ప్రభుత్వ చర్యలు భేష్‌.. సీఎం జగన్‌కు యూనిసెఫ్‌ టీమ్‌ అభినందన | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్‌.. సీఎం జగన్‌కు యూనిసెఫ్‌ టీమ్‌ అభినందన

Published Fri, Sep 1 2023 7:31 PM

UNICEF Field Office Chief Jelalim Tufpesse Met CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ జెలలీమ్‌ బి.టఫ్పెస్సే క్యాంపు కార్యాయంలో కలిశారు. ఈ సందర్బంగా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ సంసిద్థంగా ఉన్నట్టు తెలిపారు. 

అయితే.. వైద్య, ఆరోగ్యం రంగంలోని వివిధ స్థాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌, ఆశా, అంగన్‌వాడీ వర్కర్స్‌, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూసిసెఫ్‌ ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై యూనిసెఫ్‌ బృందంతో సీఎం జగన్‌ చర్చించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరును ముఖ్యమంత్రి జగన్‌ వారికి వివరించారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలను వారు అభినందించారు. 

ఇక, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్‌ ప్లాన్‌, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని యూనిసెఫ్‌ అందిస్తామని తెలిపారు. కాగా, ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు యూనిసెఫ్‌ ప్రతినిధులకు సీఎం జగన్‌ తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో వ్యవసాయ రంగ పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆదేశాలు ఇవే..

Advertisement
Advertisement