టెక్నాలజీతో జరుగుతున్న మోసాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Sakshi
Sakshi News home page

AI Technology: టెక్నాలజీతో జరుగుతున్న మోసాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Published Mon, Dec 18 2023 6:06 PM

Precautions To Be Taken In Fraud With Technology - Sakshi

టెక్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ' (AI). అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టెక్నాలజీ ఈ రోజుల్లో అనేక రకాలుగా ఉపయోగపడుతోంది, అదే విధంగా అనర్థాలకు హేతువుగా మారుతోంది. ఈ కథనంలో ఏఐ వల్ల ఎలా డబ్బు పోగొట్టుకుంటున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..

డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన డబ్బు అడగటం.. లేదా ఉద్యోగావకాశాల పేరిట డబ్బు వసూలు చేయడం వంటివి గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో కూడా ఓ వ్యక్తి రతన్ టాటా మాదిరిగా ఓ వీడియో క్రియేట్ చేసి పెట్టుబడులు పెట్టాలని సూచించాడు. 

మరో వ్యక్తి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ట్రేడింగ్‌ యాప్‌లకు ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్లు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మోసపోవడం ఖాయం.

కేవలం పారిశ్రామిక వేత్తల మాదిరిగా కాకుండా టెక్నాలజీ ఉపయోగించి మన కుటుంబ సభ్యులలో ఒకరుగా ఫోన్ చేసి ఒక అకౌంట్ నంబరుకు డబ్బు పంపించమని అడిగితే నిస్సంకోచంగా.. పంపించేస్తాము. బ్యాంకులు కూడా ఇలాంటి లావాదేవాలాను మోసపూరితాలుగా పరిగణించే అవకాశం లేదని తెలుస్తోంది.

కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా కొందరు ఏకంగా సంస్థలను కూడా మోసం చేయడానికి సిద్దమైపోతున్నారు. కొన్ని రోజులకు ముందు ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం మెషీన్లలో డబ్బు రాదంటూ వచ్చిన పుకార్లను నమ్మి ఎక్కువమంది ఆ బ్యాంక్ కష్టంరాలు పెద్ద ఎత్తున తమ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి చర్యల వల్ల ఆ సంస్థల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో డీప్ ఫేక్ ఏది? అసలైనది ఏది? అని వెంటనే గుర్తించలేకపోవడం కూడా ఇలాంటి మోసాలు చేసేవారికి ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. ఇలాంటి డీప్ ఫేక్ భారీ నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.

తీసుకోవాలసిన జాగ్రత్తలు

  • ఏదైనా స్కీమ్స్ ద్వారా ఎక్కువ డబ్బు వస్తుందని తెలిస్తే.. తప్పకుండా దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఆశపడితే నష్టపోవడం తథ్యం. 
  • ఇటీవల లోన్ తీసుకుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవన్నీ నిజం కాదని RBI స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం వినియోగదారులను ఆకర్శించి మోసగించాడనే విషయం తప్పకుండా ప్రజలు గమనించాలి.
  • ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఓటీపీ లేదా పిన్ నెంబర్ వంటి విషయాలను ఇతరులతో పంచుకోకూడదు, ఎందుకంటే ఏ బ్యాంక్ అయినా ఓటీపీ షేర్ చేయమని ఎప్పుడూ అడగదు.
  • కొన్ని సమయాల్లో మీ ఖాతాలో డబ్బు కట్ అయినట్లు.. వెంటనే చెక్ చేసుకోవాలని తెలియని నెంబర్స్ నుంచి మెసేజులు వస్తే, అలాంటి వాటిని నమ్మకపోవడం చాలా వరకు ఉత్తమం.

Advertisement
Advertisement