నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత? | Bihar Vidhan Sabha Seats Partywise In CM Nitish Kumar, Know Details Inside - Sakshi
Sakshi News home page

Bihar Assembly Floor Test: నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?

Published Mon, Feb 12 2024 7:41 AM

Bihar Vidhan Sabha Seats Partywise in CM Nitish Kumar - Sakshi

2024, జనవరి 28.. లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌తో కూడిన మహాకూటమి ప్రభుత్వానికి ముగింపు పలికిన బీహార్‌ సీఎం నితీష్.. బీజేపీ మద్దతుతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపధ్యంలో నితీష్‌ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్‌ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది.

సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నేడు బీహార్ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంది. దీనినే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు ఉండాలి. అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది.

జనవరి 28న మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి సీఎం నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేసినప్పుడు, ఆయనకు బీజేపీ మద్దతు లేదు. ఆయన పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన 78 మంది ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకి అందించింది. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్‌కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్‌ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్‌లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. 

ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్‌భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. 

Advertisement
Advertisement