-
ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌తో మళ్లీ మన ముందుకు రాబోతుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, గేమింగ్ హార్డ్‌వేర్, ఆడియో యాక్ససరీస్‌పై పలు డీల్స్‌ను ప్రకటించింది. అయితే ఏఏ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనుందో మాత్రం ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌లో భాగంగా లెనోవో ఫ్యాబ్ 2పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది. అదేవిధంగా లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ ధర 30 వేల రూపాయల నుంచి 22,999కు తగ్గించింది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందించనుంది. ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ7 ప్రాసెసర్స్ ల్యాప్‌టాప్‌లను ఈ వెబ్సైట్ లిస్టు చేసింది. అదనంగా హోమ్ యూజ్ ల్యాప్‌టాప్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లిస్ట్ అయ్యాయి. వీటి ధర 11,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. డెల్ నుంచి బడ్జెట్ ల్యాప్‌టాప్‌లను 17,990 రూపాయలకు, లెనోవో నుంచి 18,990 రూపాయలకు అందిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లను కూడా బెస్ట్ ధరల్లో అందుబాటులో ఉంచింది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్ కింద 12వేల రూపాయల తగ్గింపును ఇస్తుంది. ఆపిల్, శాంసంగ్, లెనోవో, మైక్రోమ్యాక్స్, ఐబాల్ వంటి బ్రాండుల టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ ఐప్యాడ్ మోడల్స్ ధర 24,900 రూపాయల నుంచి ప్రారంభమవనున్నాయి. ఐప్యాడ్ మోడల్స్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లెనోవో ట్యాబ్ 4 సిరీస్‌పై 25 శాతం వరకు డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తుంది. అదనంగా శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్3పై 10,500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తుంది. -
గ్రాండ్ గాడ్జెట్ డేస్: ఫ్లిప్‌కార్ట్ మరో సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక సేల్ అనంతరం మరో సేల్ నిర్వహిస్తూనే ఉంది. తాజాగా గ్రాండ్ గాడ్జెట్ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఈ సేల్ కింద గేమింగ్ హార్డ్‌వేర్, ల్యాప్టాప్స్, కెమెరాలు, ఆడియా యాక్ససరీస్‌పై బెస్ట్ డీల్స్‌ను, ఆఫర్లను ప్రకటించింది. జూలై 26 వరకు ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో గాడ్జెట్లు అతి తక్కువకు 999 రూపాయలకే లభ్యం కానున్నాయి. ఇంటెల్ కోర్ ఐ3, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో రూపొందిన ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్ 26,990 రూపాయలకు, 41,990 రూపాయలకు లిస్టు చేసింది. బడ్జెట్ ల్యాప్‌టాప్‌లు ఏసర్, ఐబాల్, లావా,మైక్రోమ్యాక్స్ ల్యాప్‌టాప్ ధరలు అతి తక్కువకు రూ.10,499 నుంచే ప్రారంభం కానున్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్ 20వేల రూపాయల వరకు ఉంది. అంతేకాక, టూ-ఇన్-వన్ ల్యాప్‌టాప్‌లను 25,990 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఏఐఓ డెస్క్‌టాప్ కలిగిన ఇంటెల్ ఇంటెల్, లెనోవో, హెచ్‌పీ ల్యాప్‌టాప్ ధరలు రూ.32,490 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్ గాడ్జెట్ సేల్‌లో కానూన్ ఈఓఎస్ 700డీ డీఎస్ఎల్ఆర్ కెమెరా రూ.39,499కి లభ్యంకానుంది. అదేవిధంగా ఈ కెమెరాతో పాటు రూ.6,999 విలువ గల మోటో హెడ్‌ఫోన్స్ ఉచితంగా లభించనున్నాయి. అదనంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు 5 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. గోప్రో హిరో 5 స్పోర్ట్స్, యాక్షన్ కెమెరా కూడా రూ.36,100కే లభించనుంది. వీటితోపాటు ఐపాడ్, టాబెట్లపై ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఆపిల్, లెనోవో, శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఐబాల్ వంటి టాబ్లెట్లపై గ్రేట్ డిస్కౌంట్లను, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, హోమ్ థియేటర్ సిస్టమ్స్ వంటి ఆడియో యాక్ససరీస్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
- అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
Advertisement