సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.19 తగ్గింపు | Sakshi
Sakshi News home page

సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.19 తగ్గింపు

Published Sat, Aug 30 2014 8:08 PM

సబ్సిడీయేతర గ్యాస్ ధర రూ.19 తగ్గింపు

న్యూఢిల్లీ:వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల తగ్గింపుతో 14.2 కేజీల సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.19 తగ్గింది.  దీంతో ప్రస్తుతం ఉన్న సిలిండర్ ధర రూ. 920 నుంచి రూ. 901కి తగ్గింది.

ఇదిలా ఉండగా డీజిల్ ధరపై మరోసారి భారం మోపారు . తాజాగా డీజిల్ ధర స్థానిక పన్నులో పెరుగుదల కలుపుకుని రూ. 57 పైసలు పెరిగి, లీటరుకు రూ. 58.40 నుంచి రూ.58.97కు పెరిగింది. అయితే పెట్రోల్ ధర లీటర్‌పై రూ.1.51 పైసలు తగ్గింది. ఈ సవరించిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు రేట్లు తగ్గడంతో పెట్రోల్‌పై రూ.1.51 తగ్గించామని, స్థానిక అమ్మకం పన్నుల్లో తగ్గింపు కూడా కలుపుకుంటే ఢిల్లీలో తగ్గింపు రూ.1.81కి చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది.

Advertisement
Advertisement