గ్లాసీ స్కిన్‌ సీక్రెట్‌ : కొరియన్‌ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే! | Sakshi
Sakshi News home page

గ్లాసీ స్కిన్‌ సీక్రెట్‌ : కొరియన్‌ బ్యూటీలు కూడా కుళ్లు కోవాల్సిందే!

Published Thu, Mar 21 2024 3:44 PM

check these amazing tips for korean skin care routine for glossy skin - Sakshi

మెరిసే చర్మం, మచ్చలేని అందమైన ముఖం అనేగానే అందరికీ గుర్తొచ్చేది కొరియన్‌ బ్యూటీస్‌. అందులోనూ ఇటీవల కొరియన్‌ బాండ్‌ మ్యూజిక్‌, సినిమాలు, సిరీస్‌లపై యూత్‌లో బాగా క్రేజ్‌ పెరిగింది. దీంతో కొరియన్‌ బ్యూటీల్లాగా గ్లాసీ స్కిన్‌తో మెరిసి పోవాలని కోరుకోవడం సహజమే. అందుకే  మచ్చలేని మహారాణి, రాజులా మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు  పాటించండి.

ఫేషియల్‌ ఎక్స్‌ర్‌సైజ్‌
ముందుగా వ్యాయామాలు చాలా ముఖ్యం. శరీర ఆకృతికి వ్యాయామాలు చేసినట్టుగానే ముఖానికి కొన్ని నిర్దేశిత వ్యాయామాలున్నాయి. రోజులో రెండు సార్లు కచ్చితంగా చేస్తే వీ-జాలైన్‌ మీ సొంతమవుతుంది. సరిపడినన్ని నీళ్లు  తాగడం చాలా కీలకం.

క్లెన్సింగ్‌ 
కొరియన్ గ్లాస్ స్కిన్  కావాలంటే  డీప్ క్లెన్సింగ్ కీలకం.  నీరు, గ్లిజరిన్ వంటి మాయిశ్చరైజర్లు , తేలికపాటి సర్ఫ్యాక్టెంట్లనుతో తయారుచేసిన మైకెల్లార్ క్లెన్సింగ్ వాటర్‌తో ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇది ఆల్కహాల్‌ ఫ్రీ కూడా. చర్మాన్ని టోన్ చేస్తుంది.  క్మురికి, మేకప్, ఆయిల్‌ను డీప్‌గా శుభ్రం చేస్తుంది.  లేదంటే నిమ్మకాయ కలిపిన ఫేస్‌వాష్‌తో అయినా శుభ్రం చేసుకోవచ్చు.

పులిసిన బియ్యం కడిగిన నీళ్లు
ఫేస్‌వాష్‌లు, కెమికల్‌ సబ్బుల జోలికిపోకుండా రైస్‌ వాటర్‌ను ఫేస్‌ వాష్‌గా వాడతారట కొరియన్స్‌. ఇది న్యాచురల్‌ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది. శుభ్రంగా కడిగిన బియ్యం నానబెట్టిన నీటి, తరువాత  వడకట్టుకోవాలి. 24 గంటలు దీన్ని పులియ నివ్వాలి. మేజిక్ వాటర్‌తో  ముఖం కడుక్కుంటే ప్రకాశవంతంగా తేమగా ముఖం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణలో పెరుగు చాలా ముఖ్యమైన భాగం.  పెరుగులో కొద్దిగా కస్తూరి పసుపు కలిపి, ఈ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 

ఫేస్‌ మాస్క్‌ 
తేనె, నిమ్మరసం మాస్క్‌,  గ్రీన్‌ టీ మాస్క్‌, చార్‌కోల్ సీరమ్ ఫేస్ మాస్క్ లేదా గ్రీన్-టీ సీరమ్ షీట్ మాస్క్‌ని ఉపయోగించి  గ్లాసీ స్కిన్‌ను కూడా పొందవచ్చు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది. 

నిమ్మరసం, తేనె మాస్క్‌ చర్మంపై పేరుకున్న మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి తేమనందిస్తుంది. నిమ్మరసం టాన్‌ తొలగించి, స్కిన్‌ టోన్‌ లైట్‌ చేస్తుంది. 

చర్మాన్నిఆరోగ్యంగా, ముడతల్లేకుండా ఉంచేందుకు వాష్‌క్లాత్‌లతో ముఖాన్ని మసాజ్‌  చేస్తారు. గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి, సున్నితంగా (ఎగువ దిశలో) తుడవాలి. దీంతో  దుమ్ము , ధూళిని తొలగి తేటగా అవుతుంది.

ట్యాపింగ్‌ 
ఫేషియల్ రిలాక్సేషన్ కోసం ట్యాపింగ్ టెక్నిక్‌ను కొరియన్లు బాగా వాడతారు. ఇది చర్మానికి మంచి రక్షణ అందించడంతోపాటు, రక్త ప్రసరణను పెంచుతుంది.  అంతేకాదు తొందరగా వయసు సంబంధిత ముడతలు రాకుండా కాపాడుతుంది.

టోనింగ్‌ అండ్‌  క్లీనింగ్‌ 
కొరియన్ చర్మ సంరక్షణలో మరో ముఖ్యమైంది టోనింగ్. పురాతన కాలంలో, కొరియన్లు తమ చర్మాన్ని టోన్ చేయడానికి దోసకాయ, టమోటా, పుచ్చకాయ వంటి సహజంగా నీరు లభించే వాటిని ఉపయోగించేవారట. కాబట్టి ఏదైనా టోనర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ పదార్థాలను గుర్తు పెట్టుకొంటే మంచిది. 

వీటితోపాటు, జెన్సింగ్‌, గ్రీన్‌టీ రోస్ట్ బార్లీ టీకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక చివరగా రాత్రి పడుకునే ముందు ముఖచర్మ రక్షణ చర్యల్ని అస్సలు మర్చిపోరు.  ప్రధానంగా అలెవెరా జెల్‌ను ముఖమంతా అప్లయ్‌ చేసుకుని, ఉదయం చల్లటి నీటితో కడుక్కుంటారు. 



 

Advertisement
Advertisement