Do You Know Billionaire Rakesh Jhunjhunwala Largest Cheque - Sakshi
Sakshi News home page

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా: హాట్‌ టాపిక్‌గా ఆ చెక్‌

Published Mon, Aug 14 2023 3:34 PM

Do you konw billionaire Rakesh Jhunjhunwala Largest Cheque - Sakshi

బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా  పాపులర్‌ అయిన బిలియనీర్ రాకేష్  ఝన్‌ఝన్‌వాలా  కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ  ఇప్పటికీ,  దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు  మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి  సూత్రాలను, సక్సెస్‌మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు.  ముఖ్యంగా మార్కెట్‌ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్‌గా  ఉన్నారు. స్టాక్‌మార్కెట్లో  షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. 

రాకేశ్‌ ఝన్‌ఝన్‌ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది.  రేర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి  రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్‌ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుని  భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై  'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్‌జున్‌వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు.

 తన అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ  రేర్‌ (రాకేష్‌, భార్య రేఖా పేర్లలోని లోని తొలి  అక్షరాలను కలిపి) ఎంటర్‌ప్రైజెస్ ద్వారా   ఆగస్ట్ 14, 2022  నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్‌గా ర్యాంక్‌ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు.

కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి  భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి  పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్‌ఝన్‌ వాలా అందుకున్నారు 

Advertisement
 
Advertisement
 
Advertisement