పుణె హోటల్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ యువతిని కాల్చిచంపిన ప్రియుడు | Woman Techie From Lucknow Shot Dead By Boyfriend In Pune Hotel Room, Accused Arrested - Sakshi
Sakshi News home page

Pune Lover Murder: పుణె హోటల్‌లో దారుణం.. సాఫ్ట్‌వేర్‌ యువతిని కాల్చిచంపిన ప్రియుడు

Published Mon, Jan 29 2024 10:43 AM

Woman Techie Shot Dead by Boyfriend in Pune Hotel Room - Sakshi

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ప్రియుడి చేతితో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలి క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్న ప్రియుడు.. ఆమెను పుణెలోని హోటల్‌కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన పింప్రి చించ్‌వాడ్‌లోని హింజవాడిలో ఓయో టౌన్‌ హౌజ్‌లో ఆదివారం వెలుగుచూసింది. నిందితుడిని రిషబ్‌ నిగమ్‌గా గుర్తించిన పోలీసులు ముంబైలో అతడిని అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన వందన ద్వివేది అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీసంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని పనిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రిషబ్‌ నిగమ్‌కు.. వందనకు పదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వందనను కలిసేందుకు రిషబ్‌ పుణె వచ్చాడు. ఇద్దరు కలిసి హింజవడిలో హోటల్‌లో గదితీసుకొని జనవరి 25 నుంచి అక్కడే ఉంటున్నారు.  

అయితే శనివారం రాత్రి వందనను తుపాకీ కాల్చి చంపిన రిషబ్‌.. అనంతరం హోటల్‌ నుంచి పరారయ్యాడు. ఆదివారం హోటల్‌ సిబ్బందికి గదిలో వందన మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వందనపై అనుమానం పెంచుకుని, ఆమెను చంపేయాలన్న ఆలోచనతోనే పుణె వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వందనను కాల్చి చంపిన తరువాత శనివారం రాత్రి 10 గంటలకు ఒక్కడే గది నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. హత్య అనంతరం నిందితుడు ముంబైకు పారిపోవడంతో అక్కడే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి గన్‌ ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి

Advertisement
 
Advertisement
 
Advertisement