-
కలలో కూడా ఊహించని గిఫ్ట్.. అవేమిటో తెలిస్తే షాక్..!
primary school in China rewarded 20 excellent students with piglets: మన దేశంలో బాగా చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకై వారిని పై చదువులు చదివించడమే లేక ఉపయుక్తమైన బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తాం. అంతేందుకు మంచి ప్రతిభావంతులైతే ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించడమో లేక ఆర్థిక సహాయం చేయడమో కూడా చేస్తాం. కానీ చైనాలో పేద మెరిట్ విద్యార్థులకు విచిత్రమైన గిఫ్ట్‌లు ఇస్తారు. నిజానికి మనకు అది బహుమతిలా అనిపించదు. పైగా మనం కలలో కూడా ఊహించని విచిత్రమైన గిఫ్ట్ అది. అసలు విషయంలోకెళ్తే...యునాన్ ప్రావిన్స్‌లోని యిలియాంగ్ కౌంటీలోని జియాంగ్యాంగ్ ఎలిమెంటరీ స్కూల్ 20 మంది విద్యార్థులకు పందిపిల్లలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు హౌ చాంగ్లియాంగ్ మాట్లాడుతూ.. "గ్రామీణ విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో షాంఘై జియాంగ్వు ప్రజా సంక్షేమ నిధి ద్వారా పందిపిల్లలను స్పాన్సర్ చేశాం. ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. నేను నా భార్య లీ యుడాన్తో సహా నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. మేము అకడమిక్ మెరిట్ ఆధారంగా 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి పంది పిల్లలను బహుమతులుగా ఇచ్చాం. ఈ రకమైన బహుమతుల ద్వారా వారిని ప్రోత్సహించడమే కాక వారి తల్లిదండ్రులకు ఒక విధమైన సాయం అదించగలిగాం" అని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వినియోగదారులు ఇంత చిన్న వయసులో పందిని సంపాదించగలగడం చాలా గొప్ప విషయం అంటూ వ్యగ్యంగా రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: రైళ్లు గమ్యానికి చేరక మునుపే సరకు అంతా స్వాహా...దెబ్బకు ఈ కామర్స్ సంస్థలు కుదేలు) -
‘అదుగో’ మూవీ రివ్యూ
టైటిల్ : అదుగో జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అభిషేక్ వర్మ, నభా నటేష్, రవిబాబు, సాత్విక్ వర్మ సంగీతం : ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం : ఎస్ ఎస్ రాజేష్ దర్శకత్వం : రవిబాబు నిర్మాత : రవిబాబు, సురేష్ బాబు డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ లాగే.. రవిబాబు పంది కూడా ప్రేక్షకులను మెప్పించిందా..? కథ : దుర్గ అనే రౌడీ రాజధాని ప్రాంతంలోని రైతునుంచి 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించాలని ప్లాన్ చేస్తాడు. కానీ దుర్గ దగ్గర పని చేసే వ్యక్తి ఆ పొలాల డాక్యుమెంట్స్ కాపీ ఉన్న మెమరీ చిప్‌ను శక్తి అనే మరో రౌడీ మనుషులకు ఇస్తాడు. ఆ చిప్‌ను శక్తి దగ్గరకు తీసుకెళ్లే సమయంలో చంటి పెంచుకునే బంటి అనే పందిపిల్ల దాన్ని మింగేస్తుంది. శంకర్, గంగరాజు హైదరాబాద్‌లో ఉండే రౌడీలు. యానిమల్ రేసింగ్లలో బెట్టింగ్‌లు పెడుతూ దందాలు చేస్తుంటారు. త్వరలో జరిగే ఓ రేసింగ్ కోసం ఓ పందిపిల్ల అవసరం పడుతుంది. పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పటంతో అలాంటి పందిపిల్లను వెతికే పనిలో పడతారు. అలా నలుగురు గూండాలు బంటీ(పందిపిల్ల) వెంటపడటం మొదలవుతుంది. మరి ఈ రౌడీల మధ్య అభి, రాజీ అనే ప్రేమ జంట ఎలా చిక్కుకుంది.? రౌడీల చేతుల్లో పడ్డ బంటి తిరిగి చంటి దగ్గరకు ఎలా వచ్చింది.? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : అదుగో పూర్తిగా రవిబాబు మార్క్ సినిమా. టైటిల్స్ దగ్గరనుంచే రవిబాబు తనదైన క్రియేటివిటీతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ రవిబాబు తయారు చేసుకున్న కథ బాగుంది. కానీ కథనంలో ఏమాత్రం కొత్త దనం లేకపోవటం, రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం కాస్త నిరాశకలిగిస్తుంది. లైవ్ 3డీ యానిమేషన్లో చూపించిన పందిపిల్ల క్యారెక్టర్ ఆకట్టుకున్నా.. సహజంగా అనిపించదు. తనకున్న బడ్జెట్ పరిమితుల్లో వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి కూడ పందిపిల్ల గ్రాఫిక్స్ అన్న విషయం అర్ధమైపోతుంది. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా... చాలా చోట్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఎస్ ఎస్ రాజేష్ అందించిన నేపథ్య సంగీతం. ముఖ్యంగా చేజింగ్ సీన్స్‌లో విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్లాంటి విషయాల్లో కూడా రవిబాబు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశారు. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విజయ్ సాయి, అజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్లస్ పాయింట్స్ : లైవ్ 3డీ యానిమేషన్ చేజింగ్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : క్యారెక్టరైజేషన్స్ కామెడీ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘అదుగో’ ప్రమోషన్
-
‘అదుగో’ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు!
పంది పిల్ల ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంత్ విహారి స్వరాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు. ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ లో చూపిస్తుండడం విశేషం.. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ కలుగగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ‘ఈ సినిమా కి సహకరించిన అందరికి చాలా థాంక్స్. ఈ సినిమా తోనే చాల మంది కెరీర్లు మొదలవబోతున్నాయి. వారికి ఆల్ ది బెస్ట్. దీపావళి రోజు రిలీజ్ కావడానికి కారణం ఆరోజు సినిమా తప్పకుండ చూస్తారని ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.. దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. ‘నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాలా థాంక్స్.ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
పందిపిల్లకు రాజేంద్ర ప్రసాద్ వాయిస్
అదుగో.. రవిబాబు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా అదుగో టీంతో జత కలిసారు. ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీవాళి సందర్భంగా అదుగో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. పూర్తి ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీలకపాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకే రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఈయన వాయిస్ ఓవర్ అదుగో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. థియేటర్స్ లో ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అదుగో ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రవిబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ టెక్నాలజీని వాడుకున్నారు. తెలుగులో ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాలజీ వాడుకోవడం ఇదే తొలిసారి. అభిషేక్ వర్మ, నభానటాష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థపై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement