Adilabad District News
-
● కలెక్టర్ రాజర్షిషా ● తుమ్మగూడలో దండారీ ఉత్సవాలకు హాజరు
ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి●ఇంద్రవెల్లి: ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని తుమ్మగూడ గ్రామంలో బుధవారం రాత్రి దండారీ ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అతిథులుగా హాజరయ్యారు. అలాగే కుమురంభీం అసిస్టెంట్ కలెక్టర్ దీపక్‌తివారి, నిజామబాద్ ట్రెయినీ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందు గా గ్రామస్తులు అతిథులను సంప్రదాయ వా యిద్యాలు, గుస్సాడీ నృత్యాల నడుమ స్వాగ తం పలికారు. అనంతరం ఏత్మసూర్ దేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం దండారీ ఉత్సవాల నిర్వహణకు ఐటీడీఏ ద్వారా మంజూరు చేసిన రూ.15 వేల చెక్కులను నిర్వహకులకు అందించారు. ఇందులో రాయిసెంటర్ జిల్లా సార్మేడీ మెస్రం దుర్గు, ఉట్నూర్ బీఈడ్ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, గ్రామపెద్దలు మాన్కు, తదితరులున్నారు. -
జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు
కైలాస్‌నగర్: దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఇంటింటా సిరుల పంట కురి పించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 3 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేతఆదిలాబాద్టౌన్: దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈనెల 31 నుంచి నవంబర్ 3 వరకు నాలు గు రోజుల పాటు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మధుకర్ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి యార్డులో యథావిధిగా పత్తి కొనుగోళ్లు ఉంటాయని పేర్కొన్నారు. విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు.ప్రొవిజినల్ జాబితా విడుదలఆదిలాబాద్టౌన్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ లో భర్తీ చేయనున్న ల్యాబ్ టెక్నీషియన్ 3, పీఎండీటీటీబీహెచ్వీ కోఆర్డినేటర్ ఒకటి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఒకటి, సీనియర్ డాట్ప్లస్ టీబీహెచ్ఐవీ ఒకటి, టీబీహెచ్వీ ఒక పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ జాబితాను బుధవారం విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో కృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాను కార్యాలయ నోటీసు బోర్డుతోపాటుhttp://adilabad. telangana. gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. -
బాలికలకు భరోసా
● ధైర్యం నింపేలా.. ఆత్మస్థైర్యం పెంపొందించేలా ● సర్కారు బడుల్లో బాలికా సాధికారత క్లబ్‌లు ● జిల్లాలో 143 పాఠశాలల్లో జీసీఈసీల ఏర్పాటు ● కౌమార దశలో సమస్యలు అధిగమించేందుకు చర్యలు ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినిల్లో ధైర్యం నింపేలా ఆత్మస్థైర్యం పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కౌమార దశలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధిగమించే దిశగా ముందుకు సాగుతుంది. ఇటీవల పలు పాఠశాలల్లో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై వెకిలి చేష్టలకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో పోకిరీలు, బడుల్లో కొంత మంది విద్యార్థులు వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గురువులకు చెప్పుకోలేక బాలికలు మానసికంగా సతమతం అవుతున్నారు. కొంతమంది తమలో తామే మనోవేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొంత మంది ఎవరికి చెప్పుకోలేక దుఃఖాన్ని దిగమింగుతున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ (జీసీఈసీ)లను ఏర్పాటు చేస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తదితర ఉన్నత పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు చర్యలు చేపడుతుంది. కౌమార సమస్యలు ఎదుర్కొనేందుకు.. ఉన్నత పాఠశాలల్లో చదివే బాలికలు కౌమార దశలో మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారి నడవడిక, ప్రవర్తనలో మార్పులు కలు గుతాయి. విద్యార్థినులు చెడు అలవాట్లకు గురికాకుండా, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు బాలికా సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పాలి.. ఎలా అధిగమించాలి.. ఏయే ఇబ్బందులకు గురవుతున్నారు.. వాటికి పరిష్కారం కోసం ఈ క్లబ్‌లు దోహద పడతాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. విద్యార్థి దశలో కౌమార దశ అనేది ఎంతో కీలకం. అయితే విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు, వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలికల చట్టాలను తెలియజేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కమిటీల ఏర్పాటు.. బాలిక సాధికారత కమిటీలను ఏర్పాటు చేసేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. నవంబర్ 1న విద్యార్థినిలకు ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. 4న జీసీఈసీ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చైర్మన్‌గా, ఫ్రెండ్లీ టీచర్, ప్రతీ తరగతికి ఒక బాలిక సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టెను బడిలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే రిజిస్టర్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను అందులో నమోదు చేయనున్నారు. అలాగే నోటీసు బోర్డుపై టోల్‌ఫ్రీ నం.1098 ను ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన, జనవరిలో న్యాయ సదస్సులు, ఫిబ్రవరిలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. విద్యార్థులకు సదస్సులు ఏర్పాటు చేసి బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ను తెలియజేస్తారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చర్యలు తీసుకునేలా కమిటీలు కృషి చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కరాటే శిక్షణ.. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాణిలక్ష్మిబాయి ఆత్మరక్షణ పరియోజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతితీ ఉన్నత పాఠశాలలో కరాటే శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 163 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇటీవల శిక్షకులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, 54 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగనుంది. శిక్షకుడికి నెలకు రూ.5వేల చొప్పున వేతనం ఇవ్వనున్నారు. ప్రతీ పాఠశాలలో 6 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థినిలకు శిక్షణ కల్పిస్తారు. ఈ కార్యక్రమాలు పీఈటీ, పీడీ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బాలికా సాధి కారత క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. నవంబర్ 4న అన్ని పాఠశాలల్లో వీటిని ఏర్పా టు చేసి ఫిర్యాదుల పెట్టె, రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచుతాం. 143 పాఠశాలల్లో జీసీఈసీ క్లబ్‌లను, అలాగే 163 పాఠశాలల్లో కరాటే శిక్షణ నేర్పించేలా చర్యలు చేపడుతున్నాం. – ఉదయ్‌శ్రీ, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
● రెండు విడతలుగా నిర్వహణ ● నవంబర్ 6 నుంచి ప్రారంభం ● తొలి విడతలో గ్రామాలు, వార్డుల వారీగా ఇళ్ల గుర్తింపు ● ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ
పారదర్శకంగా నిర్వహించాలి కై లాస్‌నగర్: నవంబర్ 6నుంచి ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో సర్వేకోసం ఎంపికై న 370 మంది ఎన్యూమరేటర్లు, 37 మంది సూపర్వైజర్లకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం శిక్షణఇచ్చారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా అందించిన శిక్షణను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రోజుకు పది కుటుంబాల సమాచారం సేకరించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సర్వేకు అవసరమైన సామగ్రిని అందజేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, అర్బన్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డీఈ తిరుపతి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాంసి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యూమరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీవో లింగయ్య తదితరులున్నారు. జైనథ్‌లో ఎన్యూమరేటర్ల శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షి షా శిక్షణకు హాజరైన ఎన్యూమరేటర్లుకై లాస్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దా మాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేదిశగా రాష్ట్ర ప్ర భుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. రెండు విడతలుగా నిర్వహించనున్న సర్వేను విజయవంతం చేసేదిశగా యంత్రాంగం సమాయత్తమవుతుంది. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఎంపిక చేసిన అధికారులు సర్వే నిర్వహణ తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్యూమరేట్లకు నిర్ణీత ప్రొఫార్మాతో పాటు సర్వేకు అవసరమైన సామగ్రిని అందజేశారు. రెండు విడతలుగా.. సమగ్ర కుటుంబ సర్వేను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. నవంబర్ 1నుంచి 3వరకు తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్) చేపట్టనున్నారు. ఎన్యూమరేటర్లు తమ పరిధిలోని గ్రామాలు, పట్టణంలోని నిర్దేశిత వార్డుల్లో గల కుటుంబాల సమాచారం సేకరించనున్నారు. ఇంటి నంబర్, యజమాని పేరు, చిరునామా వంటి వివరాలను నమోదు చేస్తారు. ఆ ఇంటిని సందర్శించినట్లుగా రూపొందించిన ప్రత్యేక స్టిక్కర్‌ను అతికిస్తారు. ఈ సర్వేలో గుర్తించిన ఇళ్ల సంఖ్యకనుగుణంగా 4, 5వ తేదీల్లో సర్వేకు సంబంధించిన ప్రొఫార్మాలను ముద్రించనున్నారు. 6 నుంచి రెండో విడత రెండో విడతలో భాగంగా నవంబర్ 6నుంచి 18 వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ, వార్డుల డిమాండ్ రిజిస్టర్ ఆధారంగా కుటుంబాలను నిర్ధారించనున్నారు. వివరాల నమోదు సమయంలో కుటుంబాల సంఖ్య పెరిగినట్లైతే బై నంబర్‌తో వారి వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. వీరు ఆయా తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన 56 ప్రశ్నలతో 75 అంశాలతో కూడిన సమ స్త సమాచారాన్ని సేకరించనున్నారు. ఎలాంటి వివరాలు సేకరించాలి, వాటిని ప్రొఫార్మాలో ఏ విధంగా నమోదు చేయాలనే దానిపై జిల్లాలోని ఎన్యూమరేటర్లందరికీ మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పది మంది ఎన్యూమరేటర్లకు సంబంధించిన కుటుంబాలను ఒక బ్లాక్‌గా గుర్తిస్తూ సూపర్వైజర్లను నియమించారు. పట్ట ణాల్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులు సూపర్వైజర్లుగా పర్యవేక్షించనుండగా మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించనున్న స మగ్ర కుటుంబ సర్వే జిల్లా నోడల్ అధికారిగా స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా వ్యవహరించనున్నారు. మండల నోడల్ అధికారులుగా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వ్యవహరించనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే తీరును వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్‌కు వివరాలు నివేదించనున్నారు. జిల్లా సమాచారం మండలాలు : 18 కుటుంబాలు : 162,046 జనాభా : 7,08, 972 ఎన్యూమరేషన్ బ్లాక్‌లు : 1816 కేటాయించిన ఎన్యూమరేటర్లు : 1901 సూపర్వైజర్లు : 192వచ్చేనెల 6 నుంచి .. ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): నవంబర్ 6 నుంచి 18 వరకు ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మా ట్లాడారు. ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే చేయాలని ఆదేశించారు. ప్రజలకు ముందుగానే టాంటాం ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. నవంబర్ 1 నుంచి 3 వరకు తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా సిద్ధం చేయాలని, 6 నుంచి 18 వరకు ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శ్యామ్‌సుందర్, ఎంపీడీవో వెంకటరాజు, సూపర్వైజ ర్లు, ట్రైనర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదిలా బాద్ రూరల్ ఎంపీడీవో సమావేశ మందిరంలో ఇంటింటి కుటుంబ సర్వేపై ఎన్యుమరేటర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఇందులో మండల ప్రత్యేకాధి కారి పద్మభూషణ్‌రాజు, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ గోవింద్, ఎంపీవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రెరీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా జిల్లాలోని ప్రతీ మండలానికి ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీందర్, సెక్టోరియల్ అధికారి శ్రీకాంత్, ఎంఈవో శ్రీని వాస్, విజయసారధి, మహేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పత్తికి ఒకే మద్దతు ధర●● అధిక ధర ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ● జోగు రామన్నపై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం ఆదిలాబాద్: సీసీఐ దేశమంతా ఒకే మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తుందని ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి జోగు రామన్న తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పత్తి కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు తాను హైదరాబాద్ నుంచి వచ్చి అధికారులు, వ్యాపారులు, రైతులతో కలిసి చర్చించి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చొరవ చూపానన్నారు. అయినప్పటికీ తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో సీసీఐ తక్కువ మద్దతు ధరకు పత్తిని కొంటుందని, అదే గుజరాత్లో ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తుందని ఆయన విమర్శించడం సరికాదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గుజరాత్ రాష్ట్రంలోనూ సీసీఐ ఒకే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, ఈ విషయమై స్వయంగా మాజీ మంత్రిని తీసుకువెళ్లి చూయిస్తానని పేర్కొన్నా రు. అక్కడ అధిక మద్దతు ధర ఉంటే వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తూ లేఖను అక్కడి నుంచే అసెంబ్లీకి పంపిస్తానన్నారు. ఇందులో నాయకులు అయ్యన్న గారి భూమన్న, బ్రహ్మానంద్, ఆదినాథ్, లాలా మున్నా తదితరులు ఉన్నారు. -
No Headline
నజ్రూల్‌నగర్ ఘటనలో నిందితుల అరెస్టుకాగజ్నగర్రూరల్: మండలంలోని నజ్రూల్‌నగర్ విలేజ్ నం.5లో ఈనెల 26న జరిగిన ఘ టనలో బుధవారం ముగ్గురు నిందితులను అరె స్టు చేసినట్లు డీఎస్పీ రామానుజం, కాగజ్‌నగర్‌రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసు విధులను ఆటంకపర్చినందుకు మనీష్ మానిక్‌దా స్, డెబాశిష్ మండల్, బుద్ధేశ్వర్రాయ్లను అరె స్టు చేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, చట్టాన్ని ఎవ రూ చేతిలోకి తీసుకోవద్దని పేర్కొన్నారు. సోష ల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసేవారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. వృద్ధుడి ఆత్మహత్యకౌటాల: మండలంలోని ముత్తంపేట గ్రామానికి చెందిన సర్వర్ లాలూ(59) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుకర్ బుధవారం తెలిపారు. గత కొద్ది రోజులుగా లాలూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడు నితిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తండ్రి మృతి.. కుమారుడి నిరసన
బెల్లంపల్లి: డ్రెయినేజీని మూసివేయడంతో వచ్చిన దుర్వాసన వల్లే తన తండ్రి, సింగరేణి రిటైర్డు కా ర్మికుడు దయానంద్ ప్రసాద్ పాండే (82) మృతి చెందాడని కల్యాణ్పాండే బుధవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలి పాడు. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీలోని 29వ వార్డు బజారు ఏరియా డబ్బుసేట్లైన్లో దయానంద్ప్రసాద్ పాండే నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో వీధి లోని డ్రెయినేజీని తాత్కాలికంగా మున్సి పల్ సిబ్బంది మూసివేశారు. దీంతో మురికి కాలువలో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతుండగా, దు ర్వాసనతోనే తన తండ్రి దయానంద్ప్రసాద్ పాండే మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడని, డ్రెయినేజీని మూసి ఉంచిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్యాణ్పాండ్ ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కల్యాణ్పాండే ఫిర్యాదు చేశాడు. -
స్వగ్రామానికి చేరిన గణేశ్ మృతదేహం
లక్ష్మణచాంద: గత వారం రోజుల క్రితం దుబా య్‌లో మృతి చెందిన ఆ కుల గణేశ్(25) మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మండలంలోని మల్లాపూర్ గ్రా మానికి చెందిన ఆకుల పుష్పలత –పెంటయ్య దంపతుల ఏకై క కుమారుడు గణేశ్ రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 22న కంపెనీలో పని చేసే సమయంలో గుండెపోటుతో మృతిచెందాడు. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. భార్య జయశ్రీ, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, గ్రామస్తుల అశృనయనాల మధ్య గణేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
నార్నూర్: మండలంలోని రాజులగూడ గ్రామానికి చెందిన కుమ్ర రేణుకబాయి(30) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్సై గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండలంలోని ఉషెగాం గ్రామానికి చెందిన తొడసం పార్వతిబాయి –రాంజీ దంపతుల పెద్ద కుతూరు తొడసం రేణుకబాయిని నార్నూర్ మండలం రాజుగూడ గ్రామానికి చెందిన కుమ్ర అంకోష్కు ఇచ్చి 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఆమెకు గత కొన్నేళ్ల నుంచి మతి స్థిమితం లేదు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన రేణుకబాయి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం రాజులగూడ గ్రామ శివారులో ఉన్న బావిలో రేణుకబాయి మృతదేహం లభ్యమైంది. పార్వతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. -
23,10,190
● పెరిగిన ఓటర్ల సంఖ్య 91,027 ● అప్పుడు.. ఇప్పుడు మహిళా ఓటర్లే అధికం ● ముసాయిదా ఓటరు జాబితా విడుదలమంచిర్యాలడెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఓటు నమోదుపై అవగాహన, ఎన్నికల సంఘం, అధికారులు చేపట్టిన కార్యక్రమాలతో ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం మంగళవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు ముసాయిదా జాబితా–2024ను విడుదల చేసింది. పది నియోజకవర్గాల్లో మొత్తం 23,10,190మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 11,31,150 మంది పురుష ఓటర్లు, 11,78,906 మంది మహిళా ఓటర్లు, 134 మంది ఇతరులు ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య 22,19,163 ఉంది. వీరిలో పురుష ఓటర్లు 10,93,381 మంది, మహిళలు 11,25,65మంది, ఇతరులు 126మంది ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటరు జాబితా.. ప్రస్తుత ఓటరు జాబితాను పోల్చి చూస్తే 91,027 మంది ఓటర్ల సంఖ్య పెరిగింది. అప్పుడు.. ఇప్పుడు మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. ఇతర ఓటర్లలోనూ స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. మహిళలే అధికం..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. ప్రతీ ని యోజకవర్గంలోనూ మహిళలే ఎక్కువగా ఉన్నారు. 2023నాటి జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య 11,25,656 ఉండగా.. ముసాయిదా జాబితా ప్రకారం 11,78,906కు పెరిగింది. ఈ లెక్కన 53,250 మంది మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది.ఇదీ ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్య -
దండారీ వేళ కుటుంబంలో విషాదం
● పురుగుల మందు తాగిన అన్నదమ్ములు ● అన్న మృతి, చికిత్స పొందుతున్న తమ్ముడు జైనూర్: ఏజెన్సీ ప్రాంతాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా మండలంలోని గూడమామడ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో మాత్రం విషాదచాయలు అలుముకున్నాయి. దండారీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమైన ఇద్దరు అన్నదమ్ములు చిన్న గొడవతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గూడమామడ గ్రామానికి చెందిన మర్సుకోల గంగారాంకు ఇద్దరు కుమారులు న్యానేశ్వర్, శంకర్ ఉన్నారు. గూడమామడ గ్రామానికి చెందిన దండారీ సోనాపూర్‌కు వెళ్తుండగా వీరిద్దరు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పశువులను మేతకు తీసుకెళ్లేందుకు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా మనస్తాపానికి గురైన వీరు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటి ఆవరణలో వాంతులు చేసుకోవడంతో గమనించిన తండ్రి ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే మర్సుకోల న్యానేశ్వర్(24) మృతి చెందగా, మెరుగైన వైద్యం కోసం మర్సుకోల శంకర్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాగర్ బుధవారం తెలిపారు. -
● కవ్వాల్ టైగర్‌జోన్‌లో పక్షుల కిలకిలలు ● ఏటా శీతాకాలంలో ఇతర ప్రాంతాల నుంచి వలస ● అటవీ ప్రాంతంలో 300 రకాల పక్షులు
బ్లాక్ వింగ్డ్ కై ట్క్రస్టర్డ్ సర్పెంట్ ఈగల్300 రకాలకు పైగా పక్షులువన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకు అవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు పక్షి జాతుల సంరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారించారు. బర్డ్స్ ఫెస్టివల్లో భాగంగా జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు రకాల కొత్త పక్షులను గుర్తించారు. ఈ పక్షుల విశేషాలను అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలో 300లకు పైగా పక్షి జాతులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 200 రకాల పక్షుల వివరాలను సేకరించారు. కళ్లముందే అనేక పక్షి జాతులు.. జన్నారం అటవీ డివిజన్లో కొంగలు, ఉలీ నెక్డ్ స్పార్క్, పిచ్చుకలు, చిలుకలు, వడ్రంగి పిట్ట, చికుముకి పిట్ట, పాలపిట్ట, వల్చర్, అడవి పావురాలు, పిచ్చుకలు, గద్దలు, కింగ్‌ఫిషర్, కోకిల, గోరింకలు, గువ్వలు, బ్లాక్ నెక్డ్ పక్షులు ఇలా అనేక రకాల పక్షులు ఉన్నాయి. వీటితో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 50 రకాల పక్షుల జాతులను కవ్వాల్ టైగర్‌జోన్‌లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.పక్షులను గుర్తిస్తున్నాం ప్రతీ సంవత్సరం వలస పక్షులు వస్తుంటాయి. తిరిగి వెళ్తుంటాయి.ఏటా పక్షులను గుర్తిస్తాం. ఈ సంవత్సరం పక్షుల వలసలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వెళ్తాయి. ఉన్నతాఽ దికారుల ఆదేశాల ప్రకారం టైగర్‌జోన్ వ్యా ప్తంగా వివిధ రకాల పక్షులను గుర్తిస్తున్నాం. – జోగు ఎల్లం, ఎన్టీసీఎస్ సభ్యుడు వలసలు ప్రారంభమయ్యాయి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని ప్రాంతాలకు వివిధ దేశాల నుంచి పక్షులు వలసలు వస్తుంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంతతి పెంచుకుని తిరిగి వెళ్తాయి. ఈ సంవత్సరం చలి తక్కువగా ఉన్నందున ఇప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. నవంబర్ మొదటి వారం వరకు అన్ని రకాల పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. పక్షుల రక్షణ కోసం అటవీశాఖ కృషి చేస్తుంది. – శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల మొదలైన వలసలు.. ప్రతీ సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా పక్షుల వలసలు ప్రారంభమయ్యాయి. ఏటా అక్టోబర్ చివరి వారం నుంచి జనవరి వరకు వివిధ దేశాల నుంచి పక్షులు వచ్చి సంతతిని పెంచుకుంటాయి. అడవిలో నీటి ఆవాసాలు, గడ్డి క్షేత్రాలు ఉండటం వల్ల పక్షులు పెద్ద సంఖ్యలో వలస వస్తున్నాయి. జన్నారం డివిజన్లో బైసన్‌కుంట, మైస మ్మ కుంట, ఘనిషెట్టి కుంట, కల్పకుంట, ఉట్నుర్ డివిజన్ ఉడుంపూర్ గాదం చెరువు, కడెం ప్రాజెక్టు, కాగజ్‌నగర్ ప్రాంతాలలో ఆవా సాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.స్మాల్ మిల్వెట్ఇండియన్ కోర్మోరెంట్ -
No Headline
ఈ పక్షిపేరు ఎరుపు అవదావత్ లేదా రెడ్ మునియా పక్షి. ఈ పక్షి ఎస్ట్రీల్డిడే సంతతికి చెందిన పిచ్చుక. ఇది ఉష్ణమండలంలోని ఆసియా ప్రాంతంలో గడ్డి ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. శీతాకాలంలో తమ సంతతిని పెంచుకోవడానికి ఇటీవల కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అడవుల్లో గల నీటి కుంటలో కనిపించింది.భూమిమీద కొన్ని వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి. మనుగడ సాగించేందుకు పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంటాయి. కవ్వాల్ టైగర్‌జోన్‌కు సైతం ఏటా శీతాకాలంలో ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆసియాలోని ఇతర దేశాల నుంచి పక్షులు అతిథులుగా వస్తున్నాయి. ఈ పక్షులు శీతాకాలంలో ఇక్కడే ఉండి తమ సంతతిని పెంచుకుని తిరిగి వాటి ప్రాంతాలకు వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. – జన్నారం ట్రికోలర్ద్ మోనియావైట్ ఐ బుజర్డ్ పక్షిఆసియన్ పీడ్ స్టార్లింగ్ -
బాస్కెట్‌బాల్ పోటీలకు ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఎంపిక
భైంసా: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ అభినందించారు. బుధవారం ఎంపికై న విద్యార్థులతో కలిసి మాట్లాడారు. బాసర క్యాంపస్‌లో క్రీడారంగాని కి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. క్యాంపస్స్థాయిలో ఎంపికై న విద్యార్థులు బెంగుళూర్లో జరిగే సౌత్‌జోన్ పోటీల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో స్పో ర్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్‌రావు, శ్యాంబా బు, వసంత, విజయ, రవి, కిరణ్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైల్వే జేఈ మృతి బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఏరియా పరిధిలోని రైల్వే కాలనీలో విద్యుదాఘాతానికి గురై రైల్వే జూనియర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండుగ నేపథ్యంలో సాయి హిమాన్ష్ (29) తాను నివాసం ఉంటున్న క్వార్టర్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఆకస్మికంగా విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త సాయి హిమాన్ష్ కళ్లముందే కానరాని లోకాలకు వెళ్లడంతో భార్య అనూష కన్నీరుమున్నీరైంది. వారి స్వస్థలం వరంగల్ జిల్లాలోని రాంపేట గ్రామం. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి మూడేళ్ల కుమారుడు సాయిరాం ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరస్పరదాడిలో పలువురిపై కేసు నమోదుబెల్లంపల్లిరూరల్: కుటుంబ కలహాలతో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. తాళ్లగురిజాల ఎస్సై చుంచు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామానికి చెందిన కచ్చు మనీషా అదే గ్రామానికి చెందిన కచ్చు రాజ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరి ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో మనీషా తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటి పక్కనే ఆడుకుంటున్న కూతురు సహన్షితో రాజ్‌కుమార్ మాట్లాడుతుండగా భార్య మనీషా, అత్త రాజేశ్వరి దుర్భాషలాడడంతో పాటు రాజ్‌కుమార్, అతని తల్లి వజ్రమ్మలపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనీషా, రాజేశ్వరిలపై కేసు నమోదైంది. కాగా మనీషా భర్త రాజ్‌కుమార్, మామ భూమయ్య, అత్త వజ్రమ్మ, మరుదులు మహేశ్, రాజశేఖర్‌లు అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తనపై, తన తల్లి రాజేశ్వరిలపై దాడి చేసి గాయపర్చారని ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
No Headline
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సిర్పూర్ 1,14,708 1,14,896 8 2,29,619 ఆసిఫాబాద్(ఎస్టీ) 1,12,958 1,14,692 16 2,27,666 చెన్నూర్(ఎస్సీ) 96,549 98,383 7 1,94,939 బెల్లంపల్లి(ఎస్సీ) 87,800 89,819 12 1,77,631 మంచిర్యాల 1,38,929 1,41,722 26 2,80,677 ఆదిలాబాద్ 1,20,382 1,25,855 6 2,46,243 బోథ్(ఎస్టీ) 1,02,794 1,09,299 2 2,12,095 ఖానాపూర్(ఎస్టీ) 1,10,314 1,15,526 13 2,25,853 నిర్మల్ 1,22,553 1,37,040 20 2,59,613 ముధోల్ 1,24,163 1,31,674 17 2,55,854 -
విద్యార్థినికి సీఎం ఆర్థికసాయం
జైనూర్: నీట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పేదింటి విద్యా కుసుమం సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని జెండాగూడ గ్రామానికి చెందిన మెస్రం న్యానేశ్వర్ –లక్ష్మి దంపతుల కుమార్తె సాయిశ్రద్ధ నీ ట్లో ఎస్టీ కోటాలో 103వ ర్యాంకుతో మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. పేద కుటుంబం కావడంతో కాలేజీలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సాయిశ్రద్ధ పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం సా యిశ్రద్ధ ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వైద్యవి ద్యకు అవసరమైన పూర్తి మొత్తం ఆర్థికసాయం చేసినట్లు సాయిశ్రద్ధ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్: క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల రాజేశ్ మంగళవారం ఎంపీ గోడం నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రూ.7 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు నివేదికలు పంపినట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యేలా చొరవ చూపాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, పెటా ప్రధాన కార్యదర్శి స్వామి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ కాంతారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఓటు నమోదుకు దూరం
● ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై పట్టభద్రుల నిరాసక్తత ● ఆసక్తి చూపని టీచర్లు ● నవంబర్ 6తో ముగియనున్న గడువు కై లాస్‌నగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై మంగళవారం నాటికి నెల రోజులవుతున్నా ఓటరుగా నమోదుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. నవంబర్ 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటి వరకు ఆసక్తి చూపని ఓటర్లు ఏడు రోజుల వ్యవఽధిలో ఎంతమంది నమోదు చేసుకుంటారనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్సీగా పోటీ పడే అశావాహులు ప్రత్యేక పోస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి ఆశించిన ఫలితం కన్పించడం లేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఓటుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రత్యేక కేంద్రాలకు స్పందన కరువు ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్లుగా నమోదు కోసం జిల్లాలోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కేంద్రాలను ఏర్పా టు చేసింది. ప్రత్యేక ఉద్యోగులను నియమించి దరఖాస్తులను అందుబాటులో ఉంచినప్పటికీ స్పందన మాత్రం కన్పించడం లేదు. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ దరఖాస్తులు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. అటు పట్టభద్రులు, ఇటు టీచర్లు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఓటరు నమోదుకు జిల్లాలో స్పందన కరువవుతోంది. పట్టించుకోని టీచర్లు ఓటరు నమోదును జిల్లాలోని ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోవడం లేదు. ఇందుకు ఇప్పటి వరకు అందిన దరఖాస్తులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల పరిఽ దిలో సుమారు 15 వేలమంది పట్టభద్రులు ఉంటారని అంచనా వేస్తుండగా ఇప్పటి వరకు 6,66 2 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్క న చూస్తే వీరి నమోదు సైతం తక్కువగానే కన్పి స్తోంది. టీచర్లతో పోల్చితే కాస్తా పర్వాలేదనిపిస్తోంది. ఉపాధ్యాయ ఓటర్ల నమోదు మాత్రం న త్తనడకన కొనసాగుతోంది. పోటీలో నిలిచే అ భ్యర్థులు ఇది వరకే జిల్లాలో పర్యటించి ఉపాధ్యా య సంఘాలు, పట్టభద్రులతో ప్రత్యేకంగా స మావేశాలు నిర్వహించి మద్దతు అందించాలని కోరారు. జిల్లాలో 2,700 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లుగా విద్యాశాఖ గణంకాలు చెబుతున్నా యి. ఇందులో ఇప్పటి వరకు కేవలం 380 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికతో తమకు ఒరిగేదేముందనే భావనతోనే నమోదుకు ముందుకు రానట్లుగా తెలుస్తోంది. మావల భేష్ ... ఓటర్ల నమోదులో చిన్న మండలమైన మావల ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం మూడే గ్రామ పంచాయతీలు ఉన్న ఈ మండలంలో ఇప్పటి వరకు 672 మంది పట్టభద్రులుగా, టీచర్లు సైతం 85 మంది ఓటరుగా నమోదు చేసుకుని భేష్ అనిపించారు. ఇతర మండలాలను పరిశీలిస్తే జిల్లాలోని ఏడు మండలాల్లో రెండంకెల సంఖ్య కూడా దాటని పరిస్థితి ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతమైన ఆదిలాబాద్ అర్బన్ ఓటర్ల నమోదులో అగ్రస్థానంలో నిలువగా గిరిజన మండలమైన గాదిగూడ అట్టడుగు స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ పట్టభద్రులు 19 మంది నమోదు చేసుకుంటే టీచర్లు ఒక్కరుకూడా తమపేరును ఎన్రోల్ చేసుకోకపోవడం జిల్లాలో సాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ తీరుకు అద్దం పడుతోంది. జిల్లాలో ఓటరు నమోదు వివరాలు మండలం పట్టభద్రులు టీచర్లు మావల 672 85 నేరడిగొండ 325 18 నార్నూర్ 185 16 జైనథ్ 345 08 ఆదిలాబాద్‌రూరల్ 469 24 గుడిహత్నూర్ 153 04 ఇచ్చోడ 334 18 బేల 246 06 గాదిగూడ 19 – బోథ్ 538 20 ఉట్నూర్ 475 29 ఆదిలాబాద్‌అర్బన్ 1825 118 బజార్హత్నూర్ 230 11 ఇంద్రవెల్లి 149 04 తలమడుగు 349 08 భీంపూర్ 144 02 తాంసి 152 03 సిరికొండ 62 06 నమోదు చేసుకోవడం ఇలా... పట్టభద్రులు ఓటరుగా నమోదు కోసం ఫారం–18తో దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తయి ఉండాలి. టీచర్లు, అధ్యాపకులైతే 2018 నవంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మూడు సంవత్సరాలకు తగ్గకుండా ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిలో బోధించి ఉండాలి. ఇలాంటి వారు ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గెజిటెడ్ అధికారి ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఓటరు ఐడీ పత్రాలతో పాటు ఫొటోతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో www.c-Šobèlte a nfa na. nic.i n లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. -
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలి
ఆదిలాబాద్‌టౌన్: పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మంగళవారం సీసీఐ డిప్యూటీ జీఎం ఆద్యమిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ కమర్షియల్ కొనుగోలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. గుజరాత్ పత్తి కంటే ఆదిలాబాద్ పత్తి నాణ్యతగా ఉంటుందని, ఇక్కడి రైతులకు ధర తక్కువగా ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నెల 25 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని, ఎమ్మెల్యే, అధికారులు వ్యాపారులతో కుమ్మకై ్క గుడ్గోనా చేసి ధర నిర్ణయించి ప్రకటించారన్నారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణకై లాస్‌నగర్: నిర్మ ల్ నుంచి బదిలీపై వచ్చిన మున్సిపల్ కమిషనర్ రాజు మంగళవారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన తనకు పట్టణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. పారిశుధ్య నిర్వహణతో పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వో జాదవ్ కృష్ణ, డీఈ తిరుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు నరేందర్, శంకర్, ఆర్ఐ ఒరగంటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
సర్వేలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కై లాస్‌నగర్: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలను భాగస్వాములను చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే సమున్నత ఆశయంతో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోందన్నారు. ప్రణాళికశాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తుందని, ప్రతీ మండలానికి ఒక నోడల్ ఆఫీసర్‌గా జిల్లాస్థాయి అధికారిని నియమించాలని, అదనపు కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, సీపీవో వెంకట రమణ, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీరోజు బడులు తనిఖీ చేయాలి
● పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదిలాబాద్‌టౌన్: మండల విద్యాధికారులు ప్రతీరో జు రెండు పాఠశాలలను తప్పనిసరిగా తనిఖీ చే యాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎంఈ వోలతో జిల్లాలోని ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్ల కొరత తీరిందని, విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసేలా చూడాలన్నారు. డిసెంబర్లో 3,6,9 తరగతులకు న్యాస్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, ఎస్సీఈ ఆర్టీ ప్రొఫెసర్లు, ఎంఈవోలు ఉదయ్‌రావు, సరోజ, కంటె నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి
ఆదిలాబాద్‌రూరల్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబర్చాలని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చాందా క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాలబాలికల అథ్లెటిక్స్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారధితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో రాణిస్తే భవిష్యత్‌లో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ కాంతారావు, వీజీయస్ అకాడమీ నిర్వాహకులు రాకేష్, జ్యోతి స్వరన్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి యోగా పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం అండర్ 14, 17 బాల బాలికల జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. 82 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీపడ్డారు. పోటీల కన్వీనర్ పీడీ రేణుక, యోగా మాస్టర్లు సంతోష్, చేతన్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పీడీ రేణుక మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు నవంబర్ 2న నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే జోనల్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. జోనల్ పోటీల్లోనూ సత్తా చాటిన వారు కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆమె పేర్కొన్నారు. -
జిల్లా ఓటర్లు @ 4,58,338
● పురుషుల కంటే మహిళలే అధికం ● ముసాయిదా ఓటరు జాబితా విడుదల ● నవంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ కై లాస్‌నగర్: జిల్లాలో 4,58,338 మంది ఓటర్లు ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టరేట్‌తో పాటు ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయాలు, అన్ని తహసీల్దార్ కార్యాలయాల నోటీసుబోర్డులపై అందుబాటులో ఉంచారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్వో)ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,23,176 మంది, మహిళా ఓటర్లు 2,35,154 మంది, ఇతరులు మరో 8 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే జిల్లాలో మహిళా ఓటర్లు 11,978 మంది ఎక్కువగా ఉన్నారు. 28 వరకు అభ్యంతరాల స్వీకరణ ముసాయిదా ఓటరు జాబితాపై ఈ నెల 29 నుంచి నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించారు. నవంబర్ 9, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సైతం నిర్వహించనున్నారు. అధికారులకు అందిన అభ్యంతరాలు, ఆక్షేపణలను డిసెంబర్ 24లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించి 2025 జనవరి 6న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
● దిగుబడి పాయే.. ధర లేదాయే ● ప్రైవేట్ వ్యాపారులు నడ్డీ విరుస్తున్నారని దిగాలు ● మెజార్టీ రైతులకు అందని మద్దతు ధర ● కళ్ల ముందే ఆశలు అడియాశలు ● సీసీఐ కొన్నది నామమాత్రంగానే..
సాక్షి,ఆదిలాబాద్: మొదటి రోజు మార్కెట్‌కు వ చ్చిన పత్తి వాహనాలకు సంబంధించి ప్రైవేట్ వ్యా పారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున ధర చె ల్లించారు. ఆ తర్వాత రోజు నుంచి తేమ ఆధారంగా కోత పెడుతూ రైతులను మార్కెట్లో వ్యాపారులు న డ్డి విరుస్తున్నారు. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో అంతకంటే ఎక్కువ తేమ వస్తే ఆ రైతునే అసలు ప రిగణలోకి తీసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇక్కడే నిలువుదోపిడి జరుగుతోంది. ప్రభు త్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.7,521గా నిర్ణయించింది. ఇక్కడ 8 శాతం తేమ ఉంటేనే సీసీఐ మాత్రం ఈ ధర చెల్లిస్తుంది. ఇంతే తేమ ఉన్నప్పటికీ ప్రైవేట్‌లో మాత్రం రూ.7,120 మాత్రమే ఇస్తున్నారు. ఈ రకంగా పత్తి రైతును వ్యాపారులు ఎంత దోపిడి చేస్తున్నారనేది తేటతెల్లం అవుతోంది. పత్తి రైతు దుస్థితి.. జిల్లాలో ఈనెల 25న పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పత్తి ధర విషయంలో రైతులు ఆందోళన చేయడంతో ఆరోజు కొనుగోలే మొదలు కాలేదు. మరుసటి రోజు ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ ధర కూడా ఇవ్వడం లేదు. తేమ ఆధారంగా మరింత కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇప్పటివరకు పత్తి విక్రయించిన రైతుల్లో కనిష్టంగా ఓ రైతుకు 23 శాతం తేమతో క్వింటాలుకు రూ.6,052 చొప్పున కొనుగోలు చేశారు. ఈ లెక్కన మద్దతు ధరకు పత్తి రైతు ఎంత దూరంలో నిలిచాడో తేటతెల్లమవుతోంది. ఈ రైతు పేరు ఉత్తం చౌహాన్. తలమడుగు మండలం తలాయిగూడకు చెందినవాడు. ఈ వానకాలంలో తనకున్న 23 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మొదటి తీతలో కేవలం 19 క్వింటాళ్లు మాత్రమే చేతికందింది. ఈ పత్తికై నా మార్కెట్లో మంచి ధర లభిస్తుందని ఆశించాడు. అయితే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.6,840 చొప్పున కొనుగోలు చేయడంతో రూ.లక్ష 30వేల వరకు చేతికందాయి. ఈ డబ్బులు ఆయన ప్రణాళిక ఖర్చులకు ఎటూ సరిపోని పరిస్థితి ఉంది. వచ్చే వేసవి వరకు తన చెల్లెలి వివాహం చేసేందుకు డబ్బులను కూడబెడదామనుకున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో అనేక మంది పత్తి రైతుల పరిస్థితి ఇలాంటిదే.