కోట్ల పనులకు తూట్లు | Sakshi
Sakshi News home page

కోట్ల పనులకు తూట్లు

Published Mon, Jul 6 2015 1:06 AM

కోట్ల పనులకు తూట్లు

పుష్కర ఏర్పాట్ల అంచనాల్లోనే వంచన
 
 అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
 పర్యవేక్షించకుండా పరోక్ష సాయం

మచ్చుకైనా కానరాని నాణ్యత
నేడు కలెక్టర్ పుష్కరఘాట్ల సందర్శన

 
పుష్కర స్నానం..పుణ్యఫలం. పుష్కరాల పనులేమో ధనఫలం! రూ.కోట్లు ఖర్చు చేసినా.. లక్షల స్థారుు నాణ్యత కూడా పనుల్లో కన్పించడం లేదు. పుష్కర పనులకు భారీగా అంచనాలు రూపొందించారు. అవి మంజూరయ్యూక తూతూమంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. అధికారులు వత్తాసు పలుకుతుండగా.. కాంట్రాక్టర్లు భారీమొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. ఈ అంచనాల మాటున దాగిన వంచన ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమైంది.

వరంగల్: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మాత్రమే 2003 పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ నిర్మించారు. పుష్కర స్నానాలకు ఒకే రోజు వచ్చిన భక్తులు లక్షకు మించలేదు. కానీ, గతంలో లక్షలాదిగా భక్తులు వచ్చారని, ఈసారి కూడా తరలివస్తారని అధికారులు అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రతిపాదించారు. నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎండోమెంట్, రోడ్లు, భవనాల శాఖతో కలిపి సూమారు రూ. 25కోట్లు కేటాయించినట్లు తెలిసింది. పుష్కరాల్లో చేపట్టే పనులను ఉద్దేశించిన జీఓల్లో అభివృద్ధి పనుల పేర్లు స్పష్టంగా పేర్కొనకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. కాంట్రాక్టర్లు కోరిన విధంగా పనులకు రూపకల్పన చేసినట్లు తెలిసింది.
 
 పంచాయతీ రాజ్ పరిధిలో..

 పంచాయతీరాజ్ మైన ర్ ఇరిగేషన్ శాఖకు రూ.9.70కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద పాత ఘాట్‌కు అదనంగా 100మీటర్ల నిర్మాణం, ముల్లకట్ట, మంగపేట గోదావరి రేవు వద్ద స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తికావస్తున్నారుు. నాణ్యతపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు రోడ్ల మరమ్మతు కోసం రూ.10.59 కోట్లు కేటాయించింది. తారురోడ్లు పెచ్చులు లేస్తూ వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారుు. ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు రూ.1.40 కోట్లతో రోడ్డు మరమ్మతులు చేశారు. ఇరువైపులా సైడ్ బర్మ్‌లు పోసి రోలింగ్ చేయాల్సి ఉన్నా విస్మరించారు. ఇది ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుంది.
 
స్వరాష్ట్రంలో తొలి పుష్కరాలు.. సరిగ్గా ఎనిమిది రోజుల్లో ప్రారంభమవుతారుు. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అధికారులతో కుమ్మక్కై భారీగా అంచనాలు రూపొందించి.. సర్కారు సొమ్మును దండుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విస్మరిస్తున్నా.. అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
 

Advertisement
Advertisement