-
భర్త ముందే శృంగారపు సన్నివేశంలో నటించా : హీరోయిన్
భారతీయ సినిమాల్లో శృంగారపు సన్నివేశాలకు హద్దు ఉంటుంది కానీ హాలీవుడ్లో అలా కాదు. తెరపై రొమాంటిక్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయితే.. వాళ్లకంటే బోల్డ్‌గా మరెవరూ చూపించరు. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్లేట్ కూడా అలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. భర్త ముందే బోల్డ్ సీన్స్‌లో నటించడం..ఇబ్బందిగా, విచిత్రంగా అనిపించిందట. ‘టైటానిక్’ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ కలిసి ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్..అప్పట్లో సంచలనం సృష్టించాయి. భర్త డైరెక్షన్లో లియోనార్డో డికాప్రియోతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది. తాజాగా కేట్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో రెండోసారి డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో శృంగారపు సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను’ అని కేట్ తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
టైటానిక్ టూ అవతార్.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ..!
'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. (ఇది చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత) అయితే ఈ చిత్రంలో టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జేమ్స్ కామెరూన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టైటానిక్ విడుదలైన 25 ఏళ్ల తర్వాత కేట్ విన్ స్లెట్, జేమ్స్ కామెరూన్ మళ్లీ అవతార్-2లో కలిసి పనిచేయడం గమనార్హం. అవతార్ మూవీతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన జేమ్స్ కామెరూన్.. దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్లో పండోరలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపించారు. సామ్ వర్తింగ్టన్, జో సాల్దానా.. జేక్, నేత్రి పాత్రలు పోషించగా.. ఈ అడ్వెంచర్‌లో టోనోవరీ భార్యగా రోనల్ పాత్రలో కేట్ విన్స్లెట్ నటించింది. టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అనుకుంటున్నా. టైటానిక్ విడుదలై 25 ఏళ్లైంది. ఇది చాలా సుదీర్ఘ సమయం. అది నా జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను తల్లిని అయ్యా. జేమ్స్ కామెరూన్ కూడా పేరెంట్ అయ్యారు. మేమిద్దరం కళాకారులం. మేం ప్రయోగాత్మకంగా మరింత సాహసోపేతంగా ఉన్నాం. అదే మా ఇద్దరి మధ్య ప్రధాన వ్యత్యాసం. ఇద్దరి మధ్య సృజనాత్మకమైన తేడాలు చాలా ఉన్నాయి.' అని అన్నారు. -
అవతార్ 2: నేవీ నాయకి లుక్ వచ్చేసింది!
అవతార్.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో అలరించిందీ చిత్రం. దీంతో ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతోంది అవతార్: ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలో నేవీ అధికారి రొనాల్గా నటించిన కేట్ విన్స్లెట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. భయమెరుగని నిజాయితీ గల నాయకిగా ఆమెను కీర్తించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె లుక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్‌పై ఆమె ఫస్ట్ లుక్ ప్రచురితమైంది. ఇకపోతే విన్స్లెట్.. తన పాత్ర కోసం నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువ సేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ చేసిందట. 20th సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో విన్స్లెట్తో పాటు సామ్ వార్తింగ్టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by 20th Century Studios (@20thcenturystudios) చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ జూలై 1న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు.. -
‘టైటానిక్’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేగాక సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ఇక తన సహా నటీనటులను ఎప్పుడు ఆటపట్టిస్తూ సరదగా ఉండే కార్తీక్ తాజాగా టైటానిక్ మూవీపై స్పందిస్తూ హీరోయిన్ కేట్ విన్స్లెట్తో తనని పోల్చుకున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ కేట్, హీరోని తన స్కెచ్ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇస్తుంది. ఈ సనివేశం అందరికి గుర్తుంది కదా. అచ్చం కేట్ లాగే కార్తీక్ కూడా ఫోజు ఇచ్చి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు ‘కార్తీక్ 1- 0 కేట్ విన్స్లెట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇక అతడి పోస్టుపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల కూడా స్పందించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ‘ఉఫ్’ అంటు కామెంట్ చేయగా.. సింగర్ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేను మాత్రమే అనుకుంటా’ అంటు కామెంట్ చేసింది. అది చూసిన కార్తీక్ ‘వెంటనే టైటానిక్ సినిమా చూడు’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే నెటిజన్లు కూడా ‘టైటానిక్ పార్ట్ 2’, ‘క్యాప్షన్ కింగ్’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డికి ఊరట
ఇంత బాగా నేర్చుకుంటానని అనుకోలేదు
పేదల కలను జగన్ మామ నిజం చేశారు
చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్ చదువు
నియోజకవర్గ ప్రత్యేకతలు
స్వతంత్రులకు పట్టం కట్టని కొత్తపేట
నిక్షేపాల గని... ఆక్వా సిరి
No Headline
రైజింగ్ ఇంగ్లిష్
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement