-
'మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి'
సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మూలపాడు బస్సు ప్రమాదంపై మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలన్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రఘవీరా సూచించారు. కృష్ణాజిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే. -
బస్సు ప్రమాదం కలచివేసింది : పవన్
హైదరాబాద్ : కృష్ణాజిల్లా మూలపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వంతెనపై నుంచి కల్వర్టులోకి పడటం చూస్తుంటే నోటమాట రావడం లేదని మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే. సంబంధింత వార్తలు కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నిబంధనలు గాలికి.. ప్రాణాలు గాల్లోకి! 'కల్వర్టు ఉంటే ఇంతఘోరం జరిగేది కాదు'
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement