Kamareddy District News
-
వర్షపు నీటిలో ధాన్యపు రాశులు
రామన్నపేట/నల్లగొండ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ జిల్లా బుధవారం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. భువనగిరి జిల్లా రామన్న పేట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో రాత్రి ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. రామన్నపేట వ్యవసాయమార్కెట్‌లో సీసీ ప్లాట్‌ఫారంపై పోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఇక నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఆర్జాల బావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం జలమయమైంది. ఖాజీరామారం, కొత్తపల్లి సెంటర్లలో ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పినప్పటికి గాలి, ధాన్యం బస్తాల కిందకు వర్షపు నీరు చేరి తడిశాయి. ధాన్యపు రాసుల మధ్య చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు రాత్రి సమయంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. -
ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ నాగార్జున్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ని యంత్రణ మండలి (ఈఆ ర్సీ) చైర్మన్‌గా జస్టిస్ దేవ రాజు నాగార్జున్ బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ నియంత్రణ్ భవన్‌లోని ఈ ఆర్సీ కార్యాలయంలో ఆయనతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రమాణస్వీ కారం చేయించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవరాజు నాగార్జున్ మాట్లాడుతూ వినియోగ దారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు ఈఆర్సీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం త్వరలో ప్రకటన జారీ చేయనుంది. చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకు బెదిరింపు కాల్ ● రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ కొత్తపల్లి (కరీంనగర్): కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఎమ్మెల్యే సత్యంకు ఈ నెల 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో గుర్తు తెలియని నంబరు +447886696497 నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని వెల్లడించారు. ఫోన్లో సదరు వ్యక్తి మాట్లాడుతూ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన ఇద్దరు పిల్లలు అనాథలయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో సత్యం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈమేరకు 339/ 2024, భారతీయ న్యాయ సంహిత 308, 351 (3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని భవా నీనగర్కి చెందిన యాస అఖిలేశ్‌రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడని, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడ్డట్లు తేలిందని వివరించారు. సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్ జారీచేశామని ఏసీపీ వెల్లడించారు. క్లుప్తంగా... -
జూదం కట్టడి అయ్యేనా?
బిచ్కుంద(జుక్కల్): జిల్లాలో ఎక్కడా లేని విధంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, ఎల్లారెడ్డి సహా ఆయా మండలాల్లో దీపావళి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున జూదం ఆడుతారు. పేకాట లో కీటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. ర మ్మీ, త్రీకార్డు, పరేల్, కట్పత్తా(అందర్ బాహెర్) ఇలా పేర్లతో కూలి పనిచేసే వ్యక్తుల నుంచి బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఒక టేబుల్లో కనీసం రూ.100 నుంచి రూ.లక్ష బెట్టింగ్ కడతారు. జుక్కల్ సెగ్మెంట్లో పోలీసులు అంతగా పట్టించుకోరని ధీమాతో నిజామాబాద్, మెదక్, కంగ్టి, బీదర్, ఔరాద్, దెగ్లూర్, నర్సీ ప్రాంతాల నుంచి పేకాట ఆడడానికి ఇక్కడికి వస్తారు. జూదం స్థావరాలు... బిచ్కుంద, జుక్కల్, కేంరాజ్ కల్లాలి, పిట్లం, మద్నూర్, ఎక్లార, పెద్దకొడప్గల్, వడ్లం, కాస్లాబాద్, తుబ్దాల్, దేవిసింగ్ తండా తదితర గ్రామాల్లో జూదం అడ్డాలు గతంలో కొనసాగా యి. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామాల జూదరులకు అడ్డా. నిర్వాహకులు ఫోన్లు చేసి పోలీసులు దాడులు చేయరని ధీమా ఇస్తున్నట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు జుక్కల్, బాన్సు వాడ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టిసారించి దీపావళి పండగకు ప్రత్యేక బృందాలను పంపించి గట్టి నిఘాపెట్టి పేకాట, జూదం ఆడకుండా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. టాస్క్‌పోర్సు దాడులతో అలర్ట్... గతడాది పొలీసు ఉన్నతాధికారులు టాస్క్ఫోర్సు బృందాలు ఏర్పాటు చేసి జుక్కల్ ని యోజకవర్గంపై ప్రత్యేక నిఘా పెట్టి పేకాట స్థావరాలపై దాడులు చేసి జూదాన్ని పూర్తిగా అరికట్టారు. నోట్ల బదులు కాయిన్లు, టోకెన్లు.. అడ్డాలలో నోట్ల్లు చెలామణి చేయకుండా నిర్వాహకులు కాయిన్లు, టోకెన్లు పెట్టి ఆడించే ఏర్పా ట్లు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దాడు లు చేసినా డబ్బులు దొరక్కుండా కాయిన్లు తెరపైకి తీసుకొస్తున్నారు. పేకాటలో నకిలీ నోట్లు చెలామ ణి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర, క ర్ణాటక నుంచి ఆడడానికి వచ్చే వారు నకిలీ నోట్లు తీసుకురావచ్చని కొందరు అనుమానిస్తున్నారు. -
మయోనైజ్‌పై నిషేధం
uమొదటి పేజీ తరువాయివాటితో కూడా కలిపి తీసుకుంటుంటారు. మంత్రి సమీక్ష నేపథ్యంలో.. : ఆహార భ్రద్రతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సమీక్ష నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వివరించారు. దీంతో జిల్లాల్లోనూ విరివిగా తనిఖీలు చేయాలని, ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీ శారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ గుడ్లు, ఉడకబె ట్టని గుడ్లతో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కేరళలో ఈ తర హా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, రాష్ట్రంలో కూడా నిషేఽ దం విధించాలని సూచించారు. దీంతో పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి.. మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆహార భద్రతపై అధ్యయనం చేయండి రాష్ట్రంలో గత పదేళ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఆహార భద్రతా విభాగం బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఫుడ్ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నామని, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్, డైరెక్టర్ శివలీల, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు మూర్తి రాజు, అమృత, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆగని రేషన్ బియ్యం దందా
దోమకొండ: దోమకొండ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో దాచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు,విజిలెన్స్ అధికారులు నెల క్రితం పట్టు కున్నారు.సదరు వ్యాపారి గతంంలో పీడీఎస్ బి య్యం అమ్ముతూ పట్టుబడ్డాడు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు పోలీసులు కలిసి దా డులు చేసి సదరు రైస్‌మిల్ నుంచి ఇప్పటికి మూడుసార్లు రేషన్ బియ్యం పట్టుకున్నారు. అయినప్పటికీ రేషన్ అక్రమ దందాలో మార్పు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్కదారి పట్టిస్తున్నారు. కిలోల చొప్పున సేకరించి రహస్య ప్రాంతాలలో నిల్వ చేస్తున్నారు. కొందరు పట్టణాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్ని డంప్ చేస్తున్నారని సమాచారం. అధికారులు నిఘా పెంచినా వారి కళ్లుగప్పి రవాణా చేస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ముఖ్యంగా నెలలో మొదటి 15 రోజుల పాటు బియ్యం సేకరిస్తున్నారు. తర్వాత 15 రోజుల్లో బియ్యాన్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. వ్యాపారులు కిలోకు రూ.12 నుంచి రూ. 15 వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే బియ్యాన్ని రూ. 25 నుంచి రూ. 28 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రోత్సహిస్తున్న మిల్లర్లు... జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు అక్రమ రేషన్ బియ్యం దందాను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. చాలాచోట్ల అక్రమంగా తరలిస్తున్న, నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు, పౌరసరఫరాలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచి దాడులు చేసినా పరిస్థితిలో మార్పురావడం లేదు. తనిఖీలలో పట్టుబడుతున్నా మారని తీరు కేసులు నమోదు చేస్తాం.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేయడం నేరం. ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గాని లేదా నిల్వ చేసినట్లుగాని తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. దాడులు చేసి నిందితులను పట్టుకుంటాం. – ఆంజనేయులు, ఎస్సై, దోమకొండ -
విధి వంచించింది..కంపెనీ చేతులెత్తేసింది
మోపాల్: మండలంలోని వడ్డెరకాలనీకి చెందిన కొమ్రె నర్సింహులు (వడ్డె నర్సింలు) కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పిల్లలను మంచిగా చదివించడంతోపాటు ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లోని డీ–టెక్ కంపెనీలో లేబర్ పనికి వెళ్లాడు. లేబర్‌గా డబ్బులు సరిపోవడం లేదని, రిగ్గర్ (క్రేన్) ఆపరేటరేటింగ్ నేర్చుకుని అక్కడే పని చేశాడు. ఈ ఏడాది జూలై 22న ట్రాలా (లారీ)లో పని ప్రదేశానికి వెళ్తుండగా, ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో నర్సింహులుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోమాలో ఉన్నా కంపెనీ పట్టించుకోలేదు.. ప్రమాదంలో తీవ్ర గాయాలుకావడంతో నర్సింహులు 45 రోజులపాటు కోమాలో ఉన్నాడు. అయి నా ఏనాడూ కంపెనీ పట్టించుకోలేదు. తమకేం సంబంధం లేదన్నట్లు చేతులెత్తేసింది. వైద్యులు బతుకుతాడనే గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. చివరకు తెలిసిన వారి ద్వారా ఆయన భార్య లక్ష్మి కంపెనీపై కేసు పెట్టింది. లాయర్ ద్వారా అవుట్ పాస్‌పోర్టు పొంది సెప్టెంబర్ 23న నర్సింలు స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కంపెనీపై కేసు వేసి, ఇన్సురెన్స్ డబ్బులు వచ్చేలా లాయర్ కృషి చేస్తున్నారని తెలిసింది. పూట గడవడం కష్టంగా ఉంది భర్త కాళ్లు కోల్పోవడం, అత్తమ్మకు వయస్సుపైబడడం, పిల్లలు చిన్నగా ఉండటంతో పూట గడవటం కష్టంగా ఉంది. ఇంటి వద్ద ఉండి సపర్యలు చేయడానికే సమయం సరిపోతోంది. పనికి వెళ్లడం కుదరకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాతలు ముందుకు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. నర్సింలుకు ప్లాస్టిక్ కాళ్లు అమర్చేందుకు సాయం చేస్తే రుణపడి ఉంటాం. – లక్ష్మి, నర్సింలు భార్య మంచానికే పరిమితం.. నర్సింహులు రెండు కాళ్లు కోల్పోయి స్వగ్రామానికి చేరగా, నెల రోజుల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అన్ని సపర్యలు భార్య లక్ష్మీ ఇంటి వద్దే ఉండి చేస్తోంది. ఎలాంటి ఆధారం లేకపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. పెద్ద దిక్కు అయిన నర్సింలు మంచానికే పరిమితం కావడంతో భర్తతోపాటు పిల్లల చదువులు, అత్త బాగోగుల బాధ్యత అంతా లక్ష్మి చూసుకుంటోంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాాఖ, ఎంబసీ అధికారులు, గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని తనకు రావాల్సిన పరిహారం డీ–టెక్ కంపెనీ, ఇన్సురెన్స్ కంపెనీ ద్వారా వచ్చేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ ఇవ్వడంతోపాటు పిల్లల చదువుల బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. దుబాయిలో రెండు కాళ్లు కోల్పోయిన వడ్డెర కాలనీవాసి ఆధారం లేక రోడ్డున పడిన నర్సింలు కుటుంబం..గల్ఫ్ వెళ్లి డబ్బులు సంపాదించుకుందామనుకున్న ఆయనను విధి చిన్నచూపు చూసింది. దుబాయ్‌లో జూలై 22న జరిగిన రోడ్డు ప్రమాదంతో తన ఆశలన్నీ అడియాశలు చేసింది. ప్రమాదంలో కోమాలోకి వెళ్లి నెలన్నర రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు. చివరకు రెండు కాళ్లను కోల్పోయి, స్వగ్రామానికి చేరుకున్నాడు. ఎన్నో ఆశల మధ్య దుబాయ్ వెళ్లిన మోపాల్ మండలం వడ్డెరకాలనీకి చెందిన కొమ్రె నర్సింలు గాథ ఇది.. -
మూడు ముక్కలాటకు ముమ్మర ఏర్పాట్లు
ఖలీల్‌వాడి: దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లాలో మూడు ముక్కలాటకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పేకాట గ్రూపుల నిర్వాహకులు ముందుగానే తమ ఫుల్ కోరంతో సిద్ధమవుతున్నారు. పేకాట ఆడేవారు ముందుగానే క్యాష్‌ను చూయిస్తేనే గ్రూపులకు ఎంట్రీ ఇస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి దీపావళి వచ్చిందంటే చాలు పండుగ ముందు నుంచి ఈ గ్రూప్‌ల నిర్వాహకులు పేకాట స్థావరాలను ఏర్పాటు చేస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీ, అందర్బాయర్, జోడీల పేరిట రహస్య ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు చిక్కకుండా పేకాటలను నిర్వహిస్తున్నారు. పండుగ ముగిసినా వారం రోజుల వరకు ఈ పేకాట స్థావరాలు కొనసాగుతాయి. గతంలో పేకాటకు ‘క్యాట్’ ఏర్పాటు గతంలో పేకాటను అడ్డుకట్ట వేసేందుకు నాటి ఎస్పీ మహేశ్ చంద్ర లడ్డా క్యాట్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం పేకాటను అరికట్టేందుకు విశేషంగా కృషి చేసేది. ఎస్పీకి అనుసంధానంగా ఈ బృందం ఉండేది. గ్రామాల్లో ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని దాడులు చేసి పేకాట ఆడేవారిని అదుపులోకి తీసుకునేవారు. దీనికి నాటి హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్ నేతృత్యంలో పేకాటస్థావరాలు ఎక్కడ ఉన్నా పేకాట ఆడేవారిని అదుపులోకి తీసుకోవడంతో జిల్లాలో పేకాట ఆడేందుకు జంకేవారు. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లిలో పేకాట స్థావరంపై దాడికి వెళ్లిన పోలీసు బృందాన్ని చూసి పేకాట ఆడేవారు పారిపోతుండగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పేకాట ఆడే వ్యక్తికి బుల్లెట్ తగలడంతో అప్పుడు వివాస్పదంగా మారింది. ఆ తర్వాత ఎస్పీ లడ్డా బదిలీ కావడంతో క్యాట్ రద్దు అయ్యింది. మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు.. పెద్ద మొత్తంలో పేకాట ఆడేవారు మహారాష్ట్రలోని బోరి, దెగ్లూర్, పాపారావుపేట్ పేకాట కేంద్రాలకు ఇక్కడి నుంచి తరలివెళ్తున్నారు. ఈ ప్రాంతాల్లో పేకాట ఆడేవారిని తీసుకెళ్లే వారికి రూ.3 వేలతో పాటు భోజనం, మద్యాన్ని నిర్వాహకులు అందిస్తుంటారు. జిల్లాలోని పలు శాఖల్లో పని చేసే ఉద్యోగులు సైతం మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం. ఇక్కడ పేకాట ఆడి పట్టుబడితే ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని మహారాష్ట్రలోని పేకాట కేంద్రాలకు కొందరు ఉద్యోగులు వెళ్తున్నట్లు తెలిసింది.ఆటను బట్టి సభ్యులు..టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యంజిల్లాలో టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో వారిని ఇటీవల బదిలీ అయిన సీపీ కల్మేశ్వర్ బదిలీ చేశారు. ఇక్కడ పని చేసిన ఏసీపీ విష్ణుమూర్తిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేయగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సస్పెషన్ చేశారు. అంతేకాకుండా అవినీతికి సహకరించిన ఇద్దరు టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్లను సీపీ కల్మేశ్వర్ సస్పెండ్ చేశారు. దీంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య సెలవులో ఉండగా మరో సీఐ పురుషోత్తం ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో సిబ్బంది లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తాళం వేశారు. దీపావళి పండుగకు టాస్క్‌ఫోర్స్ పేకాట కేంద్రాలపై దాడులు చేయాల్సిన విభాగం ఇప్పుడు నిర్వీర్యంగా మారడంతో పేకాట ఆడేవారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చేతులు మారనున్న లక్షల రూపాయలు దీపావళి నేపథ్యంలో పేకాటకు సిద్ధమవుతున్న గ్రూపులు జిల్లాతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో స్థావరాల ఏర్పాటు పోలీసుల నిఘా కరువుపేకాటలో రమ్మీకి త్రీకార్డ్స్, జోడీకి ఏడుగురు సభ్యులు, అందర్బాయర్కి 20 మంది సభ్యులు కలిసి పేకాట ఆడుతారు. పేకాట నిర్వాహకులు రూ.5 వేల నుంచి ప్రారంభించి రూ.లక్షల వరకు ఆడించడం జరుగుతుంది. ఒక ఆటలో పేకాట ఆడేవారు ఆడే ఆటను బట్టి పైసలు వసూలు చేస్తారు. రూ. 5 వేల ఆటకు రూ.5వేలను ఆట నిర్వాహకులు పేకాట ఆడేవారి నుంచి వసూలు చేస్తారు. ఇలా ఒకే రోజు నిర్వాహకులు రూ.లక్షలు సంపాదిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈత, తాటి వనాలు, వ్యవసాయ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారు. నగరంలో అపార్ట్మెంట్లు, జిల్లా సరిహద్దు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతల్లో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి రహస్యంగా పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 32 పోలీస్స్టేషన్లలో దీపావళి సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తారు. కానీ పోలీసులు పేకాట ఆడేవారిని అరెస్టు చేసే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కేసులను మాఫీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
‘డివైడర్ కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి’
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై అక్రమంగా డివైడర్‌ను కూల్చివేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ అనుమతి లేకుండా డివైడర్‌ను కూల్చివేయడమే కాకుండా సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఎత్తుకెళ్లారన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కార్యక్రమంలో బల్దియాలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ హఫీజ్ బేగ్, కౌన్సిలర్లు పిట్ల వేణు, నజీరొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్, నాయకులు లక్ష్మీనారాయణ, గైని శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేసిన సర్కారు
మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. మద్నూర్‌లో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సింధే మాట్లాడుతూ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. హామీలను అమలు చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రైతు రుణాలు మాఫీ కాలేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేంతవరకు పోరాడుతామన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కంచిన్ హన్మండ్లు, విజయ్, సురేశ్, రవి, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో విఫలం కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే విమర్శలు మద్నూర్‌లో రైతు ధర్నా -
మిల్లర్లు బ్యాంకు పూచీకత్తు ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: మిల్లింగ్ చేసేందుకు ఇచ్చే ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లర్లు బ్యాంక్ పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024–25 నేడాదికి వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి రైస్ మిల్లర్ తమ వ్యక్తిగత బ్యాంకు పూచీకత్తును తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి తమ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకోవాలన్నారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, ఏఎస్వో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీవీ–5 అధినేత బీఆర్ నాయుడికి చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనతోపాటు మరో 23 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్లు బుధవారం టీడీపీ ప్రకటించింది. సభ్యులుగా జగ్గంపేట, కోవూరు, మడకశిర ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, టీడీపీ నేత పనబాక లక్ష్మి, సాంబశివరావు (జాస్తి శివ), నన్నపనేని సదాశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, పి.రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, నరేశ్ కుమార్ ని యమితులయ్యారు. తెలంగాణ నుంచి నల్లగొండకు చెంది న టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి, జనసేన పార్టీ నేత బుంగునూరు మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో అర్కిటెక్ట్‌గా వ్యవహరించిన బురగపు ఆనంద్‌సాయి, భారత్ బయోటెక్ కో చైర్మన్ సుచి త్ర ఎల్లా, అనుగోలు రంగశ్రీకి అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి జస్టిస్ హెచ్ఎల్ దత్, దర్శన్ ఆర్ఎన్, గుజరాత్ నుంచి డాక్టర్ అదిత్ దేశాయ్, మహారాష్ట్ర నుంచి సౌరబ్ హెచ్ బోరా, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిని నియమించారు. కాగా ఈ జాబితాపై టీడీపీలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తమకు కచ్చితంగా బోర్డులో అవకాశం దక్కుతుందని భావించిన చాలామందికి నిరాశే ఎదురవడంతో వారంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక వడపోతలు, సమీకరణలు పరిశీలించి చంద్రబాబు ఈ జాబితా రూపొందించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత టీటీడీ బోర్డును నియమిస్తుండడం విశేషం. సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు, ఇతర పాలకమండలి సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సుచిత్ర ఎల్లా : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్ టీకా కోవాగ్జిన్ రూపొందించినందుకు గాను అమెకు, ఆమె భర్త, ఆ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లాకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సుచిత్ర స్వస్థలం తమిళనాడులోని తిరుత్తుణి. కానీ తెలంగాణ కోటాలో ఆమెను టీటీడీ బోర్డు మెంబర్ పదవి వరించింది. ఆనంద్ సాయి తెలుగు చలనచిత్ర రంగంలో కళాదర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించిన ఆనంద్‌సాయి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు. పవన్‌కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లాలో చిన జీయర్‌స్వామి ఆశ్రమ రూపకల్పనలో పాల్గొన్నారు. అనంతరం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్‌గా నియమితులయ్యారు. పవన్‌కళ్యాణ్ సూచనతో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. బొంగునూరి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ శివారులోని కొంపల్లికి చెందిన బొంగునూరి మహేందర్‌రెడ్డి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు. ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే ఆయన పవన్‌తో కలిసి నడుస్తున్నారు. తొలుత ప్రజారాజ్యం పార్టీలో కొనసాగి, జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు పవన్ సూచన మేరకు ఆయనకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. నన్నూరి నర్సిరెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి ముందునుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్రపడ్డారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. -
మెడికల్ పీజీ కోర్సులకు నేటి నుంచే దరఖాస్తులు
● అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ ● దరఖాస్తులు ముగిశాక దశలవారీగా కౌన్సెలింగ్ ● అల్లోపతి, ఆయుర్వేద, హోమియో కోర్సులకు అడ్మిషన్లు ● జాతీయ కోటా పోగా మిగతా సీట్లన్నీ తెలంగాణ వాసులకే.. ● నిబంధనలు, అర్హత వివరాలను వెల్లడించిన విశ్వవిద్యాలయం ● ఆయుర్వేద, హోమియో, యునాని ఎండీ కోర్సుల్లో ప్రవేశాలకూ నోటిఫికేషన్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు మెడికల్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2024–25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. కాళోజీ వర్సిటీకి, నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో దీనిద్వారా సీట్లను భర్తీ చేస్తారు. నీట్ పీజీ–2024లో అర్హత పొందిన అభ్యర్థులు ఆన్లైన్లో గురువారం (31–10–2024) ఉదయం 6 గంటల నుంచి వచ్చే నెల ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. స్కాన్చేసిన సర్టిఫికెట్లను https://tspgmed.tsche.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. రాష్ట్ర స్థాయి మెరిట్‌ను నిర్ణయించి కన్వీనర్ కోటా అడ్మిషన్లను చేపడతారు. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత.. తాత్కాలిక తుది మెరిట్ జాబితా ప్రదర్శిస్తారు. పీజీ మెడికల్ కోర్సుల కోసం నీట్ పీజీ–2024 పరీక్షలో కటాఫ్ స్కోర్‌గా.. ఓపెన్ కేటగిరీకి 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 పర్సంటైల్, ఓసీల్లో వైకల్యం ఉన్నవారికి 45 పర్సంటైల్‌ను ఖరారు చేశారు. కాగా.. ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్లు జారీచేశారు. వాటికి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఏపీజీఈటీ–2024 పరీక్షలో అర్హత సాధించినవారు ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు అర్హులు. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ● అభ్యర్థులు స్థానికులై ఉండాలి. అంటే ఇప్పటివరకు వరుసగా నాలుగు సంవత్సరాలకు తక్కువ కాకుండా తెలంగాణలో చదివి ఉండాలి. అలాగే విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా ఇక్కడి స్థానికులుగానే భావిస్తారు. ● తెలంగాణలో ఇప్పటివరకు అంచనా వేసిన ప్రకారం.. 26 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,800 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 50శాతం జాతీయ కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. మిగతా సీట్లను తెలంగాణ స్థానికులకు కేటాయిస్తారు. ● తెలంగాణలో స్థానికేతర కోటా కింద ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు స్థానికత వర్తించదు. ● ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి, లేదా అంతకుముందే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ● ఇన్–సర్వీస్ కోటా అభ్యర్థుల విషయంలో.. ప్రభుత్వంలో వారు చేసిన ఉద్యోగాన్ని గత నెల 30వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ● ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు అర్హులు కారు. ● పీజీ, డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు కలిపి ఓసీ, బీసీలు రూ.5,500, ఎస్టీలు రూ.5 వేలు చెల్లించాలి. ● ఆయా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వెబ్ ఆప్షన్ల తేదీలను త్వరలో వెబ్సైట్లో వెల్లడిస్తారు. ● నీట్ పీజీ పరీక్షలో కటాఫ్ స్కోర్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ● దరఖాస్తుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే.. 9392685856, 7842136688, 9059672216 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా knrpgadmissions@gmail.com కు ఈ–మెయిల్ చేయవచ్చు. -
ధాన్యం.. వ్యాపారుల పాలు
నిజాంసాగర్: జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. అయితే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ తూకాలు ప్రారంభించలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయమై స్పష్టత లేదు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తాటిపత్రులు, గన్నీ సంచులు అందుబాటులో లేవు. తాగునీటి సదుపాయం కూడా లేదు. మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం పడి ధాన్యం తడుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్లు తడవకుండా ఉండేందుకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద టాపర్లను అద్దెకు తీసుకుని కప్పుతున్నారు. అయితే ప్రభుత్వం ధాన్యం తూకాలు ప్రారంభించకపోవడంతో వ్యాపారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియకపోవడంతో పలువురు రైతులు వ్యాపారులకే అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభం కాని తూకాలు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు -
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చదువుకున్న వారు సైతం సైబర్ మోసాలకు గురవుతున్నారని, ప్రతీ ఒక్కరు తమ బ్యాంక్, ఇతర వివరాలను ఎవరీకి చెప్పకూడదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పవద్దన్నారు. కళాశాల చైర్మన్ గురువేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ కృష్ణప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గృహహింస బాధితులకు అండగా ఉంటాం’
కామారెడ్డి అర్బన్/కామారెడ్డి టౌన్: గృహహింస బాధితులకు అండగా ఉంటామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి పేర్కొన్నారు. బుధవారం సఖి కేంద్రంలో నిర్వహించిన న్యాయసేవ సదస్సులో ఆమె పాల్గొన్నారు. బాధిత మహిళలతో మాట్లాడారు. సఖి కేంద్రానికి సంబంధించి కోర్టులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళకు న్యాయం జరిగేలా చట్టం సహకరిస్తుందన్నారు. కుటుంబాలలో కలహాలు రాకుండా మహిళలు చూసుకోవాలన్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గృహహింస కేసుల్లో ఇరువర్గాలను పిలిచి గౌరవమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం నిర్వాహకురాలు భారతి, లీగల్ కౌన్సిలర్ ముదాం నవీన్, సఖి సపోర్ట్ ఎన్జీవో పద్మపాణి, సొసైటీ సమన్వయకర్త అరుణిమ తదితరులు పాల్గొన్నారు. ‘సదరం’ తేదీలు ఖరారు కామారెడ్డి టౌన్: దివ్యాంగుల నిర్ధారణ కోసం నవంబర్ నెలకు సంబంధించిన సందరం క్యాంపుల తేదీలను ఖరారు చేశారు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల 13, 20, 27 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్థోపెడిక్, చెవిటి, మూగ, మానసిక దివ్యాంగులు స్థానిక మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరానికి రావాలని సూచించారు. రేపు కబడ్డీ పోటీలు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ –19 బాలుర విభాగంలో నిర్వహించే పోటీలకు క్రీడాకారులు తమ ఓరిజినల్ బోనఫైడ్ సర్టిఫికెట్తో హాజరుకావాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సమాధికి వినతి బాన్సువాడ: ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయని ప్రభుత్వ తీరును నిరసిస్తూ బాన్సువాడలో పలువురు విద్యార్థులు బుధవారం సమాధికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రవీందర్‌గౌడ్, దత్తు, నిఖిల్‌గౌడ్, రాఘవ, మహేందర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. మెరిట్ జాబితా విడుదల కామారెడ్డి టౌన్: కేజీబీవీలలో తాత్కాలిక పద్ధతిపై అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచారు. ఈ విషయాన్ని డీఈవో ఎస్.రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.deokamareddy.in వెబ్సైట్లోనూ జాబితాను పొందుపరిచామని పేర్కొన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే శుక్రవారం డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సమన్వయకర్త సయ్యద్ మొయిజుద్దీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 73861 80456, 79891 59121 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఒత్తిడిలో గుత్తేదారు!
జిల్లాలో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలతో పాటు పబ్లిక్ హెల్త్, మున్సిపల్, సోషల్ వెల్ఫేర్, మన ఊరు మనబడి తదితర విభాగాలకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టు పనుల్లో నాలుగు డబ్బులు సంపాదించాలన్న ఆశతో అప్పులు చేసి మరీ పలువురు కాంట్రాక్టర్లు పనులు చేశారు. రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, డ్రెయినేజీలు, స్కూల్ భవనాలు నిర్మించినవారు ఏళ్లుగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెండుమూడేళ్లుగా ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత ఏర్పడడంతో బిల్లులు సరిగా మంజూరు కావడం లేదు. దీంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే మానసికంగా దెబ్బతిని ఆస్పత్రుల పాలవుతున్నారు. గత ప్రభుత్వం ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించింది. జిల్లాలో 352 స్కూళ్లలో వివిధ పనులకుగాను రూ.183 కోట్లు మంజూరు చేసింది. చాలాచోట్ల పాత భవనాలు కూల్చి కొత్తవి నిర్మించడానికి పనులు చేపట్టారు. కొన్నిచోట్ల స్లాబులు వేసి బిల్లులు రాక పనులు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల పిల్లర్ల దశలో నిలిచాయి. ఇంకొన్నిచోట్ల పనులు గదుల నిర్మాణం జరిగినా, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ వంటి పనులు చేయలేదు. చాలాచోట్ల పనులు చేసిన వాళ్లు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో స్కూల్ భవనం నిర్మించిన గుత్తేదారు బిల్లులు రాకపోవడంతో భవనానికి తాళం వేసి నిరసన తెలిపాడు. బిల్లుల కోసం పలువురు ప్రజావాణిలోనూ మొరపెట్టుకుంటున్నారు. మన ఊరు మన బడికి సంబంధించి రూ.30 కోట్ల పైనే బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖల్లో రూ. వందల కోట్ల విలువైన పనులు చేసిన ఎంతో మంది ఇబ్బందిపడుతున్నారు. బ్రిడ్జీలు, రోడ్లు, ఇతర భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లు చాలా మంది అప్పులపాలయ్యారు. బడా కాంట్రాక్టర్లు ఏదో రకంగా నెట్టుకువస్తుండగా, చిన్నచిన్న కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. నీటి పారుదల శాఖలోనూ చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. పలుకుబడి ఉన్న వారు జనరల్ ఫండ్ నుంచి డైవర్ట్ చేసుకుని బిల్లులు తీసుకుంటుండగా, మిగతా వారు బిల్లులు చేతికిరాక అవస్థలు పడుతున్నారు.సర్కారు పనులంటేనే జంకే పరిస్థితికొత్తగా మంజూరవుతున్న పనులు చేయడానికి చాలామంది ముందుకు రావడం లేదు. బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో పనులు చేయడానికి ఆచితూచి అడుగేస్తున్నారు. చివరికి ఉపాధి హామీ పథకంలో మెటల్ కాంపోనెంట్ కింద సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడానికి కూడా చాలామంది ఆసక్తి చూపడంలేదు. కోటాకు మించి అదనంగా పనులు జరిగాయి. దీంతో బిల్లులు వస్తాయోలేదో తెలియని పరిస్థితుల్లో పనులు చేయడానికి వెనకడుగు వేశారు. ఎలాగోలా మార్చి నెలాఖరులోగా పనులు చేసిన వారంతా ఇప్పటికీ బిల్లులు రాలేదని చెబుతున్నారు. ఏ నిధులైనా సరే పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు మంజూరైనా వాటికి కూడా చెల్లింపులు జరగడం లేదని తెలుస్తోంది. తమకు గడ్డుకాలం నడుస్తోందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.వడ్డీల భారం.. రెండేళ్లుగా మంజూరు కాని బిల్లులు జిల్లాలో పెండింగ్‌లో రూ. 200 కోట్లకుపైనే.. అప్పుల ఊబిలో కాంట్రాక్టర్లు వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఆవేదనరియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో కొందరు కాంట్రాక్టు పనుల వైపు అడుగులు వేశారు. ఇక్కడ కూడా వారికి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. భూముల దందా అచ్చిరాలేదని ఇటు వస్తే ఇక్కడ కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పని కోసం ఫైనాన్సుల్లో అప్పులు తెచ్చిన చాలామంది వడ్డీ భారం పెరిగిపోయి అవస్థలు పడుతున్నారు. కొందరైతే ఆస్తులు అమ్ముకుని అప్పులు కడుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురవుతున్నారు. అనవసరంగా కాంట్రాక్టు పనులు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మత్తుపదార్థాల పట్టివేత
బోధన్‌రూరల్: సాలూర అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో బుధవారం మత్తుపదార్థాలు (అల్ఫ్రాజోలం, క్లోరోఫాం, డైజోఫాం) పట్టుబడినట్లు బోధన్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. సాలూర చెక్‌పోస్ట్ వద్ద మహారాష్ట్ర బస్సులో తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి బ్యాగుతో పారిపోయే ప్రయత్నంచేశాడని, అతడిని పట్టుకుని విచారించగా బ్యాగులో మత్తుపదార్థాలు ఉన్నట్లు తేలిందన్నారు. మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని మాదకద్రవ్యాల నిరోధకచట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. సాలూరలో నిషేధిత గుట్కా... బోధన్‌రూరల్ : సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద బుధవారం తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.23వేల విలువైన నిషేధిత గుట్కా పట్టుబడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అజాం అనే వ్యక్తి సాలూర నుంచి మహారాష్ట్ర వైపు బస్సులో గుట్కా ప్యాకెట్లు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడని తెలిపారు. గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మహారా ష్ట్రలో ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా చెక్ పోస్టు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బోధన్ నుంచి ఎయిర్‌పోర్టుకు సూపర్ లగ్జరీ
బోధన్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు బోధన్ నుంచి నవంబర్ 4వ తేదీ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డీఎం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు బస్సు బోధన్ నుంచి బయల్దేరుతుందని, వర్ని, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జేబీఎస్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాత్రి 12 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి బోధన్‌కు ఉదయం 11.10 గంటలకు చేరుకుంటుందని వివరించారు. బోధన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఒక్కొక్కరికి రూ.590 చార్జీ ఉంటుందని తెలిపారు. పామూరుకు అదనంగా మరో బస్సు.. బోధన్ నుంచి పామూరుకు అదనంగా మరో బస్సును ప్రారంభించనున్నట్లు డీఎం తెలిపారు. ఈ సర్వీసు ప్రతి రోజూ బోధన్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం6.15 గంటలకు పామూరుకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదేరోజు సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 8.45 గంటలకు బోధన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
స్వచ్ఛతకు మారుపేరు విజయ డెయిరీ
నిజామాబాద్ రూరల్: విజయ డెయిరీ పాలు స్వ చ్ఛతకు మారుపేరని, ఏ మాత్రం కల్తీకి ఆస్కారం ఉండదని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి సారంగాపూర్ లోని విజయ డెయిరీని చైర్మన్ అమిత్‌రెడ్డి బుధవారం సందర్శించారు. అధికారులతో మాట్లా డి పాల సేకరణ, విక్రయాల వివరాలు తెలుసుకున్నారు. పాల శీతలీకరణ ప్రక్రియను పరిశీలించి, పాడి రైతులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు తోడ్పాటునందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.50కోట్ల నిధులు విడుదల చేశారని, అదనంగా మరో రూ.10కోట్ల బకాయిలను పాడి రైతులకు చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే విజయ పాల విక్రయాలు గణనీయంగా పెరిగాయని, మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ విజ య డెయిరీ యూనిట్ల ద్వారా 4.40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా, 3.20 లక్షల లీటర్ల పాలు మాత్రమే అమ్ముడవుతున్నాయని తెలిపారు. మిగిలిన పాలను మిల్క్ పౌడర్‌గా, వెన్నగా మార్చేందుకు చిత్తూరు జిల్లాకు పంపించాల్సి వస్తుండడంతో సంస్థపై ఆర్ధిక భారం పడుతోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పాడి రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పాడి పరిశ్రమలో నష్టాలను నివారిస్తూ, లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో రైతు సంఘాలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు. పూర్తి సహకారం అందిస్తా విజయ డెయిరీ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం త రఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. పాలు వినియోగించే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజయ డెయిరీ పాలనే వినియోగించాలని సూచించారు. పాడిరైతులకు తోడ్పాటునందించాలిజిల్లాలో వినియోగం అవుతున్న పాలలో కేవ లం పది శాతం మాత్రమే విజయ డెయిరీ పాల ను వినియోగిస్తున్నారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ముల్కనూరులో రైతులు సమాఖ్యగా ఏర్పడి సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించారని, అదే స్పూర్తితో జిల్లాలోని పాడి రైతులు కూడా కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సారంగాపూర్ విజయ డెయిరీ యూనిట్ ఉప సంచాలకులు నాగేశ్వర్రావు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, పాడి రైతుల సంఘం ప్రతినిధులు సురేశ్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలలో ఏమాత్రం కల్తీకి ఆస్కారం లేదు రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు మేలు చేస్తోంది పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి -
నిబంధనలు తూచ్!
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. స్కానింగ్ కేంద్రాలలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లలో తప్పుడు ఫలితాలు ఇస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ఆయా ఆస్పత్రులు, కేంద్రాలపై చర్యలు తీసుకోవడంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టకపోవడంతో ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకుల ఇష్టారాజ్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన లింగ నిర్ధారణ, స్కానింగ్ యంత్రాల సీజ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 2011లో రాజంపేట ఆస్పత్రిలో ఓ వైద్యుడి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్న స్కానింగ్ యంత్రాన్ని చాలాకాలంగా జిల్లా కేంద్రంలో వినియోగిస్తున్నారని విచారణలో తేలింది. మిగతా రెండు స్కానింగ్ యంత్రాలను సైతం నిబంధనలకు విరుద్ధంగానే వినియోగించారు. ఈ ఘటనలతో ఇన్నేళ్లుగా ఆ ఆస్పత్రి, స్కానింగ్ యంత్రాలపై వైద్యశాఖ పర్యవేక్షణ కరువైందని తేలిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్‌కు సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనుమతుల మంజూరులో అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. గోదాంరోడ్‌లోని రెండు స్కానింగ్ కేంద్రాలలో, ఓ మెటర్నిటీ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. అలాగే ఎలాంటి అర్హతలు లేనివారు స్కానింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి అర్హతలు లేనివారు పరీక్షలు చేస్తుండడంతో డయాగ్నోస్టిక్ సెంటర్లలో తప్పుడు ఫలితాలు వస్తున్నాయి. ఈ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నా వైద్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.తనిఖీలు లేకుండానే..జిల్లాలో 70కిపైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. 18 స్కానింగ్ సెంటర్లు, 100కుపైగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లాలో ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్స్, ఎక్స్‌రే సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్‌కు సంబంధించి ఏడాది కాలంలో గత డీఎంహెచ్‌వో 56 ఫైళ్లపై సంతకాలు చేసినట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రులు, సెంటర్లను ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. అనుమతులకోసం భారీ మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చాయి. లింగ నిర్ధారణ పరీక్షలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఆస్పత్రి, స్కానింగ్ కేంద్రాలకు అనుమతుల విషయంలోనూ భారీగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులు ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో తనిఖీలు కరువు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నా చర్యలు నామమాత్రం వైద్యశాఖపై విమర్శల వెల్లువ తనిఖీలు చేస్తున్నాం జిల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. అందరూ నిబంధనలు పాటించాల్సిందే. – చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో -
లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుకెళ్లాలి
డిచ్పల్లి: విద్యార్థినులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని అప్పుడే మంచి ఫలితాలు సాధించొచ్చని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను న్యాయమూర్తి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం శిక్షణ తీసుకుని తమను తాము కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఉంటే 1098కు ఫోన్ చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడిపిస్తే ప్రకారం శిక్షార్హులన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, మండల ప్రత్యేకాధికారి యోహాన్, ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ ప్రభాకర్, ఎస్సై మహ్మద్ షరీఫ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తి సునీత కుంచాలపై ఇటీవల ‘సాక్షి‘లో ప్రచురితమైన కథనాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నళిని ఫొటోఫ్రేమ్గా చేయించి అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
కమ్మర్పల్లి: స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందా డు. మండల కేంద్రంలోని మెట్పల్లి రోడ్డులో ఉన్న భారత్పెట్రో ల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్‌పల్లికి చెందిన చింత కిషన్(28) బిర్లా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితుడు హరీశ్గౌడ్తో స్కూటీపై మెట్‌పల్లికి వెళ్లాడు. రాత్రి సమయంలో తిరిగి వస్తూ పెట్రోల్ పోయించేందుకు కమ్మర్పల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్‌లోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పండగకు అత్తారింటికి వెళ్తూ.. బాన్సువాడ రూరల్: మండలంలో బోర్లం గ్రామాని కి చెందిన జోగొల్ల ప్రవీణ్(25) బుధవారం బీర్కూ ర్ మండలం దామరంచ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీపావళి పండుగకు హస్గుల్లోని తన అత్తగారి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా దామరంచ శివారులో ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు.. మాచారెడ్డి: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం భవానీపేట వద్ద కామారెడ్డి – సిరిసిల్ల రోడ్డుపై చోటు చేసుకొంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన టీ సుబ్బారావు(36) ద్విచక్రవాహనంపై కామారెడ్డి నుంచి అంబారిపేటకు వెళ్తుండగా, మాచారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో భవానీపేట వద్ద ఢీకొట్టింది. ఈఘటనలో సుబ్బారావు అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
మాచారెడ్డి : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చుక్కాపూర్లో చోటు చేసుకుంది. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నూనె చంద్రం(50) మూడు నెలల కిందట ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రం కుమారుడు ప్రవీణ్(25) భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై బుధవారం తన తల్లి రాజమణి ఇంట్లో లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. భర్త, కొడుకు దూరం కావడంతో ప్రవీణ్ తల్లి రాజమణి అనాథగా మారింది. ఇద్దరినీ కోల్పోయి తాను ఉండేమి ఫలితమని తలబాదుకుంటూ కన్నీరుమున్నీరైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. రైలు కిందపడి మహిళ .. ఖలీల్‌వాడి: ఆవేశంలో రైలు కిందపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం తెలిపారు. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి.. బోధన్ ఆచన్‌పల్లికి చెందిన ఆ సది సుజాత(38)కు 14 సంవత్సరాల క్రితం అ ర్సపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆసది రవితో వివాహమైంది.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎప్పుడూ ఆవేశంగా ఉండే సుజాత తరచూ భర్తతో, పక్క ఇంటి వారితో గొడవపడేది. మంగళవారం రోజున సై తం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో రా త్రి 9.30గంటలకు సుజాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.సుజాత బుధవారం ఉదయం రైలు పట్టాల ప క్కన శవమై కనిపించింది. తన భార్య మృతిపై ఎ లాంటి అనుమానాలు లేవని భర్త రవి పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడిపై స్నేక్‌గ్యాంగ్ దాడి ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌నగర్ లో ఓ యువకుడిపై స్నేక్ గ్యాంగ్ దాడి చేసినట్లు తెలిసింది. గ్యాంగ్‌లోని సభ్యుడి అనుమతి లేకుండా కాలనీలోకి రావొద్దని, పాతకక్షలతో యువకుడిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడిలో గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఒకటోటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌హెచ్‌వో రఘుపతిని వివరణ కోరగా.. దాడి ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. మూడు నెలల్లో తండ్రి, కుమారుల బలవన్మరణం అనాథగా మారిన తల్లి.. చుక్కాపూర్లో విషాదం -
ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి అర్చరీ పోటీలకు దోమకొండకు చెందిన నవీన్ ఎంపికై నట్లు అర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ బుధవారం తెలిపారు. అండర్–19 విభాగంలో నవీన్ ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ.. కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నవీన్ ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. నవంబర్ 11న గుజరాత్లో జరిగే జాతీయస్థాయి పోటీలో నవీన్ పాల్గొంటాడని ఆయన పేర్కొన్నారు. పలువురు అభినందనలు తెలియజేశారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సందీప్‌కుమార్ కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి.సందీప్‌కుమార్ విశ్వ విద్యాలయాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కె.విజయ్‌కుమార్, ఇన్చార్జి పీడీ జి.శ్రీనివాస్‌రావు తెలిపారు. తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొన్న సందీప్‌కుమార్ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. తమిళనాడులో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం తరపున పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎం.అదెయ్, అథ్లెటిక్స్(షార్ట్ఫుట్)లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు దామోదర్ రెడ్డి, పీడీ హన్మంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 68వ ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహించగా.. అండర్–14 బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అభినందించారు. -
అదనపు కలెక్టర్‌కు అభినందనలు
కామారెడ్డి అర్బన్: అదనపు కలెక్టర్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వి.విక్టర్‌ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బి.సాయిలు, కేంద్ర సంఘం కార్యదర్శి ఎం.నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, చిన్న పోచయ్య, తదితరులు పాల్గొన్నారు. రేపు బీకేఎస్ ఆధ్వర్యంలో నిరసనలు కామారెడ్డి అర్బన్: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 1న ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్టు బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరబోసిన ధాన్యం వర్షాలతో తడిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసనల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. షబ్బీర్ అలీని కలిసిన మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ దంపతులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. దీపావళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి డ్రైఫ్రూట్స్, పండ్లను అందజేశారు. చిత్రపటం అందజేసిన బ్రహ్మానందం కామారెడ్డి టౌన్: మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ దంపతులు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తన చేతితో స్వయంగా గీసిన వేంకటేశ్వరుడి చిత్రపటాన్ని చైర్పర్సన్ దంపతులకు జ్ఞాపికగా అందజేశారు.