Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం | Sakshi
Sakshi News home page

Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Published Wed, Jan 26 2022 7:09 PM

5 Storey Building Collapses In Mumbai - Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ బాంద్రాలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంత మంతా భయానకంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బెహ్రం నగర్​ ప్రాంతానికి  చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్​లో చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. పోలీసులు, బృహ‌త్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(బీఎంసీ) అధికారులు కూడా సహయక చర్యలను చేపట్టారు. అధికారులు.. ముందు జాగ్రత్తగా ఆరు అంబులెన్స్​లను, ఐదు ఫైరింజన్​లను ఘటన స్థలం వద్ద ఏర్పాటు చేశారు. 

చదవండి: రిపబ్లిక్​ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం..

Advertisement
 
Advertisement
 
Advertisement