లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్‌ సంగతులు | Do You Know What Would Happen Without Leap Day, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Leap Day Importance In Telugu: లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్‌ సంగతులు

Published Wed, Feb 28 2024 11:49 AM

Do you know What Would Happen without Leap Day - Sakshi

Leap year 2024:  భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి  365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి, దాదాపు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి  అదనంగా ఒక రోజు వస్తుంది.  అలా 366  రోజులు ఉండే  సంవత్సరాన్నే  లీప్‌ ఇయర్‌ అంటాం. అలా  2024 ఏడాదికి  366 రోజులుంటాయి.   

లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది?
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది అనుకున్నాం కదా! లీప్ సంవత్సరాన్ని నాలుగుతో భాగిస్తే శేషం ఖచ్చితంగా సున్నా వస్తుంది.  కానీ 100తో కూడా భాగింపబడితే మాత్రం అది లీప్ సంవత్సరం కాదు.   ప్రతీ ఏడాదిలా కాకుండా లీప్‌  ఫిబ్రవరి నెలలో  29 రోజులుంటాయి

నాలుగేళ్లకొకసారి లీప్‌ డే ఉంటుందా?  ఇంట్రస్టింగ్‌ లెక్కలు
అయితే, ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ డే జోడించడదనీ, క్యాలెండర్‌ను 44 నిమిషాలు పొడిగింపు  మాత్రమే ఉంటుందని  వాషింగ్టన్ డీసీలోని  నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం నిపుణులు అంటున్నారు. కాలక్రమేణా, అంటే వేసవి నవంబర్‌లో వస్తుందని బర్మింగ్‌హామ్‌లోని అలబామా విశ్వవిద్యాలయ ఫిజిక్స్  బోధకుడు యూనాస్ ఖాన్ అన్నారు.

ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్లకొకసారి లీప్‌ ఇయర్‌ వస్తుందనీ,  1700, 1800, 1900 సంవత్సరాల్లో లీప్‌ డే లేదని తెలిపారు. 2000 సంవత్సరంలో ఒక లీప్ డే ఉంది, ఎందుకంటే ఇది 100, 400 రెండింటితో భాగించబడే సంవత్సరం.  అలాగే తరువాతి 500 సంవత్సరాలలో 2100, 2200, 2300 , 2500లో కూడా  లీప్ డే ఉండదు.  మళ్లీ 2028, 2032, 2036లో లీప్ డేస్ ఉంటాయి. లీప్ డే ఆలోచన కాలక్రమేణా క్యాలెండర్ మార్పు అభివృద్ధి చెందిందని నిపుణులు అంటున్నారు. 

లీప్  డే  కలపపోతే ఏంటి? 
భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు ఒ​క రోజు, అంటే  24 గంటల సమయం పడుతుంది. అలాగే  భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక నాలుగేళ్ల పాటు నాలుగు పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని  ఫిబ్రవరిలో నెలలో పెట్టారు. ఈ  లీప్ డే లేకపోతే, రైతులు సరైన సీజన్‌లో నాటడానికి ఇబ్బంది పడవచ్చంటారు ఖాన్‌. అంతేకాదు క్రిస్మస్ వేసవిలో వస్తుంది. అప్పుడు స్నో ఉండదూ.. క్రిస్మస్ ఫీలింగూ ఉండదు అంటారాయన.

నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు ఆరు గంటలు ఎక్కువ.  ఈ నేపథ్యంలో నాలుగేళ్లకొకసారి ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులొస్తాయని నాసా చెబుతోంది. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది.  నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్‌ను  రూపొందించారు.  ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఈక్వినాక్స్  అయనాంతం వంటి వార్షిక సంఘటనలకు నెలలు కనెక్ట్ అయ్యేలా చూసుకోవడానికి ఈ అదనపు రోజు ఉపయోగిస్తారని  కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement