లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు.

రామ్‌లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్‌ నందిని శరణ్ తెలిపారు. 

👉: అయోధ్య రామ్‌ లల్లా దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

Advertisement

తప్పక చదవండి

Advertisement