-
ముద్దుల్లో మొనగాడు..!
బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీని పాకిస్థాన్ నటి హుమైమా మాలిక్ తెగ పొగిడేస్తోంది. రాజా నట్వర్లాల్ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హుమైమా-హష్మీల మధ్య పలు శృంగార దృశ్యాలున్నాయి. వీటి గురించి హుమైమా మాట్లాడుతూ... ‘రాజా నట్వర్లాల్లో ఇమ్రాన్‌తో కలిసి నటించడం సౌకర్యంగానే అనిపించింది. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ప్రత్యేకించి ముద్దు దృశ్యాలను చిత్రీకరించే రోజు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఎందుకంటే నా నటజీవితంలో ఇప్పటిదాకా ముద్దు సీన్లలో నటించలేదు. తొలిసారి కావడంతో షూటింగ్ ముందు రోజంతా అసౌకర్యంగానే ఫీలయ్యాను. అయితే అప్పటికే ముద్దు సీన్లను పండించడంలో అనుభవమున్న ఇమ్రాన్ నా భయాన్నంతా పోగొట్టాడు. అసభ్యంగా ఉందన్న అభిప్రాయం ఏమాత్రం కలగకుండా చేశాను. మొత్తానికి అంతా బాగానే జరిగిపోయింది. పలు శృంగార దృశ్యాలను కూడా అసభ్యతకు ఏమాత్రం తావులేకుండా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే ఇటువంటి దృశ్యాల్లో నటించిన తర్వాత నేను మళ్లీ పాకిస్థాన్‌కు వెళితే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాను. అది కేవలం నటన మాత్రమే. నా నటనతో పాకిస్థాన్‌కు పేరుప్రఖ్యాతులు సంపాదించిపెట్టాను. ‘బోల్’ సినిమా ఆడిషన్స్ కోసం దేశవిదేశాల నుంచి ఎంతోమంది వచ్చినా నేను ఎంపిక కావడం, ఆ చిత్రంలో నా నటనకు లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడాన్ని పాకిస్థాన్ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా. నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నా. విమర్శించేవారు కూడా ఉంటారు. వారి విమర్శలను పట్టించుకుంటే కెరీర్లో నేను ఇంతకుమించి ముందుకెళ్లలేన’ని చెప్పింది. ఇదిలాఉండగా తాను ఇకపై బికినీ వేసుకొని తెరపై కనిపించనని స్పష్టం చేసింది. -
వాన అనుభవం బాగుందన్న హుమైమా
బాలీవుడ్లో తొలిసారిగా వానపాటలో నర్తించిన పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్.. ఆ అనుభవం చాలా బాగుందని చెబుతోంది. ఇమ్రాన్ హష్మీతో కలిసి 'రాజా నట్వర్లాల్' అనే సినిమాలో 'తేరే హోకే రహేంగే' అనే వానపాటకు ఆమె నర్తించింది. తాను వానపాటలో నటించడం ఇదే తొలిసారని, ఈ అనుభవం చాలా బాగుందని ఆమె చెప్పింది. బాలీవుడ్లో వానపాటల్లో ఎలా చేస్తారో తెలుసుకోడానికి ఆమె పలు వానపాటల వీడియోలు ముందుగా చూసి మరీ చేసిందట. తొలిసారి తాను వానపాటలో నటించానని, ముందు రోజు రాత్రంతా బాలీవుడ్ వానపాటలను చూస్తూనే ఉన్నానని పాట ఆవిష్కరణ సందర్భంగా హుమైమా చెప్పింది. వానపాటల్లో నర్తించడం చాలా ఆసక్తికరమైన అనుభవమని, దాన్ని తాను చాలా ఆస్వాదించానని తెలిపింది. రెండు రోజుల పాటు చాలా కష్టపడి ఆ పాట షూటింగ్ చేశామని వివరించింది. ఈ పాటను అరిజిత్ సింగ్ పాడాడు. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన 'రాజా నట్వర్లాల్' సినిమాలో పరేష్ రావల్, కే కే మీనన్ కూడా ఉన్నారు. ఇది ఆగస్టు 29న విడుదల కానుంది. -
అతను రొమాన్స్ సీన్లలో దిట్ట!
ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి రొమాన్స్ సీన్లను అద్భుతంగా పండిస్తాడని పాకిస్తాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ స్పష్టం చేసింది. ఇమ్రాన్ కి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని ఆమె పేర్కొంది. ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్‌రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
ప్రమోషన్లు, బదిలీలు తక్షణమే చేపట్టాలి
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement