-
Pulsar Bike Singer Ramana And Kundana: గ్రాండ్‌గా పల్సర్ బైక్ సింగర్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్
పల్సర్ బైక్ సాంగ్‌తో ఫుల్ ఫేమస్ అయ్యాడు జానపద కళాకారుడు సింగర్ రమణ. ఈ పల్సర్ బైక్ సాంగ్‌ను రవితేజ ధమాకా మూవీలోనూ వాడేశారు. ఈ ఒక్కటేనా.. 'పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..', 'వస్తావా.. భాను వస్తావా..' ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాడు. బుల్లితెర షోలలో, ఈవెంట్లలో పాటలు పాడుతూ ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బేబి 2 పేరుతో ఓ షార్ట్ ఫిలిం కూడా చేశాడు. తన జీవితంలో జరిగిన రియల్ బ్రేకప్ స్టోరీ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు. ఇకపోతే రమణ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్ నెలాఖరులో అతడి ఎంగేజ్మెంట్ జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. కుందన శ్రీ అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ స్టేజీపై ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని ఫోటోలకు పోజిచ్చారు. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ వేదికపైనే ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. చదవండి: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు -
పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?
యూత్ డ్రీమ్ బైక్ ఏదీ అంటే పల్సర్ బైక్ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు. అలాంటి ఐకానిక్ పల్సర్ బైక్‌ను భారత దేశంలో పరిచయం చేసిన బిలియనీర్, రాహుల్ బజాజ్ కుమారుడు రాజీవ్ బజాజ్. కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ బజాజ్ పల్సర్ లైన్ మోటార్ బైక్‌లను లాంచ్ చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. యువతరం అభిరుచులకు అనుగుణంగా ఇవి రావడంతో బజాజ్ కష్టతరమైన వ్యాపారాన్ని మలుపు తిప్పింది. బజాజ్ ఆటో సీఎండీ రాజీవ్ నికర విలువ తదితర విశేషాలు తెలుసుకుందాం! (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ పెద్ద కుమారుడు. 90వ దశకం చివరలో తన కుటుంబ వ్యాపారంలో చేరినప్పుడు, దేశీయ తిరుగులేని ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ కష్టాల్లో ఉంది. అంతర్జాతీయ జాయింట్ వెంచర్ కంపెనీలచే తయారైన మోటార్‌సైకిళ్లను నెమ్మదిగా కోల్పోతోంది. ఈ సమయంలో రాజీవ్ తన సొంత మోటార్‌సైకిళ్లను తయారీపై ఫోకస్ పెట్టారు. అలా బజాజ్ పల్సర్ మార్కెట్లోకి వచ్చింది. ఇక అప్పటినుంచి టూ వీలర్ మార్కెట్లో దూసుకుపోతున్నారు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్) ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో. మహాత్మా గాంధీ ఆరాధకుడైన జమ్నాలాల్ బజాజ్ (రాజీవ్ ముత్తాత) 1926లో ఈ సంస్థను స్థాపించారు. ఆతరువాత దివంగత రాహుల్ బజాజ్( రాజీవ్ తండ్రి) ఫిబ్రవరి 2022లో మరణించే వరకు ప్రముఖ బజాజ్ గ్రూప్‌కు ఎమెరిటస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2001లో భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, స్టాక్ మార్కెట్ పతనం ఇది కంపెనీపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒకదశలో బజాజ్ ఆటో త్వరలో మూసివేయబడుతుందని అంచనాలుకూడా వచ్చాయి. ప్రస్తుతం సీఎండీగా రాజీవ్ కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. కంపెనీ కొత్త లాంచింగ్స్, టెక్నాలజీని అందిపుచ్చుకుని కంపెనీని అభివృద్ధిలో నడిపిస్తున్నారు. ద్విచక్ర వాహనం, బజాజ్‌ఫిన్ సర్వ్(ఆర్థిక సేవలు), ఎలక్ట్రికల్ ఉపకరణాల పరిశ్రమలతో సహా 40 వ్యాపారాలు ఈ రోజు బజాజ్ గ్రూప్‌లో ఉన్నాయి. రాజీవ్ బజాజ్ ఎవరు? 1966 డిసెంబర్ 21న రాజీవ్ బజాజ్ జన్మించారు. 2005లో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని మలుపు తిప్పిన ఘనతను సాధించిన పల్సర్ లైన్ మోటార్‌బైక్‌లతో పాటు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) సహా కొత్త ఉత్పత్తులతో ప్రతిభను చాటు కుంటున్నారు. పూణేలోని అకుర్డిలో, రాజీవ్ బజాజ్ సెయింట్ ఉర్సులా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత 1988లో పూణే విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని, 1990లో వార్విక్ విశ్వవిద్యాలయం నుండి మాన్యుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు బజాజ్ ఆటోకు తయారీ, సరఫరా గొలుసు (1990-95), R&D,ఇంజనీరింగ్ (1995-2000), మార్కెటింగ్ అండ్ సేల్స్ (2000-2005) విభాగాల్లో సేవలందించారు. ఏప్రిల్ 2005 నుండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం 2022లో రాజీవ్ బజాజ్ నికర విలువ రూ. 35,600 కోట్లు (4.3 బిలియన్లు డాలర్లు). రాజీవ్‌కు యోగా అన్నా హోమియోపతీ వైద్య విధానం అన్నా చాలా ఇష్టమట. రాజీవ్ బజాజ్‌కి ఇష్టమైన సినిమా సన్నివేశాలలో ఒకటి చాలా ఆసక్తి కరం. 2004 నాటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ట్రాయ్ మూవీ ప్రారంభ సన్నివేశం అంటే ఇష్టం. ఈ దృశ్యాన్ని తన సహోద్యోగులకు చూపించి మరీ కంపెనీని ముందుకు తీసుకుపోయేలా ప్రోత్సహిస్తారట. గొప్ప యోధునిగా గుర్తుంచుకోవడానికి గ్రీకు యోధుడు ఎచిల్లీస్ (బ్రాడ్‌పిట్ హీరో) పడిన తపనను గుర్తు చేసేవారట. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, రాజీవ్ సోదరుడు సంజీవ్ కూడా బిలియనీరే. రాహుల్ బజాజ్ చిన్న కుమారుడు సంజీవ్ బజాజ్దక్షిణ ముంబైలోని అత్యంత విలాసవంతమైన రూ.104 కోట్ల విలువైనఅపార్ట్మెంట్లను కొనుగోలు చేయడం విశేషం. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో బజాజ్ కుటుంబం ఒకటి. ఆ బ్యాంకును దోచుకోక తప్పదు రాయల్ ఎన్ఫీల్డ్ ఆధిపత్య సెగ్మెంట్లో పోటీపై స్పందించిన రాజీవ్ ప్రముఖ అమెరికన్ దొంగ విలియం సుట్టన్ ఉదాహరణతో తన కంపెనీ ఎత్తుగడలను సమర్థించుకోవడం గమనార్హం. అమెరికాలో విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ అనే ప్రసిద్ధ బ్యాంకు దోపిడీదారుడున్నాడు. మీరు బ్యాంకును ఎందుకు దోచుకుంటున్నారు అని అడిగినప్పుడు డబ్బు అక్కడే ఉంది కాబట్టి అని చెబుతాడు.. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ డబ్బు ఎక్కడ ఉంటే ఆ బ్యాంకును దోచుకోవడం తప్ప తమకు వేరే మార్గం లేదని చెప్పుకొచ్చారు రాజీవ్ బజాజ్. (విలియం ఫ్రాన్సిస్ సుట్టన్ నలభై సంవత్సరాలలో రెండు మిలియన్ డాలర్లకు పైగా దోచుకున్నాడు) రాహుల్ బజాజ్ 1965లో రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూప్ పగ్గాలు చేపట్టిన సంవత్సరానికి కొత్త శిఖరాలకు చేర్చారు. బజాజ్ ఆటో ఆదాయం రూ.72 మిలియన్ల నుండి రూ.46.16 బిలియన్లకు పెరిగింది. భారతదేశంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకదానిగా తీర్చిదిద్దడంలో ఆయనకృషి చాలా ఉంది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దేశంలోని 20వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రాహుల్‌బజాజ్ 2002లో, దేశీయ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. 83 ఏళ్ల వయసులో 2022 లో ఆయన కన్నుమూశారు. -
సంచలనం సృష్టిస్తున్న రవితేజ శ్రీలీల..
-
బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్). బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్సన్స్ కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇంజిన్ & పర్ఫామెన్స్ బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది. డిజైన్ దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement