ఆ ఊళ్లో అంతా ఇల్లరికపు అల్లుళ్లే! | Sakshi
Sakshi News home page

ఆ ఊళ్లో అంతా ఇల్లరికపు అల్లుళ్లే!

Published Thu, Apr 23 2015 5:35 PM

ఆ ఊళ్లో అంతా ఇల్లరికపు అల్లుళ్లే! - Sakshi

ఆ ఊళ్లో అమ్మాయిలు ఎవరూ అత్తారింటికి వెళ్లడం ఎరుగరు. ఎందుకంటే, అక్కడ అందరూ ఇల్లరికపు అల్లుళ్లే ఉన్నారట. అల్లుళ్లందరూ మూటాముల్లె సర్దుకుని తమ మామగార్ల ఇళ్లకు వచ్చేస్తారు. ఈ విచిత్రం ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి నగర పరిధిలోగల కరాయ్ టౌన్షిప్లో కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 60 కుటుంబాలున్నాయి. వాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే. ఆ వీధి మొత్తాన్ని కూడా 'అల్లుళ్ల వీధి' అంటారు.

వీళ్లలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లేనని, అయితే ఈ ఊరు వచ్చి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారని స్థానికులు చెప్పారు. ఇలాంటి వ్యవహారం ఇంకెక్కడా చూసిన దాఖలాలు లేవన్నారు. దాదాపు 35 ఏళ్లుగా ఇక్కడ ఇలాగే కొనసాగుతోందని తెలిపారు. తర్వాత కాన్పూర్, ఫతేపూర్, ప్రతాప్గఢ్, అలహాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చే అల్లుళ్లు ఇక్కడే ఉండిపోయి స్థిర నివాసం ఏర్పరుచుకుంటారన్నారు. అమ్మాయిలు కూడా ఎప్పుడూ అత్తవారిళ్లకు వెళ్లలేదని హాజీ ఒవైస్ తెలిపారు. ఆయన కూడా ఈ ఊరి అల్లుడే. తన కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేశానని, ఇప్పుడు ఆమె తన భర్త, పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటోందని, వాళ్ల ఇల్లు కూడా తమ ఇంటికి 5 నిమిషాల నడక దూరంలోనే ఉందని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement