-
కల్నల్ మహాదిక్‌కు కన్నీటి వీడ్కోలు
సతారా: ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ మహాదిక్ అంత్యక్రియలు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. దేశ రక్షణలో ప్రాణాలు విడిచిన ఆయనకు కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తోపాటు ఆర్మీ అధికారులు, ఆయన గ్రామస్తులు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. 41 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారిగా ఉన్న 38 ఏళ్ల మహాదిక్ జమ్ముకశ్మీర్‌లోని కుప్పారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఎల్వోసీ వద్ద ఉగ్రవాదులను తరుముతూ వెళ్లిన సైనిక బృందానికి నేతృత్వం వహించిన ఆయన ఎదురుకాల్పుల్లో తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకపోయిందని, బుల్లెట్ గాయాలతో ఆయన తుదిశ్వాస విడిచారని ఆర్మీ అధికారులు తెలిపారు. విశిష్ఠమైన పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి అయిన కల్నల్ సంతోహ్ మహదిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదులు దాగున్న ప్రదేశాల్లోకి వెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన సాహసం ఆయనది. 2003లో ఈశాన్య భారతంలో నిర్వహించిన ఆపరేషన్ రినోకు గాను ఆయనకు సేనా శౌర్య పతకం లభించింది. కల్నల్ గా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఆయన సాహసోపేత ఆపరేషన్లను ఆపలేదు. జమ్ముకశ్మీర్‌లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఆర్మీ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగమైన రాష్ట్రీయా రైఫిల్స్ బెటాలియన్‌కు ఆయన నేతృత్వం వహించారు. మహారాష్ట్ర సతరాలోని సైనిక స్కూల్లో చదవి ఆర్మీలో చేరిన కల్నల్ మహాదిక్‌కు భార్య సరస్వతి, 11 ఏళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు. -
ఆ వీర కల్నల్‌కు సైనిక నివాళులు!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మిలిటెంట్ల ఎదురుకాల్పుల్లో మరణించిన అమరవీరుడు కల్నల్ సంతోష్ మహాదిక్‌కు బుధవారం శ్రీనగర్‌లో సైనిక లాంఛనాలతో ఆర్మీ అశ్రునివాళులర్పించింది. 38 ఏళ్ల సంతోష్ మహాదిక్ ఆర్మీ కమాండింగ్ అధికారి. ఈ ఏడాది జరిగిన ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఆర్మీ కమాండింగ్ స్థాయి అధికారి చనిపోవడం ఇది రెండోసారి. విశిష్ఠమైన పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారి అయిన కల్నల్ సంతోహ్ మహదిక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదులు దాగున్న ప్రదేశాల్లోకి వెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన సాహసం ఆయనది. 2003లో ఈశాన్య భారతంలో నిర్వహించిన ఆపరేషన్ రినోకు గాను ఆయనకు సేనా శౌర్య పతకం లభించింది. కల్నల్ గా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఆయన సాహసోపేత ఆపరేషన్లను ఆపలేదు. జమ్ముకశ్మీర్‌లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఆర్మీ ప్రత్యేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగమైన రాష్ట్రీయా రైఫిల్స్ బెటాలియన్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఎల్వోసీ దాటి వచ్చిన ఉగ్రవాదుల తరుముతూ వెళ్లిన దళానికి నేతృత్వం వహించిన కల్నల్ మహాదిక్ ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. సొంత రాష్ట్రం మహారాష్ట్ర సతరాలోని సైనిక స్కూల్లో చదవి ఆర్మీలో చేరిన కల్నల్ మహాదిక్‌కు భార్య సరస్వతి, 11 ఏళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement