శ్రీవారి దర్శనానికి 24 గంటలు | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Published Sun, Sep 11 2022 5:09 AM

TTD Number of devotees has increased in Tirumala - Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్‌లు నిండిపోవడంతో క్యూలైన్‌ రాంభగీచ వరకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,292 మంది శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 30,641 మంది తలనీలాలు ఇచ్చారు. భక్తులు శ్రీవారి హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు.  

శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి 
తిరుమల శ్రీవారిని శనివారం తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలివ్వగా.. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement