కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్ | Sakshi
Sakshi News home page

కళ అనేది ప్రజలను కలిపే ఆయుధం: తంగలాన్ డైరెక్టర్

Published Mon, Dec 25 2023 4:41 PM

Tamil Director Pa Ranjith Music Meet In KGF Village - Sakshi

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్‌. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో విక్రమ్‌ కథానాయకుడుగా తంగలాన్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో  మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్‌ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్‌లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది.

ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్‌ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్‌ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్‌, కలైయరసన్‌, రచయిత తమిళ్‌ ప్రభ, దర్శకుడు దినకర్‌, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. 


రు.

Advertisement
Advertisement