పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా | Sakshi
Sakshi News home page

పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా

Published Tue, May 14 2024 10:48 AM

Elderly Woman's Traditional Banana Ripening Technique

పండ్లు తొందరగా పక్వానికి రావడానికి ఇటీవల కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కాల్షియం కార్పైడ్‌, ఇథలిన్‌ వంటి రసాయానాలతో పండ్లను మాగబెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి రసాయనాలు కారణంగా ప్రాణాంతక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా రైతులను, విక్రయదారులను ఇలాంటి రసాయనాలు వినియోగించొద్దని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి కూడా. అయితే పూర్వకాలంలో పండ్లను మాగబెట్టడానికి ఒక టెక్నిక్‌ ఉపయోగించేవారు. అది కూడ సహసిద్ధమైన రీతిలో మాగబెట్టవేరు. అదెలోగా ఓ బామ్మ చేసి చూపించింది. 

ఎలాగంటే..ఓ బామ్మ అరటి పండ్లను పూర్వకాలంలో ఎలా ముగ్గబెట్టేవారో చేసి చూపించింది. అరటి చెట్టుకి కాసిన గెలను కోసి చక్కగా దాన్ని భూమిలో కొద్దిమేర గొయ్యి తీసి దాంట్లో ఈ అరటి గెలను ఉంచింది. తర్వాత ఓ మట్టి పాత్రలో బొగ్గులను రాజేసి దాన్ని కూడా అరటిపండ్ల గెల ఉన్న చోట పెట్టి పైన ఆరటి ఆకులతో కప్పి ఉంచింది. ఆ తర్వాత పైన మరిన్ని ఎండిన​ కొబ్బరి ఆకులను మట్టిని కూడా వేసి అలా రెండు రోజులు వదిలేసింది.  

ఆ తర్వాత రోజు చూస్తే చక్కగా మంచి సువాసనతో ముగ్గిపోయి ఉన్నాయి అరటి పండ్లు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పండ్లు ముగ్గేంత వరకు చెట్టుకే ఎందుకు ఉంచరు అని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రసాయనాలకు బదులుగా పూర్వకాలంలో ఉపయోగించిన ఈ టెక్నిక్‌ అద్భుతంగా ఉంది. ఎలాంటి దుష్పభావాలు లేని ఆరోగ్యకరమైన టెక్నిక్‌ అంటూ ఆ బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు.

(చదవండి:  మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారంటే..)

 

Advertisement
 
Advertisement
 
Advertisement