జనతా బార్‌ సందేశం  | Sakshi
Sakshi News home page

జనతా బార్‌ సందేశం 

Published Fri, Apr 12 2024 12:48 AM

Hero Srikanth Launched Laxmirai Janatha Bar Movie Trailer - Sakshi

రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్‌’.  రోచిశ్రీ మూవీస్‌ పతాకంపై అశ్వథ్‌ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. రాయ్‌ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్‌ గర్ల్‌గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం.

ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి

Advertisement
 
Advertisement
 
Advertisement