Today Telugu Horoscope: ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

Published Thu, Apr 25 2024 7:02 PM

Daily Horoscope: Rasi Phalalu On April 24 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.5.39 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: విశాఖ రా.1.24 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ఉ.5.53 నుండి 7.33 వరకు, తదుపరి తె.5.35 నుండి 7.15 వరకు,దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.40 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.42, సూర్యాస్తమయం: 6.13. 

మేషం: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదే వీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం. సత్కారాలు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.  పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

కర్కాటకం: కుటుంబం సమస్యలు. సోదరులు, సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలలో అవరో«ధాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. బాకీలు వసూలవుతాయి. ఆలయదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు చికాకులు.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువిరో«ధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాల విస్తరణలో చికాకులు. ఉద్యోగమార్పులు. కళాకారులకు సమస్యలు ఎదురవుతాయి.

ధనుస్సు: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. వాహనయోగం.

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.

కుంభం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో  అవరోధాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement