పాత ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

పాత ఇనుప సామగ్రి గోదాములో అగ్నిప్రమాదం

Published Sat, Apr 20 2024 1:40 AM

పాత ఇనుప సామగ్రి గోదాము నుంచి వెలువడుతున్న పొగ - Sakshi

చౌటుప్పల్‌ : ఓ పాత ఇనుప సామగ్రి గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్‌ పట్టణానికి చెందిన సురేష్‌తో పాటు మరికొంత మంది కలిసి పట్టణ శివారులోని శ్రీని ఫార్మా పరిశ్రమ పక్కన ఎకరం స్థలం అద్దెకు తీసుకొని ఓం సాయిరాం స్క్రాఫ్‌ పేరిట పాత ఇనుప సామగ్రి గోదాం ఏర్పాటు చేసుకున్నారు. మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల ను ంచి పాత సామగ్రిని కొనుగోలు చేసి నిల్వ చే స్తుంటారు. ఈ క్రమంలో గోదాం వెనుక భాగంలో ఉన్న పత్తిచేనులో ఉన్న చెత్తను రైతులు తగులబెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో అందులోని నిప్పురవ్వలు ఎగిసివచ్చి పాత ఇనుప సా మగ్రి గోదాంలో పడి మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే మంటలు నలుమూలలుగా వ్యాపించి ప్లాస్టిక్‌ సామగ్రి కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన నిర్వాహకులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ప్లాస్టిక్‌ సామగ్రి కావడంతో మంటలు తీవ్రం..

ప్లాస్టిక్‌ సామగ్రి కావడంతో మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న ఫైర్‌ఇంజన్‌ సరిపోకపోవడంతో పరిసర మండలాల నుంచి మరో రెండు ఫైర్‌ఇంజన్‌లను రప్పించారు. వాటితో పాటు స్థానిక దివీస్‌ పరిశ్రమ నుంచి సైతం అత్యాధునికమైన ఫైర్‌ఇంజన్‌ను రప్పించారు. అదే విధంగా స్థానికంగా ఉన్న ట్రాక్టర్‌లతో నీటిని తెప్పించి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో సుమారుగా రూ.20లక్షల వరకు నష్టం జరిగిందని యజమాని సురేష్‌ తెలిపారు. విషయం తెలియగానే ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌ హరికృష్ణ, సీఐ అశోక్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement