-
దెయ్యంలా కనిపిస్తున్నా!
వయసు మీద పడిపోతుంటే అందం తగ్గిపోతుంది. కొందరు హ్యాపీ పర్సన్స్ ఉంటారు. వాళ్లలా హ్యాపీగా ఉండటమే గొప్ప అందం. కానీ పిల్లలు, కెరీర్, ఇల్లు, గోల.. అందాన్ని మింగేస్తాయి. డ్రూ బ్యారీమోర్.. ప్రపంచం మెచ్చిన అందగత్తె. హాలీవుడ్లో పాపులర్ స్టార్. నలభైల్లో ఉన్నా కూడా ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం. అలాంటి అంతగత్తె కూడా నలభైల్లోకి వచ్చాక ఆడవాళ్లకు అందం విషయంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటోంది. అలాగే వాటినుంచి ఎలా బయటపడాలో కూడా ఆమే చెప్తోంది. ‘‘నాకు కళ్లకింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అవంటే నాకు పిచ్చి భయం. నేనేదో డిప్రెషన్లో ఉన్నట్టు చూపిస్తాయి ఆ సర్కిల్స్. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానని ప్రపంచానికి ఎలా చెప్పడం? ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మామూలుగా, డార్క్ సర్కిల్స్ కోసం వైట్ కలర్ క్రీమ్స్ వాడుతూంటారు. కానీ అదస్సలు బాగోదు. మీ స్కిన్‌టోన్ కలర్‌కు దగ్గరగా ఉండే కలర్స్ వాడుతూ ఉండాలి. నేనదే చేస్తా. డార్క్ సర్కిల్స్ పోగొట్టుకుంటే కేవలం అందాన్ని కాపాడుకున్నట్టు కాదు, మనం హ్యాపీగా ఉన్నామని ప్రపంచానికి చెప్పినట్టు కూడా! నేనైతే డార్క్ సర్కిల్స్‌తో శ్మశానం నుంచి లేచొచ్చిన దెయ్యంలా కనిపిస్తున్నా!’’ అని నవ్వుతూ చెప్తూ, సలహాలిచ్చేస్తోంది డ్రూ బ్యారీమోర్. ఆమె బ్యూటీ టిప్స్‌కు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆమె అందం ఫార్ములా తెలిసింది కదూ! అయితే అందం.. ముందు హ్యాపీగా ఉంటేనే సుమా!! -
టైమ్ ట్రావెల్ బ్యూటీ!!
చిన్నప్పటి ఫోటోలు చూసుకున్నప్పుడు మనకేం అనిపిస్తుంటుంది? ‘అబ్బా భలే క్యూట్‌గా ఉన్నాం’ అనుకుంటాం కదూ! అప్పడుండే క్యూట్‌నెస్ వయసొచ్చాక ఎక్కడన్నా ఉంటుందా? అని మళ్లీ మనమే ఆ రోజులను గుర్తు చేసుకొని, ఆ ఫోటోలను చూసుకొని మురిసిపోతుంటాం. డ్రూ బేరిమోర్ మాత్రం ఇక్కడే ఆగిపోలేదు. చిన్నప్పుడు ఉన్న క్యూట్‌నెస్‌ను మళ్లీ తిరిగి పొందాలనుకుంది. అప్పుడు దిగినట్లుగానే, క్యూట్‌గా పోజులిచ్చి ఫోటోలు దిగాలనుకుంది. దిగింది కూడా! చిత్రమేంటంటే ఆ అందం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఆ క్యూట్‌నెస్ ఇప్పుడింకా అలాగే ఉంది. ఆ ఫోటోలకు ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఫిదా! డ్రూ బేరిమోర్ 1980–85 కాలంలో, తనకు 5–10 ఏళ్ల వయసున్న రోజుల్లో దిగిన ఫొటోలు చూసి సంబరపడింది. అలాంటి డ్రెస్సే వేసుకొని, అలాగే ఇప్పుడు ఫోటో దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆమె తన కొత్త ఫోటోషూట్‌కు రంగం సిద్ధం చేసుకొంది. 42 ఏళ్ల డ్రూ.. 32 ఏళ్లు వెనక్కి వెళ్లి పదేళ్ల నాటి తన ఫోటోలు చూసుకుంటూ అలాంటి పోజులతోనే క్యూట్ క్యూట్ ఫోటోలు విడుదల చేసింది. కాలంలో ఎన్నేళ్లు వెనక్కి వెళ్లినా, ఈ బ్యూటీ బ్యూటీయే కదూ!! -
ప్రతిరోజూ ఓ ప్రేమ కథే...
బహుశా 1995 ఏప్రిల్‌లో అనుకుంటాను. ‘రీడర్స్ డెజైస్ట్’ సంచికలో ఓ యదార్థ గాథ చదివాను. అమెరికాలో జరిగిన సంఘటన అది. ఓ భార్యాభర్తలు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. చిన్నపాటి అభిప్రాయ భేదాలతో ఆ బాంధవ్యం కలిసి ఉండాలా, విడిపోవాలా అనేంత ఊగిసలాటలో ఉంది. అనుకోకుండా భార్యకి యాక్సిడెంట్ అయింది. ఆమ్నీషియా (మతిమరుపు)కి లోనయ్యింది. తనకి పెళ్లయిందని గాని, భర్తా పిల్లలున్నారనే విషయం కాని ఏమాత్రం గుర్తులేదు. అన్నింటినీ, అందరినీ మరిచిపోయింది. ఆ భర్త ఆమెని తిరిగి ప్రేమించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఆమెని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన మీద ప్రేమనే కాదు, తన మీద కోపాన్ని కూడా మర్చిపోయింది కాబట్టి ఆమెని ప్రేమించడంలో గొప్ప ఆనందం ఉందన్నాడు భర్త. ఆ ప్రేమకథ నన్ను వెంటాడింది. ఆ సంఘటన ఆధారంగా ఓ స్క్రిప్ట్ రాసి, అప్పటి ప్రముఖ దర్శకుల్లో ఒకరైన ఇ.వి.వి. సత్యనారాయణ గారిని కలిశాను. శ్రీకాంత్ హీరోగా సినిమా రూపొందించడానికి ఆయన ఉత్సాహం చూపించారు. అయితే ఒక దశలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ‘ప్రేమించిన మనిషికి మతిమరుపు వరం’ అన్నారు ఆత్రేయ. మనిషే కాదు. తెలుగు సినిమాకి కూడా మతిమరుపు బాక్సాఫీస్ ఇచ్చిన గొప్ప వరం. ఆనాటి పవిత్ర బంధం (అక్కినేని), చీకటి వెలుగులు, వసంత కోకిల, ముద్దుల ప్రియుడు నుంచి నిన్నటి ‘గోపి-గోపిక-గోదావరి’ వరకూ ప్రూవ్ అయిన సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. ఈ గతం మర్చిపోవడం మీద చాలా వెటకారాలు, పేరడీలు కూడా వచ్చాయి. అది వేరే సంగతి. 2004లో నేను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌గారి దగ్గర స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ‘50 ఫస్ట్ డేట్స్’ అనే సినిమా చూశాను. ‘రీడర్స్ డెజైస్ట్’లోని యదార్థ గాథ గుర్తొచ్చింది. ఆ సినిమా ప్రేరణతో జగన్‌గారు తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా ఓ సినిమా చేద్దామనుకున్నారు. హీరోకి షార్ట్ టైమ్ మెమరీలాస్. తను ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోతాడు. ఇలాంటి లైన్స్‌తో స్క్రిప్ట్ చేసి పక్కన పెట్టేశారు. ⇔ అడామ్ సాండ్లర్ హెన్రీ రూత్‌గా, డ్రూ బారీమోర్ లూసీగా నటించారు. జార్జి వింగ్ రచయిత కాగా, పీటర్ సీగల్ దర్శకుడు. ⇔ 75 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 197 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ⇔ఈ సినిమాలో ఆమ్నీషియా పేషెంట్ అయిన హీరోయిన్‌కి డైలీ రొటీన్ షూట్ చేసి, ఆ మరుసటిరోజు వీడియో టేప్ చూపించడం అనే కాన్సెప్ట్ - నిజ జీవితంలో చాలామంది మతిమరపు వ్యాధిగ్రస్తులకి డాక్టర్లు సూచించారు. అమలు చేసి, సక్సెస్ అయ్యారు కూడా. ⇔ తెలుగులో భూమిక హీరోయిన్గా వచ్చిన ‘సత్యభామ’ చిత్రానికి ఇదే స్ఫూర్తి. ⇔ అలాగే మలయాళంలో కూడా ‘ఒర్మాయుందో ఈ ముఖం’ అనే సినిమా 50 ఫస్ట్ డేట్స్ ప్రేరణతోనే రూపొందింది. ⇔ ఆ మధ్య వచ్చిన ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో భువన చంద్ర, బలభద్రపాత్రుని రమణి ట్రాక్‌లో కూడా పేరడీగా 50 ఫస్ట్ డేట్స్ ఛాయలు కనబడతాయి. ప్రేమని చెరిగిపోయే హరివిల్లుతో పోల్చారు ప్రముఖ కవి ఆలూరి బైరాగి. ప్రేమ ఎంతో కాలం ఉండదు. దాని తీవ్రత, గాఢత చాలా సందర్భాల్లో తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా ప్రేమించి, పెళ్లి చేసుకున్నవాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ప్రతిరోజూ కొత్తగా ప్రేమించడం, ప్రేమని వ్యక్తం చేయడమంటే ఎంతో బాగుంటుంది కదా - అదే ‘50 ఫస్ట్ డేట్స్’ కథ. హవాయి ద్వీపాలు ప్రకృతి అందాలకే కాదు, టూరిస్టులకీ ప్రసిద్ధి. హెన్రీ రూత్ అనే గైడ్ ఓహో ఐలాండ్‌కి వచ్చే లేడీ టూరిస్టులని తన మాటలతో పడేసి సరదాలు తీర్చుకుంటుంటాడు. సీరియస్ రిలేషన్షిప్ మీద అతనికే మాత్రం నమ్మకం లేదు.ఒకసారి హెన్రీ బోటు ఫెయిల్ కావడంతో కోస్ట్‌గార్డ్ కోసం ఎదురుచూస్తూ ఓ కేఫ్‌లో కూర్చుంటాడు. ఆ కేఫ్‌కి లూసీ విట్మూర్ అనే అమ్మాయి వస్తుంది. హెన్రీ.. లూసీతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఆ మరుసటి రోజు కలుద్దామంటుంది లూసీ. ఆ అమ్మాయి మీద ఆసక్తితో ఆ మరుసటి రోజు కేఫ్‌కి వెళ్తాడు హెన్రీ. తీరా లూసీ అతడినే మాత్రం గుర్తుపట్టదు. హెన్రీ షాకవుతాడు. రెస్టారెంట్ ఓనర్ అసలు కథ చెబుతాడు. అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 13న లూసీ తన తండ్రితో పాటు బయటికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌కి గురవుతుంది. ఆమ్నీషియా వ్యాధికి గురవుతుంది. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే ప్రతిరోజూ ఆ అక్టోబర్ 13 అనుకుంటూ ఉంటుంది లూసీ. ఇంట్లోవాళ్లందరూ అక్టోబర్ 13 కిందే సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ రోజు పేపర్ తీసుకొస్తారు. లూసీ తండ్రి మార్లిన్ బర్త్‌డేగా సెలబ్రేట్ చేస్తారు. టీవీలో అదే వైకింగ్స్ ఆట చూస్తుంటారు. లూసీ గతం తెలుసుకున్నా హెన్రీ ఆమెను వదల్లేకపోతాడు. ఆమెతో పరిచయం మరింత పెంచుకుంటాడు. లూసీ తండ్రి, సోదరుడు హెన్రీని దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. ఒక దశలో ఓ పోలీసాఫీసర్ ద్వారా లూసీకి నిజం తెలుస్తుంది. కలత చెందుతుంది. మరోవైపు హెన్రీ ఆమె దినచర్యని షూట్ చేసి, ఆ వీడియో ఆమెకి చూపిస్తుంటాడు. క్రమేపీ లూసీకి తనకి యాక్సిడెంట్ అయిందని, మతిమరుపు వచ్చిందని గ్రహిస్తుంది. హెన్రీ తనతో ఉండటం కోసం, తనని ప్రేమించడం కోసం తన జీవితాశయాన్ని పక్కన పెట్టాడని లూసీకి తెలుస్తుంది. అతనితో విడిపోతుంది. హెన్రీ సెయిలింగ్ ట్రిప్‌కి వెళ్తుండగా, లూసీ పాడిన ఓ పాట సీడీ తెచ్చి ఇస్తాడు ఆమె తండ్రి మార్లిన్. హెన్రీని కలిశాకే తొలిసారి ఆ పాట పాడినట్లు చెబుతాడు ఆమె తండ్రి. లూసీ ప్రస్తుతం బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో ఉందని తెలుసుకుని హెన్రీ అక్కడికి వెళ్తాడు. తను గుర్తున్నానా అనడుగుతాడు. హెన్రీ తెలియదని, ప్రతిరోజూ అతను కలలోకి వస్తున్నాడని లూసీ చెబుతుంది. కొంతకాలం తర్వాత లూసీ నిద్ర లేచేటప్పటికి ఓ వీడియో టేప్ ఎదురుగా ఉంటుంది. అందులో ఆమె యాక్సిడెంట్‌తో పాటు లూసీ, హెన్రీల పెళ్లి వీడియో కూడా ఉంటుంది. - తోట ప్రసాద్ -
'ఇంకెంతమాత్రం హాట్‌గా ఉండలేను'
చైల్డ్ స్టార్ నుంచి హాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగిన డ్రూ బ్యారిమోర్.. తాను ఇంకెంతమాత్రం 'హాట్', 'హాట్'గా కనిపించలేను అంటోంది. ఎన్నో చిత్రాల్లో తన అందాలతో అభిమానుల మతులు పోగొట్టిన ఈ 40 ఏళ్ల ప్రౌఢ సుందరి తాజాగా హార్పర్స్ 'బజార్' మ్యాగజీన్లో 'హాట్ లుక్'తో దర్శనమిచ్చింది. అయితే ఎల్లప్పుడూ టాప్ హీరోయిన్గా కొనసాగడం కష్టమని, కాలంతోపాటు సాగుతూ వైవిధ్యం కనబర్చాలని అంటోంది ఈ అమ్మడు. 'హాట్‌గా ఉండటం అనేది ఒక మనోస్థితి. అది ఒక ఉత్సాహం. ఒక ప్రేరణ వల్ల మీరు హాట్‌గా కనిపిస్తారు. అంతేకానీ హాట్‌గా ఉండటమంటే టాప్ లో ఒకరిగా ఉండటమో, అందమైన శరీరాన్ని కలిగి ఉండటమో కాదు. ఇంకా చెప్పాలంటే ఒక ఆరాధనతో దహించుకుపోయేవాళ్లే హాట్‌గా కనిపిస్తారు' అని బ్యారిమోర్ పేర్కొంది. 'ద చార్లీస్ ఎంజెల్స్', 'ఈటీ-ఎక్స్టా టెరెస్ట్రియల్' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న వ్యాపారాలతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది. కీర్తి ప్రతిష్టలు అన్నవి తాత్కాలికం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్తోంది. -
బ్రేక్ తీసుకుంటున్న హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రీ బారీమూర్ సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. చార్లెస్ ఏంజిల్స్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బారీమూర్ తన ఇద్దరు కూతుళ్లను చూసుకోవటం కోసం కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలన్ననిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల వయసు నుంచే యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతానికి పిల్లలే తనకు ప్రపంచం అని షూటింగ్‌ల మూలంగా గంటలు, రోజుల తరబడి వాళ్లకు దూరంగా ఉండటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపింది బారీమూర్. ఆమె నటించిన మిస్ ము ఆల్రెడీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
Advertisement