-
భార్య నగ్నంగా వీడియో తీసి సెల్ఫోన్లో రికార్డు.. భర్త పై కేసు
తమిళనాడు: ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసి భార్యను బెదిరించిన భర్త, అతని తల్లి, తండ్రి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మదురైలోని ముత్తుపట్టి కృష్ణానగర్‌కు చెందిన రాజ్ కమలే . ఇతని భార్య మదురై సౌత్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త తనను నగ్నంగా వీడియో తీసి సెల్ఫోన్లో రికార్డు చేశాడని, ఇందుకు అతని స్నేహితులు శరత్, అతని భార్య లిల్లీ, తల్లి రతి ప్రియా, తండ్రి పళని, సహోదరీ రాజ్య తిలకం సహకరిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఆ వీడియోను డిలీట్ చేయకుండా సామాజికమాధ్యమాల్లో పెడుతానని బెదిరించినట్లు వాపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కమలే, శరత్, లిల్లీ, రతిప్రియ, పళనిని అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో దారుణం: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. నగ్న ఫొటోల్ని..
బంజారాహిల్స్: తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యూడ్ వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితురాలుఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్.ఎన్.నగర్లో నివసించే యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న దెబాస్ దేకా(27)తో గతేడాది అక్టోబర్‌లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు సహజీవనంతో కలిసి ఉందామని నమ్మించాడు. తరచూ ఆమెకు ఇష్టం లేకుండానే లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గత మార్చి 26వ తేదీన యూసుఫ్‌గూడలోని తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డట్లు ఆమె వెల్లడించింది. ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక వాంఛలు తీర్చుకునేవాడని ఎన్నోసార్లు వ్యతిరేకించడం జరిగిందని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తన న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దేబాస్ దేకాపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నటి నగ్న వీడియో లీక్.. షాకవుతున్న నెటిజన్లు
ప్రముఖ నటి, అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ అయిన మిలే సైరస్ స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్ చేసి షాకిచ్చింది. త్వరలో తన కొత్త అల్భమ్ను రిలీజ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో తన అల్భమ్ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో మిలే బాత్రూంలో స్నానం చేస్తూ తన కొత్త అల్భంకు సంబంధించిన పాట పాడుతూ కనిపించింది. చదవండి: యశ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పి ట్రోల్స్ బారిన పడ్డ ప్రశాంత్ నీల్, దెబ్బకి ట్విటర్ క్లోజ్! తానే స్వయంగా ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారాల అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా మిలే సైరస్కు ఇన్ స్టాగ్రామ్‌లో 192 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు అనేక లైక్స్ వస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన తన బాత్ రూం వీడియోకు 16 లక్షల పైగా లైక్స్, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. అయితే మిలే సైరస్ ‘పార్టీ ఇన్ ది హోడ్’, ‘కాంట్ బి టేమ్డ్’, ‘7 థింగ్స్’ వంటి అల్భమ్తో పాపులర్ అయ్యింది. చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి! -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్‌కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్‌నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్‌లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్‌కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్‌మెయిల్‌కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
మహిళపై అత్యాచారం.. న్యూడ్ వీడియోలతో పైశాచికత్వం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీ స్థానిక నేత.. మహిళా కార్యకర్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత మేనెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిరువల్ల పరిధిలోని స్థానిక నేత.. సజిమోన్ తన కార్యాలయంలో బాధిత మహిళకు కూల్‌డ్రింక్‌లో మత్తు పానీయాన్ని కలిపి తాగించారు. ఆ తర్వాత.. ఆమెను కారులో బలవంతంగా ఎక్కించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఆమెను వివస్త్రను, వీడియోలు తీశారు. ఈ దారుణంలో 12 మంది నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. బాధిత మహిళా న్యూడ్ వీడియోలు తీసి వేధించడమే కాకుండా డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మహిళా ఒప్పుకోకపోవడంతో ఆమె న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో.. బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సజిమోన్, నాసర్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో 10 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు తీవ్ర విమర్షలు చేస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement