మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్‌ చెకప్‌ | Sakshi
Sakshi News home page

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్‌ చెకప్‌

Published Mon, Mar 6 2023 2:06 PM

Manchu Vishnu Press Meet Over Free Health Checkup For Maa Members - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులకు ఉచితంగా హెల్త్‌ చెకప్‌ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్‌ చెకప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మా ప్రిసిడెంట్‌ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్  చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు.

'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement