70 ఏళ్ల మహిళపై యువకుడు అత్యాచారం | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల మహిళపై యువకుడు అత్యాచారం

Published Thu, Aug 21 2014 7:54 PM

70 ఏళ్ల మహిళపై యువకుడు అత్యాచారం - Sakshi

హైదరాబాద్: దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. కామాంధులు వయసు తారతమ్యాలు కూడా మరచి అతి పాశవికంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో 70 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. ఆగస్టు 19 వ తేదీన వికారాబాద్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఒక మహిళపై ముజాహిద్(20) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఇంటికి వంట పని చేయడానికి వెళ్లిన క్రమంలో ఆ యువకుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 

ఈ ఘటనకు సంబంధించిన ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ యువకుడ్నిఅదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు వికారాబాద్ సీఐ వీఎల్ రామ్ తెలిపారు. ప్రస్తుతం అతన్ని జ్యూడిషియల్ రిమాండ్ లో ఉంచామన్నారు.

Advertisement
Advertisement