ఇక ఉద్యోగాల తెలంగాణ | Sakshi
Sakshi News home page

ఇక ఉద్యోగాల తెలంగాణ

Published Fri, Jul 3 2015 11:30 PM

telangana will be for aspirants and un employes

జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): భవిష్యత్ మొత్తం ఉద్యోగాల తెలంగాణ కాబోతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) సభ్యుడు సి.విఠల్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రానున్న 15 సంవత్సరాలు మొత్తం ఉద్యోగాల జాతర ఉంటుందన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కమల్‌నాథ్ కమిటీ ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కావడం లేదని, కావాలనే జాప్యం చేస్తుందన్నారు. మన ఉద్యోగుల సంఖ్య తేలితే ఇంకా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుందని, దీంతో ఉద్యోగాలను ప్రకటించేందుకు వీలుంటుందని చెప్పారు. ఉద్యోగుల విభజనకు అక్టోబర్ 31 వరకు గడువు ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ అధికార వెబ్ సైట్‌కు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, దీంతో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో అర్థం అవుతుందన్నారు.


 

Advertisement
Advertisement