ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం.. ప్ర‌మాదంలో ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌! | Sakshi
Sakshi News home page

ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం.. ప్ర‌మాదంలో ఐటీ ఉద్యోగుల భ‌విష్య‌త్‌!

Published Tue, Jan 23 2024 2:36 PM

Us Layoffs Continue In 2024 - Sakshi

అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వ‌డ్డీ రేట్ల పెంపు, ద్ర‌వ్యోల్బ‌ణం వంటి అంశాలు జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫ‌లితంగా చిన్న చిన్న స్టార్ట‌ప్స్ నుంచి బ‌డా బ‌డా టెక్ కంపెనీల వరకూ ఉద్యోగుల్ని తొల‌గిస్తున్నాయి. దీంతో 2024 జాబ్ మార్కెట్ మ‌రింత దారుణంగా త‌యార‌య్యే  అవ‌కాశం ఉంద‌ని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

అందుకు ఊతం ఇచ్చేలా 2022లో అమెరిక‌న్ కంపెనీలు 363,832 మందికి లే-ఆఫ్‌లు ప్రకటించగా.. 2023లో గ‌త ఏడాది అత్య‌ధికంగా  721,677 మందికి ఉద్వాస‌న ప‌లికాయి. ఆ మొత్తం తొలగింపుల్లో 168,032 మంది మెటా, అమెజాన్ ఉద్యోగులేనని  అమెరికాకు చెందిన ప్ర‌ముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజ‌ర్‌, గ్రే అండ్ క్రిస్మ‌స్ తెలిపింది.   


‘లేబ‌ర్ కాస్ట్ ఎక్కువ‌. కాబ‌ట్టే ఈ ఏడాది సైతం సంస్థ‌లు పొదుపు మంత్రం జ‌పిస్తున్నాయి. క్యూ1లో నియామ‌కాలు త‌గ్గించి..ఉద్యోగుల‌కు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని’  ఛాలెంజ‌ర్ గ్రే అండ్ క్రిస్మ‌స్ సంస్థ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.  



టెక్‌ కంపెనీల్లో ఎక్కువే 
కోవిడ్‌-19 వంటి సమయాల్లో ఓ వెలుగు వెలిగిన ఐటీ రంగం.. కృత్తిమ మేధ వంటి టెక్నాలజీ కారణంగా నేల చూపులు చూస్తోంది. ఆర్ధిక మాంద్యం, ప్రాజెక్ట్‌ లేమి వంటి సమస్యల్ని ఎదుర‍్కొంటున్న ఆయా టెక్‌ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందుకు ఏఐ టెక్నాలజీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయని ఆండీ ఛాలెంజ‌ర్ తెలిపారు. 


టెక్నాలజీ తర్వాత ఈ రంగాల్లో తొలగింపులు ఎక్కువే
ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్ధిక సామ‌ర్ధ్యాల‌కు అనుగుణంగా ఉద్యోగుల్ని నియ‌మించుకునేలా క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు ఛాలెంజ‌ర్ చెప్పారు. 2023లో రీటైల్ కంపెనీలు 78,840 మందిని తొల‌గించాయి. ఈ ఏడాది సైతం రీటైల్‌ రంగంలో తొలగింపులు ఉంటాయన్న ఛాలెంజర్‌..ఆ రంగం త‌ర్వాత హెల్త్‌కేర్‌, ప్రొడ‌క్ట్ మ్యానిఫ్యాక్చ‌రింగ్‌ రంగాలు ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి : ఉద్యోగులపై లేఆఫ్స్‌ కత్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement