ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ప్రసంగ పుస్తకాలు | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ప్రసంగ పుస్తకాలు

Published Fri, Sep 19 2014 3:35 AM

ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ప్రసంగ పుస్తకాలు - Sakshi

సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాలు పలు విభాగాల అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక కార్యక్రమాల్లో చేసిన ముఖ్య ప్రసంగాలను పుస్తక రూపంలో అందజేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలకు సంబంధించి మూడు పుస్తకాలు ముద్రించారు. వీటిని ప్రతీ మండల పరిషత్ కార్యాలయానికి పంపిస్తున్నారు. ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక అధికారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.

హైదరాబాద్ సమాచార పౌరసంబంధాలశాఖ వారు వీటిని ముద్రించారు.‘తెలంగాణ పునరావిష్కరణ-బంగారు తెలంగాణకు బాటలు’ పేరుతో ఈ ఏడాది జూలై 7న హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన  కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అధికారులకు వివరించిన విషయాలను ఈ  పుస్తకంలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని పుస్తక రూపంలోకి తెచ్చారు.

‘బంగారు తెలంగాణ కు బాటలు’ పేరుతో మరో పుస్తకం ముద్రించారు. దీనిలో  హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జూన్ 2న జరిగిన నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో సీఎం చేసిన ప్రసంగ పాఠం ఉంది. ఈ మూడు పుస్తకాలను గులాబీ రంగులో ఆకర్షణీయంగా ముద్రించారు. గురువారం గీసుకొండ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు వీటిని సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అందజేశారు.
 

Advertisement
Advertisement