ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..! | A Place In America New Mexico Which Is Called A Miracle, Check Story Inside - Sakshi
Sakshi News home page

ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..!

Published Sun, Mar 24 2024 2:44 PM

A Place In America New Mexico Which Is Called A Miracle - Sakshi

సాధారణంగా వసంత సంరంభమంతా చెట్లు చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. ఎడారుల్లో వసంతరాగం దాదాపుగా వింతే! వసంతకాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ‘ఎడారిలోన పూలు పూచెనెంత సందడి’ అను పాడుకోక తప్పదు. ఈ పొటోలు అమెరికా న్యూమెక్సికోలోని ‘వైట్‌ శాండ్స్‌ నేషనల్‌ మాన్యుమెంట్‌’ ప్రాంతంలో తీసినవి.

వైట్‌ శాండ్స్‌ నేషనల్‌ మాన్యుమెంట్‌ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది ఎడారి. ఇక్కడ ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతుంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టుచేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడమంటే, ఊహాతీతమైన సంగతే! ఈ ఎడారిలోని ఇసుక జిప్సమ్‌ స్ఫటికాల రేణువులతో నిండి ఉండటంతో చాలా తెల్లగా కనిపిస్తుంది.

ఈ ఇసుక తిన్నెలు ముప్పయి నుంచి అరవై అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తుంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తుంటాయి. ఇటీవల అలాంటి అరుదైన దృశ్యమే ఈ ఎడారిలో కెమెరాకు చిక్కింది.

ఇవి చదవండి: ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!?

Advertisement
 
Advertisement
 
Advertisement