-
నటుడితో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న హీరోయిన్!
బాలీవుడ్ భామ రిచా చద్దా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించింది. పంజాబ్‌కు చెందిన ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(37) 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. 2013లో ఫర్కీ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక సినిమాల విషయాకొనిస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్లో నటించారు. అంతే కాకుండా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రంతో నిర్మాతలుగా మారారు. ఈ సినిమా సన్డాన్స్లో రెండు అవార్డులను గెలుచుకుంది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) -
ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్
బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్బంగా ఒక ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రిచా. "1 + 1= 3" అంటూ శుక్రవారం ఇన్‌స్టాలో వెల్లడించింది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) రిచా పోస్ట్‌కు భర్త అలీ ఫజల్ స్పందిస్తూ ‘ఆ చిన్న గుండె సడి తమకు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సవ్వడి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో సన్నిహితులు, అభిమానులు ఈ జంటకు విషెస్ అందిస్తున్నారు. కాగా 2012లో ఫక్రే సెట్స్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత అలీ 2019లో రిచా చద్దాకు ప్రపోజ్ చేశాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రెండేళ్ల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2022 అక్టోబర్ 6 న ప్రీ వెడ్డింగ్ వేడుకలతోపాటు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్!
బాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యింది. మసాన్ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా ప్రియుడు, బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది మార్చిలో పెళ్లికి ప్లాన్ చేసుకోగా ఇద్దరు షూటింగ్‌లతో బిజీ ఉండగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఎలాగైన పెళ్లి పీటలు ఎక్కాలని ఈ జంట గట్టిగా నిర్ణయించుకుందట. చదవండి: రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత ముంబైతో పాటు ఢిల్లీలో వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహనికి హాజరవుతారని సమాచారం. సౌత్ ముంబై హోటల్లో గ్రాండ్ రాయల్ జరుగనుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 2012 ఫక్రీ మూవీ సెట్లో కలుసుకున్న ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఏడేళ్ల డేటింగ్ అనంతరం అలీ ఫజల్, రిచాలు 2019లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సమ్మతితో 2020లో పెళ్లి పీటలు ఎక్కాలనుకున్నారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే.. అయితే కరోనా కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. ఇక 2022లో మార్చి పెళ్లి వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కాలనుకోగా సినిమా షూటింగ్‌లతో ఇద్దరు బిజీగా ఉండటంతో మరోసాని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల లేదా అక్టోబర్‌లో వివాహనికి ఈ జంట ముహుర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అలీ కొన్ని హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తుండగా.. రిచా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘ హీరామండీ ’వెబ్‌సిరీస్‌లో కనిపించనుంది. -
బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు
శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘రే’. ఇది సత్యజిత్ రే కథ 'బిపిన్ చౌదరి కా స్మృతి భ్రం' ప్రేరణలో దీన్ని తీశాడు. ఈ ఆంథాలజీని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు ప్రశంసించారు. అయితే ఆసియాలో పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అయిన బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్)కి మూడో ఆసియా కంటెంట్ అవార్డ్స్‌లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరికి ఈ ఆంథాలజీలో లీడ్‌రోల్ నటించిన అలీ ఫజల్ నామినేట్ అయ్యాడు. మామూలుగా వేరే దేశాల్లో జరిగే ఇలాంటి కార్య్రమాల్లో ఇండియా నుంచి నామినేషన్లు దక్కడం చాలా అరుదనే చెప్పాలి. ఈ ఫిట్ సాధించిన తర్వాత బీఐఎఫ్‌ఎఫ్ నామినేట్ అవ్వడం ఊహించలేదని అలీ తెలిపాడు. ఇది జరగడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఆసియా కంటెంట్ అవార్డ్స్ సాధిస్తాననే ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఈ మూవీ సమయంలో తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురయ్యా: అలీ ఫజల్ -
‘3 ఇడియట్స్’లో నా పాత్ర చేదు అనుభవం ఇచ్చింది: నటుడు
‘3 ఇడియట్స్’ మూవీ సయమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని నటుడు ఫజల్ అలీ తాజాగా వెల్లడించాడు. 2009లో వచ్చిన ఈ చిత్రంలో అలీ ఆత్మహత్యకు పాల్పడిన కాలేజీ స్టూడెంట్ పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ ఈ విడుదల అనంతరం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘3 ఇడియట్స్ సినిమా చేస్తున్న సమయంలో నేను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయా. 3 ఇడియట్స్‌లో నా పాత్ర చాలా చిన్నదే అయినా అది తీవ్ర ప్రభావం చూపింది’ అని పేర్కొన్నాడు. ‘ఎందుకంటే ఈ మూవీలో నేను డీన్ పైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ గడువును పెంచెందుకు నిరాకరించడంలో ఆత్మహత్య చేసుకునే విద్యార్థి పాత్ర పోషించాను. అదే సమయంలో బయట కొంత మంది విద్యార్థులు కూడా ఇలాంటి సంఘటనల కారణంగా ఆత్మహత్యకు పాల్పడటంతో న్యూస్ ఛానల్ వాళ్లు నాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. పలు ఛానల్స్ నాకు ఫోన్ చేసి సర్ 3 ఇడియట్స్ మూవీలో మీరు చేసినట్లుగా కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు’ అంటూ ఫోన్ చేసి రకరకాల ప్రశ్నలతో వేసి వేధించారని చెప్పాడు. ఇక ‘ఈ సంఘటన కారణంగా చాలా ఒత్తిడికి లోనయ్యా. ఎంతో నిరాశకు గురయ్యాను’ అని తెలిపాడు. ఇక ఆ తర్వాత వారితో ప్లీజ్ ఇలా చేయకండని, నిర్మాతతో మాట్లాడండని వారితో చెప్పానని అలీ వివరించాడు. కాగా అమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీని డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరానీ భగత్ చేతన్ నవల్ నుంచి తీసుకుని తెరకెక్కించాడు. 2009లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఫీమేల్ లీడ్ రోల్లో కరిష్మా కపూర్ నటించింది. అయితే హిందీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ ఫజల్ ఇటీవల ‘రే’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. త్వరలో ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. చదవండి: వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ ‘అవికా-మనీశ్‌లకు సీక్రెట్ బిడ్డ’: స్పందించిన నటుడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement