రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల  ప్రదానోత్సవం | Sakshi
Sakshi News home page

రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త, మానవతావాది, కలియుగ కామధేను: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్

Published Thu, Aug 31 2023 10:41 PM

Raghavendra Swami Is A Great Philosopher Says Governor Abdul Nazir - Sakshi

కర్నూలు/మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని  రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం  శ్రీ  రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా  మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను  ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట వ్యక్తులుగా పేరు గాంచిన ప్రముఖులకు  రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో  శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులు ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్  చైర్మన్, ముంబై, విద్వాన్ రామ విఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు  విశ్వనాథ్ డి.కరడ్, పూణే గార్లకు రాష్ట్ర గవర్నర్  సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను  ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ  శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారని, భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారని పేర్కొన్నారు. తుంగ భద్రా తీరంలో వెలిసిన  మంత్రాలయం ప్రముఖ పుణ్య క్షేత్రం అని ప్రశంసించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం  ప్రస్తుత పీఠాధిపతి శ్రీ  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తుల కోసం  ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వ్యాస తీర్థ స్కీం, అన్నదాన స్కీం, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాణదాన స్కీం, గోరక్షణ కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సర్వ జన శాంతి పీఠం అని గవర్నర్ కొనియాడారు. శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.

అనంతరం  శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం అందచేశారు. సన్మాన గ్రహీతలు చేస్తున్న సేవలను అభినందించారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు  ప్రసంగిస్తూ, శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వీర వెంకట శ్రీశానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ తండ్రి ఎస్.గిరియాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అది వైఎస్సార్‌సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట

Advertisement
Advertisement