Five Pilgrims Killed As Landslide Debris Falls On Car In Uttarakhand - Sakshi
Sakshi News home page

విషాదం.. కొండ చరియలు విరిగిపడి అయిదుగురు యాత్రికులు మృతి

Published Sat, Aug 12 2023 10:18 AM

Pilgrims Killed As Landslide Debris Falls On Car - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో విషాం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. యాత్రికులు కేథార్‌నాథ్‌కు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఓ వ్యక్తి గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. రుద్రప్రయాగ జిల్లాలో ఛౌకీ ఫటాలోని టార్సిల్ ప్రాంతంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది.

ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగష్టు 11 నుంచి ఆగష్టు 24 వరకు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. వర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారిపై వెళుతున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు.

కొండచరియలు విరిగిపడడంతో గుప్తకాశి-గౌరీకుండ్ గుండా కేదార్‌నాథ్ దామ్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. కొన్ని జిల్లాలో ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో రెడ్‌, ఆరెంజ్ జారీ అయిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం

Advertisement
Advertisement