Karnataka Home Minister Araga Jnanendra Slams Cops for Take Bribes - Sakshi
Sakshi News home page

పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు

Published Sun, Dec 5 2021 3:10 PM

Home Minister Araga Jnanendra Slams Cops Living Like Dogs Taking Bribe Karnataka - Sakshi

Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని  పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉ‍న్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడిన వీడియో రికార్డింగ్‌ వైరల్‌గా మారింది.

అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement