కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మొద్దు

Published Sat, Nov 18 2023 1:44 AM

ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు - Sakshi

● బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు

మంథని/కాళేశ్వరం/మహదేవపూర్‌/మల్హర్‌: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని మంథని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్‌ కోరారు. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను మధు కలుసుకున్నారు మంథని నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలపై మంత్రికి వివరించారు. కాగా మహదేవపూర్‌ మండలం అన్నారం, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లంలో మధు ఎన్నికల ప్రచారం చేశారు. సర్పంచులు శ్రీపతి బాపు, లస్మయ్య, సురేందర్‌, వసంత, శ్రీనివాసరావు, అన్కారి ప్రకాశ్‌, మక్సూద్‌, యూత్‌ నాయకులు అలీంఖాన్‌, గీతా, సుజాత ఉన్నారు. కాగా, నాగేపల్లి ఎన్నికల ప్రచారంలో పుట్ట మధు కారును గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు. సరస్వతీ(అన్నారం)బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఏటా పంటలు నష్టపోతున్నామని వాగ్వాదానికి దిగారు. కాగా, మల్హర్‌ మండలం ఇప్పలపల్లికి చెందిన మల్లేశ్‌, పెద్దమల్లయ్య, నవీన్‌, చింటూ, మహేశ్‌, ఓంకార్‌, కుమార్‌ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

బీసీ బిడ్డను గెలిపించాలి

ముత్తారం: మంథనిలో బీసీ బిడ్డ పుట్ట మధూకర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లివెల్లి శంకర్‌ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇంటింటా ప్రచారం

మంథని: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధుకు ఓటు వేసి గెలిపించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ మున్సిపల్‌ పరిధి నాలుగో వార్డులోని ఓటర్లను కోరారు. గంగాపురిలో ఇంటింటా తిరుగుతూ బెట్టుపెట్టి ఓటు అభ్యర్థించారు.

బీఆర్‌ఎస్‌లో చేరికలు

రామగిరి: మండలంలోని రత్నాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా వారికి మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధు గెలవాలని పాస్టర్‌ సిమాన్‌బాబు ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. సర్పంచ్‌ పల్లె ప్రతిమ, జెడ్పీటీసీ మ్యాదరబోయిన శారద, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement