'సహజీవనం' అంటే సులువుగా 'సెపరేట్‌ అయ్యే బంధమా? | Sakshi
Sakshi News home page

'సహజీవనం' అంటే సులువుగా 'సెపరేట్‌ అయ్యే బంధమా? సమస్యాత్మకమా? సంతోషంగా సాగే జీవనమా?

Published Sun, Dec 17 2023 12:09 PM

Woman Hit By Lovers Car Dated For 4 Years - Sakshi

సహజీవనం పేరుతో సాగించి బంధాలు చివరికి సన్నగిల్లి అంతం చేసుకునే స్థాయికి వెళ్లిపోతున్నాయి. ఏ ఉద్దేశ్యంతో కలిసి ఉండాలనుకున్నారో ఆ బంధమే వెక్కిరింపుగా మిగిలిపోతుంది. 'సహజీవనం' కాస్త సెపరేట్‌ అ‍వ్వుతోంది. చివరికి మోసానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారి జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదెంత వరకు కరెక్ట్‌? పెళ్లి కంటే సహజీవనమే బెటర్‌ అనేది కొందరి యువత అభిప్రాయం. పైగా ఇరువురి అండర్‌స్టాండింగ్‌తో కలిసుంటాం కాబట్టి సమస్యలొస్తే సెపరేట్‌ అయిపోతాం. సులవుగా రిలేషన్‌ నుంచి బయటపడిపోవచ్చు అనుకుంటున్నారు. అలాంటప్పుడూ ఆ సహజీవనం ఎందుకు నేరాలకు తావిస్తోంది. చివరికి ఎందుకు విషాదాంతంగా మిగిలి అసహ్యమైన బంధాలుగా మిగిలిపోతున్నాయి అనేదాని గురించే ఈ కథనం!.

సమాజంలో ఈ 'సహజీవనం' పేరుతో మోసపోతున్న యువతీయువకుల ఉదంతాలు రోజుకొకటి చొప్పున తెరమీదకు వస్తునే ఉన్నా వాటి ఉచ్చులోనే పడుతునే ఉంటున్నారు. కన్నవాళ్లకి, వారిని నమ్ముకున్న వాళ్లకి తీరని వ్యథని, ఓ కళంకాన్ని మిగిల్చి కటకటాల పాలవ్వడం లేదా చనిపోవడం జరుగుతోంది. అలాంటి ఉందంతమే మహారాష్ట్రలో ప్రియాసింగ్‌ అనే మహిళ విషయంలో చోటు చేసుకుంది.

ఆమె సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్న ఓ సీనియర్‌ బ్యూరోక్రాట్‌ కుమారుడు అశ్వజిత్‌ గైక్వాడ్‌తో ఒకటి, రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్లు సహజీవనం సాగించింది. పూర్తిగా నమ్మింది. కానీ అతడు తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని బయటపెట్ట లేదు. పోనీ ఆ విషయం ఆమె ఎలాగో తెలుసుకున్నాక అయినా కాస్త తెలివిగా బయటకొచ్చే యత్నం చేయక అతడిని మళ్లీ గుడ్డిగా నమ్మింది. ఎందుకిలా చేశావ్‌? అని అమాయకంగా ప్రశ్నించింది. వెంటనే అతడు మాటదాటేసి..తన భార్యతో విడిపోయనన్నాడు. త్వరలో విడాకులు తీసుకున్నాం. నేను నీతోనే ఉంటానని ప్రియాసింగ్‌కి కల్లబొల్లి మాటలు చెప్పాడు.

ఇక్కడ అశ్వజిత్‌ తనకు పెళ్లై అయ్యిందనేది దాచేసినవాడు. తర్వాత చెప్పే ప్రతి మాట ఎంత వరకు నిజం అనేది ప్రియాసింగ్‌ ఆలోచించలేదా, అతడి మీద ఉన్న ప్రేమ లేదా వ్యామోహం ఆ స్థాయిలో ఆలోచించనివ్వ లేదో తెలియదు. కానీ  ప్రియాసింగ్‌ మాత్రం అతడే ఏం చెప్పిన గుడ్డిగా నమ్మింది. ఉన్నటుండి తెల్లవారుఝామున ఫోన్‌ చేసి కలుద్దామని ప్రియాసింగ్‌ని ఫోన్‌ చేసి పిలిపించాడు అశ్వజిత్‌. లోకేషన్‌ కూడా షేర్‌ చేశాడు. తీరా ప్రియాసింగ్‌ అక్కడికి వెళ్లితే తన బాయ్‌ఫ్రెండ్‌ తన భార్య, దగ్గరి స్నేహితులతో కనిపించాడు. ఒక్కసారిగా షాక్‌కి గురైన ప్రియాసింగ్‌ ఏం అర్థంకాక కాసేపు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని భయంభయంగా అడిగింది.

అందుకు నిరాకరించిన ఆ వ్యక్తి ఆమె ఎవరో తెలియనట్లు అరిచి, గొడవకు దిగాడు. పైగా తన స్నేహితులతో దుర్భాషలాడించాడు. చివరికి ఆమెపై దాడికి కూడా దిగాడు. ఏకంగా తన డ్రైవర్‌ చేత కారుని ఆమెపై పోనిచ్చి దారుణంగా గాయపరిచి అక్కడ నుంచి పరారయ్యాడు. చివరికి ఆమె తీవ్రగాయలపాలై ఆస్పత్రిపాలయ్యింది. పైగా తన బాయ్‌ఫ్రెండ్‌ మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఇక్కడ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ గైక్వాడ్‌ కొడుకు. చాలా పరపతి, అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. ఇక్కడ ఆమెకు ఎంత వరకు న్యాయం జరగుతుందనేది కూడా తెలియదు. అస్సలు ఈ కేసు సవ్యంగా నడుస్తుందా? అన్నది కూడా అనుమానమే!. ఇరువురిలో ఎవరిది మోసం అనేది కూడా పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో తెలియాల్సి కూడా ఉంది. 

ఈ రిలేషన్‌లు చివరికి సుఖాంతమేనా..?
సహజీవనం అనే అక్రమసంబంధాలు ఎప్పటికీ పూర్తి స్థాయిలో కడవరకు సవ్యంగా జరగవు. పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధాల్లోనే ఎన్నో సమస్యలు వచ్చి విడిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ.. ఇరువైపుల బంధువుల సమక్షంలో పెళ్లి జరగుతుంది కాబట్టి కొద్దోగొప్పో న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సహజీవనం లాంటి సంబంధాల్లో తమకు ఎవరి మద్దతు, అండదండ లభిస్తుందో యువత ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురయ్యే ఏ సమస్య అయినా అధిగమించగలం అనుకుంటేనే వీటి జోలికి వెళ్లండి.

అలాగే ఇరువురికి ఒకరి నేపథ్యం గురించి ఒకరికి పూర్తి స్థాయిలో తెలుసుండాలి. మొదట్లో ఇద్దరి మధ్య ఏ చిన్న చోట మాట తేడావస్తున్నా.. ఒకరిమీద ఒకరికి ఉన్న మోజులో అది చిన్న విషయంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఇరువురి మధ్య గొడవలొస్తోయే అప్పుడే ప్రతి విషయం పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తించుకోండి ఏ బంధంలో అయినా దాపరికాలు ఉండకూడదు. అప్పుడే ఆ బంధం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకొకటి ఇలాంటి (సహజీవనం)బంధాల వల్ల కచ్చితంగా మానసిక ప్రశాంతతకు దూరం అయ్యి మిమ్మల్ని మీరే కోల్పోతారు. సహజీవనం చేయాలనుకుంటే అవతలి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉందంటేనే సాగించండి. అది కూడా హద్దుల్లోనే మీ స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులకు కూడా ఆ వ్యక్తి గురించి తెలియజేయండి.

ఆ తర్వాత ఎప్పుడైనా ఆ రిలేషన్‌లో ఎలాంటి సమస్య వచ్చినా..మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మొదట్లో మీకు మద్దతు ఇవ్వకపోయినా, కనీసం మనకు ముందుగా తెలియజేసింది కదా! అన్న ఫీల్‌తో మనసు మార్చుకుని మీకు సపోర్ట్‌ లేదా సాయం చేసే అవకాశం ఉంటుంది. పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లగలం అనే నమ్మకం ఉంటే వాటి జోలికి వెళ్లండి. లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట విని వారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. ఎందులోనైనా సమస్యలు వస్తాయి. దీన్ని కాదనలేం. కానీ పెద్దల సమక్షంలో జరిగితే..‍ అన్యాయమైతే ఇంట్లో వాళ్లు ఆదుకుంటారు లేదా స్నేహితులైనా సాయం చేయగలుగుతారు. సమాజం నుంచి కూడా కొద్దోగొప్పో మద్దతు లభిస్తుంది. బహుజాగ్రత్తగా ఆలోచించి రిలేషన్స్‌ విషయంలో మంచిగా అడుగులు వేయండి. జీవితం గజిబిజి అయ్యి, నరకంగా మారదు. ఏదైనా మన చేతిలోనే ఉందనేది మరచిపోకండి. 

(చదవండి: పుట్టింటికి భార‌మై.. మెట్టింటికి దూర‌మై.. జీవితాన్ని యోగవంతం  చేసుకుంది!)

Advertisement
Advertisement