-
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
మళ్లీ రెడ్డిగారి అమ్మాయిగా!
రెడ్డిగారి అమ్మాయిగా అదాశర్మ నటన, క్యారెక్టర్ కోసం కష్టపడిన తీరు చూసి సెకండ్ సీక్వెల్లో ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు నిర్మాత విపుల్ అమృత్లాల్ షా. తెలుగమ్మాయి భావనా రెడ్డిగా అదాశర్మ నటించిన హిందీ సినిమా ‘కమాండో–2’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. తెలుగులో అదా శర్మ ఐదు సినిమాలు చేశారు. అప్పుడెప్పుడూ సీరియస్‌గా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. భావనా రెడ్డి క్యారెక్టర్ కోసం కష్టపడి కాస్త తెలుగు నేర్చుకున్నారు. అందుకే, మళ్లీ ఆమెను హీరోయిన్గా తీసుకున్నారట! ఓ సౌత్ సూపర్‌హిట్ సినిమాను బేస్ చేసుకుని ‘కమాండో–3’ రాస్తున్నారట! ‘ఊసరవెల్లి, తుపాకీ’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించిన విద్యుత్ జమాల్ ఇందులో హీరో. ‘కమాండో’, ‘కమాండో–2’ సినిమాల్లోనూ ఆయనే హీరో.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement