-
నాలుగోసారి...
కొన్ని కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్‌లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్–దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్‌లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రానుందట. ‘సర్కార్’ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్ అని యూనిట్ భావించింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు ఆగాయి. ఏప్రిల్‌నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్’ చెప్పిన ప్రకారం ఏప్రిల్ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి. -
దళపతితో పూజాహెగ్డే రొమాన్స్!
చెన్నై : కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు సెట్టయ్యిందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ కుట్టి మాళవికమోహన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుకుంటున్న మాస్టర్ చిత్రం చివరి దశకు చేరుకుంది. అంతేకాదు చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నటి ఆండ్రియా కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని నటుడు విజయ్ పాడిన కుట్టి స్టోరి పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. (బ్యాచిలర్ తొలి పాట రెడీ) ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు విజయ్ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారన్నది తాజా సమాచారం. ఇది ఆయనకు 65వ చిత్రం అవుతుంది. దీన్ని సన్ ఫిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇంతకుముందు ఈ సంస్థ విజయ్ హీరోగా మెర్శల్ చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. అదేవిధంగా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా అన్నాత్తా చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ కథానాయకుడిగా నటించే చిత్రానికి క్రేజీ మహిళా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు ఇరుదు చుట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం సూర్య హీరోగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇదీ సమ్మర్లోనే తెరపై రానుంది. (‘సామజవరగమన’ వీడియో సాంగ్ వచ్చేసింది!) విజయ్‌తో చేసే చిత్రంలో టాలీవుడ్లో క్రేజ్‌లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అమ్మడు దక్షిణాదిలో మొదట ఎంట్రీ ఇచ్చింది కోలీవుడ్‌లోనే అన్నది గమనార్హం. జీవాకు జంటగా దర్శకుడు మిష్కిన్ ముఖముడి చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కారణం ఏదైనా పూజామెగ్డేను ఆ తరువాత కోలీవుడ్ పట్టించుకోలేదు. అలాంటిది చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు దళపతితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. మరోవిషయం ఏమిటంటే నటి ఇలియానా కూడా కోలీవుడ్‌లో కేడీ అనే చిత్రంతో పరిచయం అయ్యి ఆ తరువాత ఇక్కడ కనిపించలేదు. టాలీవుడ్లో వరుస విజయాలతో క్రేజ్ తెచ్చుకున్న తరువాత నన్బన్ చిత్రంతో విజయ్‌కు జంటగా రీఎంట్రీ ఇచ్చింది. నటి పూజాహెగ్డే కూడా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న తరుణంలో ఇప్పుడు దళపతి కొత్త చిత్రంతో రీఎంట్రీ కానుందన్నమాట. ఇదేకనుక నిజం అయితే ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంటుందన్న విషయంలో సందేహం ఉండదు. -
పదిహేడేళ్ల తరువాత అదే కాంబినేషన్లో..!
సౌత్ స్టార్ హీరో మాధవన్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘చెలి’. తెలుగు, తమిళల భాషల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా ఆడియో ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ ఆల్బమ్. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ఈ క్రేజీ కాంబినేషన్ తిరిగి రిపీట్ అవ్వటానికి పదిహేడేళ్ల సమయం పట్టింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇప్పటికే మాధవన్ కు కథ వినిపించిన గౌతమ్, ప్రస్తుతం స్ర్కిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈసినిమాను తమిళ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్లలోనూ తెరకెక్కించనున్నారట. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
కమలహాసన్ చిత్రంలో అక్షర
అందరికీ ఆసక్తిని రేకెత్తించే ఒక క్రేజీ కాంబినేషన్లో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రం అంటేనే అందులో అనేక విశేషాలు పొందుపరచి ఉంటాయని అంటుంటారు. మరి అలాంటి నటుడితో ఆయన రెండో కూతురు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరుమీదున్న నటుడు ధనుష్ లాంటి వారు కలిస్తే ఇది నిజంగా క్రేజీ చిత్రమే అవుతుంది కదు. మరి ఈ భారీ చిత్రాన్ని నిర్మించేదెవరు? దర్శకత్వం చేపట్టేదెవరు? లాంటి వివరాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుందికదా.. కమలహాసన్ చిత్రంలో నటించాలనే ఆసక్తిని ఆయన పెద్ద కూతురు నేటి క్రేజీ హీరోయిన్ శ్రతిహాసన్ చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య అలాంటి ఒక అవకాశం వచ్చినా ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇటీవల హిందీ చిత్రం షమితాబ్ ద్వారా నాయకిగా తెరంగేట్రం అయిన తొలి చిత్రంతోనే చక్కని అభినయంతో ప్రతిభను చాటుకున్న కమల్ రెండో కూతురు అక్షర ఆయనతో నటించే అవకాశం కలిగే తరుణం ఆసన్నమైందన్నది తాజా సమాచారం. ఈ సంచలన చిత్రాన్ని యువ నటుడు ధనుష్ నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన ఒక ముఖ్య భూమికను పోషించనున్నారు. నటి అక్షరహాసన్‌కు కూడా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్‌తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్‌పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement