Sakshi News home page

రాహుల్ గాంధీ సంపద పెరగటానికి కారణం ఇదే..

Published Fri, Apr 5 2024 6:51 PM

Rahul Gandhi Richer than 2019 Details - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా మళ్ళీ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అప్పు సుమారు రూ.49.7 లక్షలుగా ఉన్నట్లు సమాచారం.

రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్లలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో తన సంపద గత ఐదేళ్లలో 28 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఈయన ఐటీసీ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ వంటి బ్లూచిప్‌లతో సహా 25 స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీలలో కూడా రాహుల్ గాంధీ పెట్టుబడి పెట్టారు. ఇవి ఇటీవలి భారీ ర్యాలీని చూశాయి.

2019లో రాహుల్ గాంధీకి ఎలాంటి స్టాక్స్ లేవని ఆ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తరువాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. 2024 మార్చి 15 నాటికి ఆయన స్టాక్స్ పోర్ట్‌ఫోలియో విలువ రూ. 4.33 కోట్లు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో రాహుల్ గాంధీ ఆస్తులు 2019 కంటే 2024లో ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అక్కడ రాహుల్‌ గాంధీ ఇన్వెస్టింగ్‌.. వంద నుంచి వెయ్యి రెట్ల లాభాలు!

Advertisement

తప్పక చదవండి

Advertisement