డ్రంక్ అండ్ డ్రైవ్లో 10 మందిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో 10 మందిపై కేసు నమోదు

Published Wed, Dec 17 2014 9:32 PM

Drunk and drive case files on 10 people in Karimnagar

కరీంనగర్:  వాహనాదారులు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణాలుమిదికీ తెచ్చుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం చట్ట రీత్యా నేరమని పోలీసులు ఒక వైపు హెచ్చరిస్తున్నానే ఉన్నారు.  మద్యం సేవించి వాహనం నడపడంతో వాహనదారులు తరుచూ రోడ్డుప్రమాదాలకు గురవుతున్నారు.

ఈ ప్రమాదాలను సాధ్యమైనంత మేర తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ చర్యలో భాగంగా కరీంనగర్ జిల్లాలో బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలను ఆపి తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 10 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement