-
అప్పుడు 'బేబీ'.. ఇప్పుడు 'బ్యూటీ'!
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్) -
ఎవరినైనా మర్చిపోతామేమో కానీ వాళ్లని కాదు: డైరెక్టర్ మారుతి
'బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు ప్రారంభ దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు' అని డైరెక్టర్ మారుతి అన్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అక్టోబర్ 1న మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్‌కు చెందిన ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్.. గెట్ టుగెదర్ కార్యక్రమంతో పాటు, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తమ ఫ్రెండ్ మారుతిని ప్రేమగా సత్కరించారు. ప్రభాస్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మారుతి.. చిన్ననాటి స్నేహితులను పేరుపేరున పలకరించి, వారితో అప్పటి విశేషాలని గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే
‘‘చిన్న సినిమా సూపర్ హిట్టవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. నన్ను ఈ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది.. మధ్య తరగతి బాగుంటేనే మిగతా తరగతులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి.. ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు హనుమాన్ వాసంశెట్టి. ‘‘భోజనం ఎంత పెట్టినా చివర్లో స్వీట్ ఇస్తారు.. మా సినిమా కూడా స్వీట్ లాంటింది’’ అన్నారు గోవింద రాజు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మంచి విజయం అందించాలి’’ అన్నారు అజయ్, వీర్తి వఘాని. -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్‌కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
అనుష్కకు దర్శకుడు మారుతి సపోర్ట్
అమ్మతనం స్త్రీ జాతికి దక్కిన అపూర్వ గౌరవం. అమ్మ అని పిలిపించుకునేందుకు ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. ఆమె సాధారణ మహిళ అయినా, సెలబ్రిటీ అయినా! కాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ కూడా అమ్మ అని పిలిపించుకునే మధుర క్షణాల కోసం ఎదురు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గర్భాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై మీనా దాస్ నారాయణ్ అనే మహిళా జర్నలిస్టు వ్యంగ్యాస్త్రాలను సంధించారు. (చదవండి: నా జీవితం ఒక్క ఫ్రేములో: విరాట్) "అనుష్కను విరాట్ కేవలం గర్భవతిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు రాణిని చేయలేదు. అంతలా సంబరపడాల్సిన అవసరం లేదు" అంటూ కామెంట్ చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై తెలుగు దర్శకుడు మారుతి సీరియస్‌గా స్పందించారు. "మహిళా జర్నలిస్టు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరం. ఓ రాజ్యానికి రాణి అవడం కన్నా బిడ్డకు తల్లిగా మారడమే గొప్ప విషయం. అవును, ప్రతి మహిళ ఒక మహారాణి, సంతోషాలతో తులతూగే ప్రతీ ఇల్లు ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ అవడం కంటే ముందు ఆమె ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న మధుర క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది" అని కామెంట్ చేశారు. (చదవండి: కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్‌కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement