-
మాడు వాసనకు బ్రెడ్
ఇంటిప్స్ అన్నం అడుగు భాగం మాడిపోతే పైన కూడా మాడు వాసన వస్తుంది. వైట్ బ్రెడ్ అన్నం పైభాగన పెట్టి 5-10 నిమిషాలు ఉంచితే వాసన తగ్గిపోతుంది. కూరగాయలు తరిగాక, పండ్లు కోసాక వేళ్లు మురికిపట్టినట్టు కనిపిస్తాయి. రంగుకూడా వదలదు. ఇలాంటప్పుడు బంగాళదుంప ముక్కతో రుద్ది, కడగాలి. సూప్, సాస్ తాగిన గిన్నెలు జిడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు లోపలి భాగంలో చిన్న ఐస్‌ముక్క వేసి రుద్దితే జిడ్డు వదిలిపోతుంది.పాస్తా లేదా బంగాళదంపలు, ఇతర కూరగాయల ముక్కలను ఉడికించిన నీటిని మొక్కలకు పోస్తే అవిఏపుగా పెరుగుతాయి. కోడిగుడ్డు మునిగేంత నీళ్లను గిన్నెలో పోయాలి. గుడ్డు పైకి తేలితే గుడ్డు కుళ్లిపోయిందని తెలుసుకోవాలి. సూప్‌లో ఉప్పు ఎక్కువైతే అడుగున తొక్కతీసిన బంగాళ దుంప ముక్క వేసి పది నిమిషాలు ఉంచాలి. అరటిపండ్లను మిగతా పండ్లతో ఉంచితే త్వరగా కుళ్లిపోతాయి. అందుకని అరటిపండ్లను ఎప్పుడూ విడిగానే ఉంచాలి. -
ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!
90 నిమిషాల పాటు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉండాలి.... ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కాళ్లు అడ్డుపెట్టి పడేసినా లేచి బంతిని అందుకోవాలి. నిజానికి ఫుట్‌బాల్ మైదానంలో ఉన్నంతసేపు ఆటగాళ్లు మొరటుగా, బండల్లా కనిపిస్తారు. మరి వాళ్లకి అంత శక్తి ఎలా వస్తుంది? అంటే... దీనికీ ఓ లెక్కుంది. ఎంత పడితే అంత... ఎలా పడితే అలా తింటామంటే కుదరదు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలంటే కచ్చితంగా ఓ లెక్క ప్రకారం తినాల్సిందే. ఫుట్‌బాల్‌లో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతోపాటు అది తనకు అడ్డంకి కాకుండా కూడా చూసుకోవాల్సివుంటుంది. వేగం, చురుకుదనం కోల్పోకుండా నియంత్రించుకోవాల్సివుంటుంది. మైదానంలో చివరి నిమిషం దాకా పోరాడగలగాలంటే అందుకు తగ్గట్లుగానే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ఆటగాళ్లు అత్యంత శ్రద్ధతో ఉంటారు. డైటీషియన్ల సూచనలకు అనుగుణంగా నడచుకుంటూ.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటుంటారు. అయితే వీరి ఆహారంలో అత్యధికంగా 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. శరీర బరువుకు తగినట్లుగా.. మ్యాచ్ ఆడే రోజైనా, సాధనలో పాల్గొనేందుకైనా ఫుట్‌బాల్ ఆటగాళ్లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను వారి శరీర బరువుకు తగినట్లుగా సమతుల్యంగా తీసుకుంటుంటారు. ఇందుకు ప్రతి పౌండ్ శరీర బరువుకు 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభించేలా ఆహారం తీసుకుంటారు. కఠోర సాధనలో పాల్గొనాల్సిన సందర్భంలో గరిష్టంగా 4 గ్రాముల వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారంగా తీసుకునే తృణ ధాన్యాలు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్లలో ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటితోపాటు స్పోర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లోనూ, చక్కెర, జామ్, తేనె వంటి తీపి పదార్థాల్లోనూ పళ్లు, పళ్ల రసాల వంటి వాటిలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఇలాంటి పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక పౌండ్ శరీర బరువుకు రోజుకు 0.7 నుంచి 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.45 గ్రాముల కొవ్వు పదార్థాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్.. ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆహార నియమాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా పూర్తిగా వారి డైటీషియన్ల సూచనల మేరకు ఉంటాయి. మ్యాచ్ ఆడాల్సిన రోజు బరిలోకి దిగేందుకు రెండు గంటల ముందే అల్పాహారం చేస్తారు. వేయించిన కేక్‌లు, ఎగ్ శాండ్విచ్లు, ఉడికించిన గుడ్లు, చక్కెర కలిపిన గోధుమలు వంటి పదార్థాలతోపాటు ద్రాక్ష, అరటి, యాపిల్, నారింజ వంటి పండ్లు, గ్లాసు పాలు తీసుకుంటారు. అయితే అన్నింట్లోనూ కొవ్వు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడతారు. తేలికైన లంచ్ మ్యాచ్‌లో ఆడాల్సివున్నా, శిక్షణలో పాల్గొనాల్సివున్నా అతిగా భోజనం చేయడం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున తేలికైన లంచ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో తగినంత శక్తి కూడా అవసరమైనందున కొద్దిమోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలతోపాటు బీన్స్, బీట్స్, క్యారెట్ వంటి వాటితో చేసిన సలాడ్లు తీసుకుంటారు. శాండ్విచ్లు వెజిటబుల్ సూప్‌లు, మాంసంతోగానీ, మాంసం లేకుండా గానీ పాస్తాలు, ఉడికించిన మాంసం భుజిస్తారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో భోజనం చేయాల్సివస్తే.. గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్లు, రోస్ట్ బీఫ్ శాండ్విచ్లు, బేక్ చేసిన ఆలుగడ్డలు, సలాడ్ బార్స్ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనం పుష్టిగా... మ్యాచ్‌లో ఆడి అలసిపోయిన శరీరానికి తిరిగి శక్తినిచ్చే విధంగా రాత్రిభోజనం ఉంటుంది. ఉడికించిన లేదా బేక్ చేసిన మాంసం, నత్తలతో కూడిన టమాటో సాస్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటారు. నూనెలు ఎక్కువగా లేని కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. లంచ్‌కు రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ తీసుకుంటారు. వీటిలో ఎండిన రోస్టెడ్ నట్స్, బ్రెడ్, తాజా పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
‘అర్బన్’ పోరు రూ.3.55 కోట్లు
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
వాన నీటిలో ‘పరుపు’ ప్రయాణం.. వీడియో వైరల్
బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్ట్
దెయ్యం సినిమాలో మృణాల్.. మరి ఒప్పుకొంటుందా?
సంతకం చేయండి.. మార్పు డిమాండ్ చేయండి
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
వయనాడ్‌కే రాహుల్ టాటా!
Advertisement